Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మళ్లీ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మధ్య విభేదాలు.. నిన్నటి మ్యాచే సాక్ష్యం!

Rumors Of Rift Between Virat Kohli And Rohit Sharma Resurface

దుబాయ్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మధ్య మళ్లీ విభేదాలు చేటుచేసుకున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఐపీఎల్ 2020 సీజన్‌లో భాగంగా ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) మధ్య సోమవారం జరిగిన మ్యాచే ఈ వార్తలకు బలం చేకూరుస్తుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అయితే కోహ్లీ, రోహిత్ మధ్య విభేదాలనే ప్రచారం గత రెండేళ్లుగా జరుగుతూనే ఉంది. గతేడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన ప్రపచంకప్ జట్టు ఎంపిక విషయంలో ఈ ఇద్దరి మధ్య బేధాభిప్రాయాలు వచ్చాయని, సెమీస్ ఓటమి అనంతరం మరింత బలపడ్డాయనే ప్రచారం జరిగింది. ఈ విషయంపై టీమ్‌మేనేజ్‌మెంట్ సిబ్బంది క్లారిటీ ఇచ్చినా ఈ ప్రచారం మాత్రం ఆగలేదు.

ముఖం చాటేశారు

ముఖం చాటేశారు

తాజాగా జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఒకరికొకరు మాట్లాడుకోలేదు. కనీసం చూసుకోలేదు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ నెటిజన్లు వీరి మధ్య ఏదో జరుగుతుందనే సందేహాలను రేకెత్తిస్తున్నారు. టాస్ సందర్భంగా మైదానంలోకి వచ్చిన ఈ ఇరు జట్ల కెప్టెన్లు కరోనా నిబంధనల కారణంగా దూరం దూరంగానే నిలబడ్డారు. హోస్ట్ మురళీ కార్తీక్‌తోనూ ఎవరికీ వారు మాట్లాడుకున్నారు. మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు ముఖాలు తిప్పుకొని షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. అయితే ఇతర మ్యాచ్‌ల సమయంలో ప్రత్యర్థి కెప్టెన్లతో జోవియల్‌గా కనిపించిన ఈ ఇద్దరూ.. నిన్నటి మ్యాచ్‌లో భిన్నంగా నడుచుకోవడంతో అనుమానాలు మొదలయ్యాయి.

రోహిత్ ఔట్.. విరాట్ సెలెబ్రేట్..

రోహిత్ ఔట్.. విరాట్ సెలెబ్రేట్..

ఇక 202 పరుగుల భారీ లక్ష్య చేధనకు దిగిన ముంబై ఇండియన్స్ ఆదిలోనే రోహిత్ శర్మ వికెట్‌ను కోల్పోయింది. వాషింగ్టన్ సుంధర్ వేసిన రెండో ఓవర్‌లో డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ షాట్ ఆడిన రోహిత్.. పవన్ నేగికి చిక్కి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఇక రోహిత్ ఔటైన సందర్భంలో విరాట్ కోహ్లీ అతిగా సెలెబ్రేట్ చేసుకున్నాడు. బౌలర్ దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి మరి సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ప్రవర్తన కూడా అభిమానులకు సందేహాలను రేకిత్తించింది. అంతేకాకుండా మ్యాచ్‌కు ముందు, తర్వాత ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో సరదాగా మాట్లాడుకోగా.. విరాట్, రోహిత్ మాత్రం ఒకరికొకరు దగ్గరకి కూడా వెళ్లలేదు.

అప్పుడు ఇన్‌స్టాలో..

అప్పుడు ఇన్‌స్టాలో..

గతేడాది రోహిత్ శర్మ ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మను అన్‌ఫాలో చేయడం.. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయనే ప్రచారానికి బలాన్నిచ్చింది. వీరి మధ్య ఏదో జరుగుతుందనే సందేహాలను రేకెత్తించింది. అలాగే టీమిండియా వెస్టిండీస్ టూర్‌కు దూరంగా ఉండాలని కోహ్లీ మొదట భావించాడని.. కానీ రోహిత్‌కు కెప్టెన్సీ ఇవ్వడం ఇష్టం లేక.. మళ్లీ మనసు మార్చుకున్నాడనే ప్రచారం కూడా జరిగింది. ప్రపంచకప్ అనంతరం తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని విరాట్ కోహ్లీ స్పష్టం చేశాడు. ఇలాంటి తప్పుడు వార్తలను ఎందుకు సృష్టిస్తారో అర్థం కాదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆ తర్వాత భారత్ న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లగా.. రోహిత్ గాయంతో అర్ధాంతరంగా వెనుదిరిగాడు. తర్వాత కరోనాతో ఆట అటకెక్కగా.. 6 నెలల సుదీర్ఘ విరామం తర్వాత ఐపీఎల్‌తో పున:ఫ్రారంభమైంది. దీంతో మరోసారి వీరి మధ్య విభేదాలు తలెత్తాయనే ప్రచారం ఊపందుకుంది.

ఆర్‌సీబీ సూపర్ విన్..

ఆర్‌సీబీ సూపర్ విన్..

నిన్నటి మ్యాచ్‌లో ఆర్‌సీబీ సూపర్ ఓవర్‌లో గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, పొలార్డ్ సూపర్ బ్యాటింగ్‌తో 5 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఇసురు ఉడాన రెండు వికెట్లు తీయగా.. సుంధర్, చహల్, జంపా తలో వికెట్ తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించిన ఏబీడీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సూపర్ ఓవర్‌లో సైనీ ఇరగదీయడం.. అనంతరం బుమ్రా బౌలింగ్‌లో కింగ్ కోహ్లీ, ఏబీడీ చెరో బౌండరీ బాదడంతో బెంగళూరు సూపర్ విక్టరీ అందుకుంది.

మేం మీలానే ఫీలయ్యాం.. ముంబై ఇండియన్స్‌కు కింగ్స్ పంజాబ్ ఓదార్పు!

Story first published: Tuesday, September 29, 2020, 15:35 [IST]
Other articles published on Sep 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+