Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్భజన్‌పై నిషేధం విధించవద్దని ఏడ్చా: శ్రీశాంత్

S Sreesanth recalls infamous slapgate incident with Harbhajan Singh
Sreesanth On Infamous Slapgate Incident : Cried and Begged To Not బ్యాన్ Harbhajan Singh || Oneindia

న్యూఢిల్లీ: 12 ఏళ్ల ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌)చరిత్రలోనే అత్యంత వివాదాస్పద ఘటన ఏదైనా ఉందంటే అది శ్రీశాంత్ చెంపదెబ్బనే. భారత వెటరన్ క్రికెటర్ హర్భజన్ సింగ్ క్షణికావేశంలో శ్రీశాంత్‌పై చేయిచేసుకోవడం అప్పట్లో పెద్ద దుమారాన్నే రేపింది. ప్రేక్షకులతో కిక్కిరిసిన మైదానంలో ఆటగాళ్ల మధ్యలోనే శ్రీపై భజ్జీ చేయిచేసుకున్నాడు.

చెంప దెబ్బకొట్టిన భజ్జీ

చెంప దెబ్బకొట్టిన భజ్జీ

ఐపీఎల్‌ ప్రారంభ సీజన్‌(2008)లో కింగ్స్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌‌ ఓడింది. ఆట ముగిసిన అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటున్న క్రమంలో ఏమైందో ఏమో కానీ హర్భజన్, శ్రీశాంత్ మధ్య వివాదం నెలకొంది. అప్పడు ముంబై తరఫున ఆడుతున్న భజ్జీ.. పంజాబ్ ఆటగాడైన శ్రీశాంత్ చెంపచెల్లుమనిపించాడు. దీంతో శ్రీ మైదానంలో వెక్కివెక్కి ఏడ్చాడు. ఈ కేరళ ఆటగాడు ఏడ్వడం మాత్రమే కెమెరాల్లో కనిపించింది. అయితే వారి మధ్య ఏం జరిగిందనేదానిపై మాత్రం స్పష్టత లేదు. ఆ తర్వాత తన తప్పును తెలుసుకున్న హర్భజన్ శ్రీశాంత్‌కు క్షమాపణలు కూడా చెప్పాడు. అంతేకాకుండా అదే రాత్రి ఇద్దరూ కలిసి డిన్నర్‌ కూడా చేశారు. అలా ఈ వివాదాన్ని ముగించాలనుకున్నారు.

బీసీసీఐ సీరియస్

బీసీసీఐ సీరియస్

అయితే ఈ వ్యవహారాన్ని భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాత్రం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఒక కమిటిని ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. అయితే బీసీసీఐ ఏర్పాటు చేసిన కమిటీ మందు విచారణకు హాజరైన క్రమంలో భజ్జీపై ఎటువంటి నిషేధం విధించవద్దని శ్రీశాంత్‌ వేడుకున్నాడట. భజ్జీపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఏడూస్తూ కమిటీకి విజ్ఞప్తి చేశానని శ్రీశాంతే తాజాగా వెల్లడించాడు. ఈ ఏడాది సెప్టెంబర్‌తో బీసీసీఐ విధించిన నిషేధాన్ని ముగించుకోనున్న శ్రీశాంత్‌.. తన రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నాడు. ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌కప్‌ల్లో ఆడాలనే లక్ష్యంగా పెట్టుకున్నానన్నాడు. తాజాగా ‘క్రికెట్‌ ఎడిక్టర్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ... భజ్జీ చెంపదెబ్బ వివాదాన్ని శ్రీశాంత్ గుర్తు చేసుకున్నాడు.

సచినే సద్దుమణిగేలా చూశాడు.

సచినే సద్దుమణిగేలా చూశాడు.

‘ఆ మ్యాచ్‌లో సచిన్‌ టెండూల్కర్‌(సచిన్‌ పాజీ) కూడా భజ్జీ జట్టులోనే ఉన్నాడు. నా చెంపపై భజ్జీ కొట్టిన తర్వాత సచిన్‌ మా మధ్య వివాదాన్ని సద్దుమణిగేలా చేశాడు. అందుకు సచిన్‌కు థాంక్స్‌ చెప్పాలి. ఆ రోజు రాత్రి మేమంతా కలిసి డిన్నర్‌ చేశాం. కానీ మీడియా మాత్రం మా మధ్య జరిగిన గొడవను పెద్దదిగా చేసి చూపించింది. దాంతో బీసీసీఐ విచారణకు ఆదేశించింది. నానావతీ సర్‌ నన్ను విచారించారు. వీడియో క్లిప్పింగ్‌ చూపించి ఏమి జరిగిందని అడిగారు.

భజ్జీ ఓ లెజెండ్..

భజ్జీ ఓ లెజెండ్..

నేను ఏడుస్తూ భజ్జీపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని వేడుకున్నాను. మా మధ్య వివాదం ముగిసిందని చెప్పా. మేమిద్దరం కలిసే ఆడతామని తెలిపా. మా నుంచి భజ్జీని వేరు చేయొద్దని విన్నవించా. అతనొక మ్యాచ్‌ విన్నర్‌. భారత్‌ తరఫున హ్యాట్రిక్‌ సాధించిన బౌలర్లలో భజ్జీ ఒకడు. నాకు భజ్జీ సోదర సమానుడు. ఆ వివాదాన్ని పెద్దది చేయొద్దని చెప్పా. అది ముగిసిన అధ్యాయమని విచారణలో తెలిపా. భజ్జీ ఎప్పుడూ ఒక లెజెండ్‌గానే ఉంటాడు' అని శ్రీశాంత్‌ పేర్కొన్నాడు.

వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు దండుగ: టేలర్

Story first published: Friday, June 26, 2020, 20:28 [IST]
Other articles published on Jun 26, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+