వివాదాస్పద పేసర్ శ్రీశాంత్‌పై ముగిసిన బీసీసీఐ నిషేధం..!

తిరువనంతపురం: టీమిండియా వివాదాస్పద పేసర్ శ్రీశాంత్‌పై భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) విధించిన నిషేధం ఆదివారంతో ముగిసింది. 2013 ఐపీఎల్ సందర్భంగా రాజస్తాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారన్న అభియోగాలపై శ్రీశాంత్, అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లపై బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ జీవిత కాలం నిషేధం విధించింది. అయితే దీనిపై శ్రీశాంత్ న్యాయపోరాటం చేయడంతో.. గతేడాది మార్చి 15న సుప్రీంకోర్టు బోర్డు నిర్ణయాన్ని పక్కన పెట్టింది. జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన సుప్రీం బెంచ్... మూడు నెలల్లో డీకే జైన్ సమీక్ష చేపడతారని పేర్కొంది.
ఇక 2019 ఆగస్టు 7న జారీ చేసిన ఆదేశాల్లో జైన్... శ్రీశాంత్‌పై నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేశారు. శ్రీశాంత్ 36 ఏళ్ల వయసుకు రావడం, అది ఒక పేసర్ కెరీర్ ముగింపు దశ కావడమే తన నిర్ణయానికి కారణమని ఉత్తర్వుల్లో జైన్ పేర్కొన్నారు. ఈ నిషేధకాలం నేటితో (సెప్టెంబర్14)పూర్తయింది.

14రన్స్.. రూ.10 లక్షలు..
స్పాట్ ఫిక్సింగ్‌ను ప్రోత్సహించిన రీత్యా శ్రీశాంత్‌పై విధించిన నిషేధాన్ని బోర్డు గతంలో కోర్టు ఎదుట గట్టిగా సమర్థించుకుంది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన రెండో ఓవర్‌లో 14 పరుగులు ఇచ్చేలా శ్రీశాంత్ ఫిక్సింగ్‌కు ఒప్పుకొన్నాడని, రూ.10 లక్షలు కూడా తీసుకున్నాడని బోర్డు న్యాయవాది పరాగ్ త్రిపాఠి కోర్టుకు టెలిఫోన్ సంభాషణల రికార్డును అందజేశారు. అయితే, ఇందుకు బలమైన ఆధారాలేమీ లేవంటూ క్రికెటర్ తరఫు న్యాయవాది ఖండించారు.
నేనెప్పుడూ చీట్ చేయలేదు..
ఇక నిషేధం ముగియడంతో శ్రీశాంత్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.‘నాకు స్వేచ్ఛ లభించింది. మళ్లీ నేను మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి దొరికింది. వ్యక్తిగతంగానూ నాకు ఇది గొప్ప ఉపశమనం. మరో ఐదు నుంచి ఏడేళ్లు క్రికెట్ ఆడుతా. ఏ జట్టు తరఫున ఆడినా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా. క్రికెట్‌లో నేనెప్పుడూ మోసం చేయలేదు. సరదాగా ఆడే మ్యాచ్‌ల్లో కూడా నేను నిబద్దతో ఆడుతా.
ఉద్దేశపూర్వకంగా పరుగులు ఇవ్వాలని ఎవరికి బంతులు వేయను. ఏ పరిస్థితుల్లోనైనా జట్టు విజయం కోసమే పోరాడుతా. ప్రస్తుతం నాపై ఉన్న నిషేధం పూర్తయింది. నేను స్వేచ్చగా నాకిష్టమైన ఆటను ఆడవచ్చు'అని శ్రీశాంత్ ఆనందం వ్యక్తం చేశాడు.

నిజం దాచినా దాగదు..
ఇక శ్రీశాంత్ నిషేధం ముగియడంపై అతని సతీమణి భువనేశ్వరి కుమారి ట్విటర్ వేదికగా సంతోషం వ్యక్తం చేసింది. నిజం దాచినా దాగదని పేర్కొంది. ‘ఈ లోకంలో మూడు విషయాలు ఎంత దాచినా దాగవు. అవి సూర్యుడు, చంద్రుడు, నిజం. ఓంశాంతి'అని ట్వీట్ చేసింది. ఇక శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్‌లు ఆడటంతో పాటు ఐపీఎల్‌లోనూ 44 మ్యాచ్‌లు ఆడాడు. భారత్ గెలిచిన 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో సభ్యుడిగా ఉన్న శ్రీశాంత్.. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఓ మ్యాచ్‌లో సీనియర్ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌పై కవ్వింపులకి దిగి అతనితో శ్రీశాంత్ చెంపదెబ్బ కూడా తిన్నాడు.

కేరళ తరఫున రంజీల్లో
శ్రీశాంత్‌పై తాజాగా నిషేధం ముగియడంతో.. అతను తొలుత రంజీల్లో కేరళ తరఫున బరిలోకి దిగే అవకాశం ఉంది. నిషేధం ముగిసిన వెంటనే శ్రీశాంత్‌ను జట్టులోకి తీసుకోవాలని కేరళ క్రికెట్ అసోసియేషన్(కేసీఏ) ఇప్పటికే నిర్ణయించింది. రంజీ ట్రోఫీ కోసం ప్రకటించిన జట్టు ప్రాబబుల్స్ జాబితాలో కూడా అతని పేరు చేర్చింది. కాకపోతే శ్రీశాంత్ పునరాగమనం అతని ఫిట్‌నెస్‌పై ఆధారపడి ఉంది. జట్టు నిర్వహించే ఫిట్‌నెస్ టెస్ట్‌లో అతను గనుక నెగ్గితే మైదానంలోకి దిగడానికి శ్రీకి ఎలాంటి అడ్డు ఉండదు. ఆ తర్వాత దేశవాళీలోనూ రెగ్యులర్‌గా మ్యాచ్‌లు ఆడినా.. 37 ఏళ్ల శ్రీశాంత్ మళ్లీ టీమిండియాకి ఆడటం మాత్రం కష్టమే. కానీ అతను మాత్రం భారత్ తరఫున మళ్లీ ఆడటమే తన లక్ష్యమని చెప్పాడు.
ఆ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిని చాలా తక్కువ అంచనా వేసారు: గౌతమ్ గంభీర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications