న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

వన్డేల్లో సూపర్ ఓవర్ ఎందుకు దండుగ: టేలర్

Ross Taylor doesn’t feel Super Over is needed in ODI cricket

వెల్లింగ్టన్‌: క్రికెట్ ప్రపంచంలో సూపర్ ఓవర్ కలిసిరాని జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండే. గతేడాది వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో సూపర్‌ ఓవర్‌తోనే కివీస్ విశ్వటైటిల్‌ను చేజార్చుకుంది. ఆ సూపర్ ఓవర్ టైగా ముగిసినా బౌండరీల నిబంధన ఇంగ్లండ్‌ను విశ్వవిజేతగా నిలిపింది. అనంతరం ఈ ఏడాది ప్రారంభంలో సొంతగడ్డపై భారత్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో వరుస సూపర్ ఓవర్లలో పరాజయంపాలైంది.

టై అయితే ఏంటి..?

టై అయితే ఏంటి..?

తమను నీడలా వెంటాడుతున్న ఈ ‘సూపర్ ఓవర్'ఆ దేశ వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ మనసులో నాటుకుపోయిందో ఏమో కానీ.. అసలు వన్డేల్లో సూపర్ ఓవరే అవసరం లేదంటున్నాడు. ఇదొక అనవసరపు విధానమని తాజాగా ఈఎస్పీఎన్ క్రిక్ ఇన్‌ఫో‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో టేలర్‌ పేర్కొన్నాడు. ‘వన్డే ఫార్మాట్‌లో సూపర్‌ ఓవర్‌ అవసరం లేదనేది నా అభిప్రాయం. ఈ 50 ఓవర్ల ఫార్మాట్ చాలా సేపు జరుగుతుంది కాబట్టి టై అయితే వచ్చే సమస్యేం లేదు. సంయుక్త విజేతలుగా ప్రకటించాలి. అంతేగానీ సూపర్‌ ఓవర్‌తో ఒక్క జట్టును ఫేవరెట్‌ చేయడం భావ్యం కాదు. ఈ విధానంపై ఇప్పటికీ నేను ఎటు తేల్చుకోలేకపోతున్నా.

మంచి పద్దతి కాదు..

మంచి పద్దతి కాదు..

నేను చాలాకాలం నుంచి క్రికెట్‌ ఆడుతున్నా. వన్డే టైగా ముగిస్తే ఎలాంటి సమస్యా లేదు. ఫుట్‌బాల్‌, లేదా ఇతర క్రీడలు కానీ, టీ20లు కానీ టై అయితే మ్యాచ్‌ను కొనసాగించడం సరైనది. దాంతో విజేతను ప్రకటించే అవకాశం ఉంటుంది. కానీ వన్డే మ్యాచ్‌లో సూపర్‌ ఓవర్‌ అవసరం అని నేను అనుకోను. తుది పోరు టై అయితే టైటిల్ ఇద్దరికి ఇవ్వాలి. సూపర్‌ ఓవర్‌ అనేది అ‍ప్పటికప్పుడు తీసుకొచ్చిన నిబంధనలా అనిపించింది. అది వరల్డ్‌కప్‌లో ఉందనే విషయం నాకు తెలియదు. మ్యాచ్‌ టై అంటే టై.. అంతే కానీ సూపర్‌ ఓవర్‌ ఏమిటి?. వరల్డ్ కప్‌ విషయంలో సూపర్‌ ఓవర్‌ అనేది మంచి ఆలోచన కాదు'అని టేలర్‌ తెలిపాడు.

వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత నాలుగు సార్లు..

వరల్డ్‌కప్ ఫైనల్ తర్వాత నాలుగు సార్లు..

ఇక వన్డే ప్రపంచకప్‌లో సూపర్ ఓవర్ పరాజయం తర్వాత న్యూజిలాండ్ మరో నాలుగు సార్లు ఈ విధానానికి బలైంది. అయితే ప్రపంచకప్ ఒక్కటే వన్డే ఫార్మాట్ కాగా.. మిగతా మూడు టీ20లే కావడం గమనార్హం. వరల్డ్‌కప్ ముగిసిన అనంతరం నవంబర్‌లో సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ ఆడిన కివీస్.. ఆక్లాండ్ వేదికగా జరిగిన డిసైడర్ మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లోనే పరాజయం పాలైంది. అనంతరం ఈ ఏడాది జనవరిలో భారత్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో మూడు, నాలుగో టీ20ల్లో సూపర్ ఓవర్‌లోనే పరాజయం పాలైంది.

ఏడిపిస్తున్న సూపర్ ఓవర్..

ఏడిపిస్తున్న సూపర్ ఓవర్..

అంతర్జాతీయ టీ20ల్లో మొత్తం ఎనిమిదిసార్లు సూపర్ ఓవర్‌ ఆడిన న్యూజిలాండ్.. ఒక్క మ్యాచ్‌లో మినహా మిగతా ఏడింటిలోనూ ఓడిపోయింది. 2010లో క్రైస్ట్‌చర్చ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన సూపర్ ఓవర్‌లో మాత్రమే కివీస్ గెలుపొందింది. 2006లో తొలి సారి వెస్టిండీస్‌తో టై చేసుకున్న న్యూజిలాండ్‌ బౌల్ ఔట్‌ పద్దతిలో 3-0తో ఓటమిపాలైంది. మరో రెండేళ్లకు విండీస్ చేతిలోనే ఓడిన కివీస్.. శ్రీలంక( 2012), వెస్టిండీస్(2012), ఇంగ్లండ్(2019), భారత్(2020 రెండు సార్లు) సూపర్ ఓవర్‌కు బలైంది.

వెస్టిండీస్ బౌలర్ల ఆధిపత్యం ఓర్వలేకనే బౌన్సర్ రూల్ తెచ్చారు: డారెన్ సామీ

Story first published: Friday, June 26, 2020, 16:52 [IST]
Other articles published on Jun 26, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X