Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

సచిన్ రిప్లేతో యూవీ దిమ్మతిరిగింది.!

Sachin Tendulkar accepts Yuvraj Singhs challenge and puts the ball back in his court

ముంబై: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇచ్చిన 'కీప్ ఇట్ అప్'చాలెంజ్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అదిరిపోయే రిప్లే ఇచ్చాడు. కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ ముగిసే వరకూ తాను ఇంట్లోనే ఉంటానని చెబుతూ యూవీ.. సోషల్ మీడియా వేదికగా ఓ చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు.

ఈ చాలెంజ్‌లో భాగంగా బ్యాట్‌ను అడ్డంగా తిప్పి బంతిని కొడుతూ.. సచిన్‌, రోహిత్‌, హర్భజన్‌లకు యూవీ సవాల్ విసిరాడు. తాజాగా ఆ చాలెంజ్‌‌కు స్పందించిన సచిన్‌ వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకొని ఈ సవాల్‌ను పూర్తిచేసి యూవీకి ప్రతి సవాల్‌ చేశాడు.

కళ్లకు గంతలు కట్టుకొని..

‘యూవీ నువ్వు నాకు చాలా సులువైన చాలెంజ్ ఇచ్చావు. కానీ నేను ఇప్పుడు మీకు కష్టమైన సవాల్‌ను విసురుతున్నాను' అంటూ సచిన్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం సచిన్‌ చేసిన ఫీట్‌ నెటిజన్లతో పాటు పలువురు క్రికెటర్లను తెగ ఆకట్టుకుంటోంది.

హనుమంతుని ముందు కుప్పి గంతులు..

హనుమంతుని ముందు కుప్పి గంతులు..

క్రికెట్‌కు సంబంధించిన ఛాలెంజ్‌లు సచిన్‌కు విసిరి ఎవరూ పప్పులో కాలు వేయకూడదని నెటిజన్లు సరదాగా కామెంట్‌ చేస్తున్నారు. ఇక మరికొందరు ‘నువ్వు నిజంగా దేవుడివి సామి' అంటూ మాస్టర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘హనుమంతుని ముందు కుప్పి గంతులు' అంటే ఇదే కాబోలని కూడా కామెంట్ చేస్తున్నారు.

ఇక సచిన్ విసిరి ప్రతి సవాల్‌పై యూవీ స్పందించాడు. ‘నేను దిగ్గజానికి ఛాలెంజ్ విసిరానని తెలుసు. ఆయనలా చేయడానికి నాకు కనీసం వారం అయినా పడుతుంది''అని యూవీ కామెంట్ చేశాడు.

భజ్జీ.. నీవల్ల కాదు

యూవీ విసిరిన కీప్ ఇట్ అప్ చాలెంజ్‌ను భజ్జీ స్వీకరించాడు. లాక్‌డౌన్ అయిపోయేవరకు ఇంట్లోనే ఉంటానని తెలియజేస్తూ.. చిన్న పిల్లల బ్యాట్‌తో యూవీ సవాల్‌ను పూర్తి చేశాడు. కాకపోతే బ్యాట్‌ను అడ్డం పెట్టకుండా.. మాములుగానే బంతితో ఆడాడు. పైగా ఈ సవాల్‌ను తాను బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, శిఖర్ ధావన్, యునైటెడ్ నేషన్స్‌కు విసిరాడు.

అయితే భజ్జీ ఇలా చేయడంతో అతన్ని యూవీ ట్రోల్ చేశాడు. సవాల్ విసిరే ముందే హర్భజన్ వల్ల కాదని చెప్పిన సిక్సర్ల సింగ్..తాజాగా ‘భజ్జీ.. నువ్వో పిల్లాడివి.. బ్యాట్‌ను అడ్డం పెట్టి చేయలేవని నాకు తెలుసు' అని కామెంట్ చేశాడు.

సచిన్ డబుల్ సెంచరీపై స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు!

Story first published: Sunday, May 17, 2020, 14:12 [IST]
Other articles published on May 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+