మేం మీలానే ఫీలయ్యాం.. ముంబై ఇండియన్స్‌కు కింగ్స్ పంజాబ్ ఓదార్పు!

దుబాయ్: ఆద్యంతం ఉత్కంఠ.. అంతకుమించిన పోరాట స్పూర్తి రగిలిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై చేయి సాధించిన విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్(24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 నాటౌట్), ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) హాఫ్ సెంచరీలతో చెలరేగి భారీ టార్గెట్ నిర్దేశించినా.. ముంబై ఆటగాళ్లు ఇషాన్ కిషాన్ (58 బంతుల్లో 2 ఫోర్లు 99), కీరన్ పొలార్డ్(24 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్లతో 60 నాటౌట్)దంచికొట్టడంతో స్కోర్లు సమమయ్యాయి.
క్రికెట్ అభిమానుల్ని తెగ అలరించిన ఈ మ్యాచ్‌లో చివరకు సూపర్ ఓవరే ఫలితాన్నిచ్చింది. 201 పరుగులు చేసినా దక్కని విజయం ఆర్‌సీబీకి ఆ ఒక్క సూపర్ ఓవర్‌తో వరించింది. ముంబై ఇండియన్స్ పోరాటం ఆ ఓవర్‌లోనే ఆవిరైంది.

ఫీల్ యా..
ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ పంజాబ్ జట్ల మధ్య లీగ్‌లోని రెండో మ్యాచ్ కూడా ‘సూపర్ ఓవర్'లో ఫలితం వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కింగ్స్ పంజాబ్.. ముంబై ఇండియన్స్ ఓదారుస్తూ ట్వీట్ చేసింది. ‘ఫీల్ యా'అనే క్యాప్షన్‌తో ఓ బేబీని ఓదారుస్తున్న ఫన్నీ జిఫ్ ఫైల్‌ను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌చల్ చేస్తుంది. అభిమానులు ఫన్నీ కామెంట్లతో ఆటపట్టిస్తున్నారు. కొందరూ మాత్రం ఈ జిఫ్‌ను దాచిపెట్టుకోమని, అక్టోబర్ 1న ముంబై ఇండియన్స్ లెక్క సరిచేస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంకొందరేమో ‘మస్త్ షేడ్స్ ఉన్నాయ్‌రా నీలో'అని ఫన్నీ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు. సోదరభావం కారిపోతుందని ఇంకొకరు సెటైర్ వేసారు.

సిక్సర్ల పండుగ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆర్‌సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఆరోన్ ఫించ్(35 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్‌తో 52), దేవదూత్ పడిక్కల్(40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 ) ఏబీ డివిలియర్స్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 నాటౌట్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు. ముంబై బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు తీయగా.. రాహుల్ చాహర్ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం ముంబై ఇండియన్స్ ఇషాన్ కిషన్, పొలార్డ్ సూపర్ బ్యాటింగ్‌తో 5 వికెట్లకు 201 రన్స్ చేసింది. ఇసురు ఉడాన రెండు వికెట్లు తీయగా.. సుంధర్, చహల్, జంపా తలో వికెట్ తీశారు. విజయంలో కీలక పాత్ర పోషించిన ఏబీడీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది. సూపర్ ఓవర్‌లో సైనీ ఇరగదీయడం.. అనంతరం కింగ్ కోహ్లీ, ఏబీడీ చెరో బౌండరీ బాదడంతో బెంగళూరు సూపర్ విక్టరీ అందుకుంది.

రప్ఫాడించిన రబడా
ఐపీఎల్ 2020లో సెప్టెంబర్ 20న కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఇదే మైదానంలో జరిగిన రెండో మ్యాచ్ కూడా సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఈ మ్యాచ్‌లో ఓవైపు మార్కస్ స్టోయినిస్(21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 53), మరోవైపు మయాంక్ అగర్వాల్(60 బంతుల్లో 89, 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 89) ధాటిగా ఆడటంతో మ్యాచ్ టైగా ముగిసి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఇక సూపర్ ఓవర్ స్పెషలిస్ట్ రబడా రఫ్ఫాడించడంతో ఢిల్లీ క్యాపిటల్స్ థ్రిల్లింగ్ విక్టరీ అందుకుంది. సూపర్ ఓవర్‌లో వరుస బంతుల్లో రెండు వికెట్లు తీసిన రబడా.. చేజారిపోయిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు అద్భుత విజయాన్నందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
అందుకే ఇషాన్ కిషాన్‌ను సూపర్ ఓవర్ ఆడించలేదు: రోహిత్ శర్మ