For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఆ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడిని చాలా తక్కువ అంచనా వేసారు: గౌతమ్ గంభీర్

Gautam Gambhir Says Mohammad Nabi Is The Most Underrated Player In T20 Cricket
Mohammad Nabi Is One Of The Most Underrated Players In T20: Gautam Gambhir | Oneindia Telugu

న్యూఢిల్లీ: అఫ్గానిస్థాన్ ఆల్ రౌండర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ మహ్మద్ నబీని యావత్ క్రికెట్ ప్రపంచం చాలా తక్కువ అంచనా వేసిందని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నాడు. టీ20 క్రికెట్‌లో అతను అద్భుత ప్రదర్శన కనబర్చినా.. ఆయా జట్లు తరుచూ ఈ అఫ్గాన్ ఆటగాడిని నిర్లక్ష్యం చేసాయన్నాడు.

కరీబియన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్) 2020 సీజన్‌లో సెయింట్ లూసియా జూక్స్ తరఫున బరిలోకి దిగిన నబీ.. ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. క్లిష్ట పరిస్థితుల్లో రాణించి 156 పరుగులు 12 వికెట్లతో జట్టు ఫైనల్‌కు వెళ్లడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సూపర్ పెర్ఫామెన్స్‌తో యావత్ క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు.

చాలా తక్కువ అంచనా..

చాలా తక్కువ అంచనా..

ఈ క్రమంలోనే గంభీర్.. స్టార్ స్పోర్ట్స్ క్రికెట్ కనెక్టెడ్ షోలో మాట్లాడుతూ నబీపై ప్రశంసల జల్లు కురిపించాడు.‘నా అభిప్రాయం ప్రకారం టీ20 క్రికెట్‌లో మహ్మద్ నబీని చాలా తక్కువ అంచనా వేసారు. కీరన్ పొలార్డ్, ఏబీ డివిలియర్స్, రషీద్ ఖాన్.. లేకుంటే డేవిడ్ వార్నర్‌ల గురించి మాత్రమే మాట్లాడారు. కానీ నబీ ప్రదర్శనను, సత్తాను ఎనాడు గుర్తించలేదు.

రావాల్సిన పేరు రాలేదు..

రావాల్సిన పేరు రాలేదు..

అతనో అద్భత ఫీల్డర్. సూపర్‌గా బౌలింగ్ చేయగలడు. తొలి 6 ఓవర్లలో కూడా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తాడు. ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వచ్చి ధాటిగా ఆడగలడు. కానీ మనమెప్పుడూ ఆండ్రీ రస్సెల్ గురించే మాట్లాడుతాం. రస్సెల్ స్థాయిలో నబీ ఆడకున్నా.. అతనో నాణ్యమైన ఆల్‌రౌండరే. కానీ అతనికి రావాల్సిన పేరు మాత్రం రాలేదు. ఎందుకంటే క్రికెట్ అంతగా ఆడని అఫ్గానిస్థాన్ నుంచి వచ్చాడు కనుక ప్రజలు అంతగా అతని ఆటను గుర్తించలేదు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ కాకుంటే..

సన్‌రైజర్స్ హైదరాబాద్ కాకుంటే..

ఐపీఎల్‌లో కూడా అతనికి రావాల్సిన అవకాశాలు రాలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్, కేన్ విలియమ్సన్‌లతో నెలకొన్న పోటీ కారణంగా తుది జట్టులో అవకాశం దక్కలేదు. కానీ 14 మ్యాచ్‌లకు 14 ఆడుంటే నబీ ప్రభావం ఏంటో తెలిసేది. నబీ సన్ రైజర్స్ కాకుండా ఇతర ఏ జట్టులో ఆడినా అతనికి 14 మ్యాచ్‌ల్లో అవకాశం దక్కేది. అప్పుడు అతనెంటో ప్రపంచానికి తెలిసేది'అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

మొత్తం 13 మ్యాచ్‌లే..

మొత్తం 13 మ్యాచ్‌లే..

ఇక 2017లో ఐపీఎల్‌లో అడుగుపెట్టిన నబీ.. ఓవరాల్‌గా 13 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. ఇందులో గత సీజన్‌లోనే 8 మ్యాచ్‌లు ఆడిన నబీ.. 8 వికెట్లు తీసాడు. ఓవరాల్‌గా 11 వికెట్లు పడగొట్టాడు. ఇందులోఈ ఆఫ్ స్పిన్నర్ బెస్ట్ 4/11. ఇక బ్యాటింగ్ చేసే అవకాశం పెద్దగా రాకపోయినప్పటికీ.. 148.35 స్ట్రైక్ రేట్‌తో 135 రన్స్ చేశాడు. ఇందులో గత సీజన్‌లో 115 పరుగులు నమోదు చేశాడు. ఈ సీజన్‌లో హైదరాబాద్‌కు నబీ చాలా కీలకం కానున్నాడు. అఫ్గానిస్థాన్ తరఫున ఇప్పటి వరకు 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన నబీ.. 1347 పరుగులతో పాటు 69 వికెట్లు తీశాడు.

ఆ జట్టే ఐపీఎల్ 2020 టైటిల్ గెలుస్తోంది: కెవిన్ పీటర్సన్

Story first published: Sunday, September 13, 2020, 15:57 [IST]
Other articles published on Sep 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+