Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ నిర్ణయాన్ని వెనక్కితీసుకోండి లేకుంటే ఐపీఎల్‌ను బహిష్కరిస్తాం.. ఆర్‌ఎస్ఎస్ అనుబంధ సంస్థ వార్నింగ్!

RSS affiliate SJM wants BCCI to reconsider IPL’s Chinese sponsorship deals

న్యూఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 2020 సీజన్‌కు స్పాన్సర్‌గా చైనా మొబైల్ కంపెనీ వివోను కొనసాగించడంపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేకుంటే ఐపీఎల్‌ను బహిష్కరిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) అనుబంధ సంస్థ స్వదేశీ గరణ్‌ మంచ్‌ (ఎస్‌జేఎమ్‌) హెచ్చరించింది. కరోనా నేపథ్యంలో ఆగిపోయిన ఐపీఎల్‌‌ను దుబాయ్ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి నవంబర్ 10 వరకు నిర్వహించేందుకు బీసీసీఐ సన్నదమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో లీగ్ చైర్మన్‌ బ్రిజేశ్‌ పటేల్‌ నేతృత్వంలో ఆదివారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశంలో పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐపీఎల్ షెడ్యూల్, ఆటగాళ్ల ఆరోగ్య భద్రత తదితర విషయాలతో పాటు చైనా మొబైల్ కంపెనీ వివో స్పాన్సర్‌షిప్ కొనసాగించడంపై తుది నిర్ణయం తీసుకుంది.

తప్పడం లేదు..

తప్పడం లేదు..

ఇక ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న వివో ఏడాదికి రూ.440 కోట్లు చెల్లిస్తోంది. కరోనా వైరస్‌ విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో, ఇంత తక్కువ సమయంలో మరో కొత్త స్పాన్సర్‌ లభ్యం కావడం ఇంచుమించు అసాధ్యమని బోర్డు అభిప్రాయపడింది. దీంతోనే వివోను స్పాన్సర్ కొనసాగించడం అనివార్యమైందని పేర్కొంది. అయితే గత జూన్‌లో తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో చైనాతో ఘర్షణలు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దేశవ్యాప్తంగా డ్రాగన్ కంట్రీపై ఆగ్రహజ్వాలలు వ్యక్తమయ్యాయి. చైనా వస్తువులను బహిష్కరించాలనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది. ప్రజలు కూడా జవాన్లకు మద్దుతుగా ఆ దేశ వస్తువులను స్వచ్చందంగా బహిష్కరించారు. ఇక భారత ప్రభుత్వం కూడా చైనాకు చెందిన పలు యాప్‌లను నిషేధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఐపీఎల్‌కు వివో స్పాన్సర్‌షిప్ కొనసాగించడంపై యావత్ భారతం భగ్గుమంటుంది.

మన సైనికులను చంపుతుంటే..

మన సైనికులను చంపుతుంటే..

ఇది ముమ్మాటికి దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జవాన్లను అవమానపర్చినట్టేనని బీసీసీఐపై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఇక ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ స్వదేశీ గరణ్‌ మంచ్‌ కూడా బీసీసీఐ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఓ వైపు భార‌త సైనికులను చైనా ఆర్మీ చంపేస్తుంటే..ఆ దేశానికి చెందిన కంపెనీల‌కు లాభం చేకూర్చేలా బీసీసీఐ, ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ వ్య‌వ‌హ‌రిస్తున్నాయని ఆరోపించింది.

దేశం కన్నా ఏది ఎక్కువ కాదు..

దేశం కన్నా ఏది ఎక్కువ కాదు..

దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా బీసీసీఐ తీసుకున్న ఈ నిర్ణయం గర్హనీయమని ఆ సంస్థ కో కన్వినర్‌ అశ్వినీ మహాజన్‌ సోమవారం అన్నారు. ‘మార్కెట్‌లో చైనా కంపెనీల ఆధిపత్యాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే పలు కంపెనీలపై నిషేధం విధించింది. ఈ క్రమంలో దేశ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా చైనా సంస్థలతో కొనసాగేందుకు బీసీసీఐ ప్రయత్నించడం సరైంది కాదు. దేశం కన్నా ఏదీ ఎక్కువ కాదనే విషయాన్ని వారు గ్రహించాలి. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలి. లేకుంటే ఐపీఎల్ రద్దుకు పిలుపునిస్తాం'అని ఆయన హెచ్చరించారు.

బీజేపీ‌పై విమర్శలు..

బీజేపీ‌పై విమర్శలు..

ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా బీసీసీఐ నిర్ణయంపై విమర్శలు గుప్పించింది. ‘ఓవైపు ఆత్మనిర్భర భారత్ అభియాన్ అంటునే మరోవైపు చైనా కంపెనీలకు లాభాలు చేకూర్చుతున్నారు. బీజేపీ ప్రభుత్వ ద్వంద ప్రమాణాలకు ఇది నిదర్శనం'అంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రన్‌దీప్ సింగ్ సుర్జెవాలా ట్వీట్ చేశారు. జమ్ము కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా కూడా బీసీసీఐ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ‘చైనా వస్తువులను బహిష్కరించాలని ప్రజలకు చెప్తూ.. చైనాకు చెందిన సెల్‌ఫోన్‌ ఉత్పత్తిదారులను ఐపీఎల్‌ టైటిల్‌ స్పాన్సర్‌గా కొనసాగిస్తున్నారు. చైనాను ఎలా నియంత్రించాలో అని మనం అయోమయంలో ఉంటే... ఆ దేశం మనను అపహాస్యం చేయడంలో ఆశ్చర్యం లేదు'' అని ఆయన ట్వీట్ చేశారు.

నా తొలి సంపాదన మొత్తంతో వడాపావ్‌ తిన్నాం: రోహిత్‌

Story first published: Tuesday, August 4, 2020, 12:53 [IST]
Other articles published on Aug 4, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+