Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నా తొలి సంపాదన మొత్తంతో వడాపావ్‌ తిన్నాం: రోహిత్‌

My first cash prize was Rs 50, used it to buy vada pav, says Rohit Sharma
IPL 2020 Likely To Be Held From September 26 In UAE || Oneindia Telugu

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్‌ రోహిత్‌ శర్మ ఇప్పుడు కోట్లలో సంపాదిస్తున్నాడు. బీసీసీఐ బోర్డు, ప్రకటనల ద్వారా ఏడాదికి దాదాపు 100 కోట్లు ఆర్జిస్తున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తర్వాత ఎక్కువ ఆర్జిస్తున్న భారత క్రికెటర్లలో 'హిట్‌మ్యాన్' కూడా ఒకడు. అయితే రోహిత్ శర్మ తొలి సంపాదన ఎంతో తెలుసా..? కేవలం 50 రూపాయాలే అంటే మీరు నమ్మగలరా?. కానీ ఇదే అసలు నిజం. రోహిత్ శర్మనే స్వయంగా ఈ విషయం చెప్పాడు.

 నా తొలి సంపాదన రూ.50:

నా తొలి సంపాదన రూ.50:

చిన్నప్పుడు ఇంటి సమీపంలో ఓ లోకల్‌ మ్యాచ్‌ గెలిచినందుకు రూ. 50 నగదు బహుమతిగా వచ్చిందట, దాన్ని స్నేహితులతో కలిసి వడాపావ్‌ తినేందుకు ఖర్చు చేశానని రోహిత్‌ శర్మ వెల్లడించాడు. ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన ప్రశ్నలకు హిట్‌మ్యాన్ ఆదివారం సమాధానాలు ఇచ్చాడు. 'మీ తొలి పేచెక్‌ ఎంత?' అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు రోహిత్‌ స్పందిస్తూ... 'నేను పేచెక్‌ అందుకోలేదు. మా ఇంటి దగ్గర మ్యాచ్‌ ఆడి రూ.50 నగదు బహుమతి గెలుచుకున్నా. ఆ డబ్బుతో నా స్నేహితులమంతా కలిసి రోడ్డుపక్కన వడాపావ్‌ తిన్నాం' అని తెలిపాడు.

 దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీ ఇష్టం:

దక్షిణాఫ్రికాపై చేసిన సెంచరీ ఇష్టం:

ప్రపంచకప్ 2019లో వరుసగా ఐదు సెంచరీలు బాది క్రికెట్ చరిత్రలోనే రోహిత్ శర్మ రికార్డు నెలకొల్పాడు. అయితే ఆ సెంచరీలు అన్నింటిలో తనకిస్టమైన సెంచరీ మాత్రం మొదటి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై చేసిందేనని అంటున్నాడు. ప్రశ్నోత్తరాల సెషన్లో భాగంగా.. ప్రపంచకప్‌లో మీకు నచ్చిన సెంచరీ ఏదని ఓ అభిమాని అడిగాడు. 'దక్షిణాఫ్రికాపై చేసిందే. ఆ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేసింది తక్కువ పరుగులే. కానీ పిచ్ బౌలర్లకు అనుకూలిస్తోంది. ప్రత్యర్థి బౌలర్లు కూడా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో సెంచరీ కొట్టడం చాలా ఆనందంగా ఉంది' అని రోహిత్ పేర్కొన్నాడు.

మెక్‌గ్రాత్‌ను ఎంచుకుంటా:

మెక్‌గ్రాత్‌ను ఎంచుకుంటా:

మీరు ఎదుర్కోవాలనుకునే ఒక మాజీ బౌలర్‌ను ఎంచుకోవాలని ఓ అభిమాని అడగ్గా... ఆస్ట్రేలియా పేసర్ గ్లెన్ మెక్‌గ్రాత్ పేరు చెప్పాడు. ఎంఎస్ ధోనీతో ప్రత్యేకమైన క్షణం ఏంటని అడగ్గా.. 2013 నవంబర్ 2న బెంగళూరులో ఆస్ట్రేలియాపై చేసిన మొదటి వన్డే డబుల్ సెంచరీ అని రోహిత్ వెల్లడించాడు. మహీ నాతో కలిసి అప్పుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. మా ఇద్దరి మధ్య భారీ భాగస్వామ్యం నెలకొందని చెప్పాడు. స్పిన్నర్ యుజ్వేంద్ర చహల్ ఒక రోజులో ఎన్నిసార్లు కాల్ చేస్తాడని అడిగినప్పుడు.. 'నేను ఇంట్లో ఉన్నప్పుడు చహల్ కాల్ చేయడు. మేము పర్యటనలో ఉన్నప్పుడు ఒకరికొకరు ఎంజాయ్ చేస్తాం' అని తెలిపాడు.

పోలికల్ని ఇష్టపడను:

పోలికల్ని ఇష్టపడను:

మిమ్మల్ని ఎంఎస్‌ ధోనీతో పోల్చుతూ ఇటీవల సురేశ్‌ రైనా కామెంట్‌ చేశారు కదా అని అడగ్గా... 'నేను సురేశ్‌ రైనా కామెంట్స్‌ విన్నాను. నన్ను ఎంఎస్ ధోనీతో పోల్చాడు. ధోనీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. అతనిలా ఎవ్వరూ ఉండలేరు. ప్రతీ మనిషి యొక్క గుణగణాలు సెపరేట్‌గా ఉంటాయి. అలానే ప్రతీ ఒక్కరికి ఒక్కో లక్షణం, ఒక్కో వ్యక్తిత్వం ఉంటాయి. రైనా చేసిన పోలిక సరైనవి కాదని నేను నమ్ముతున్నాను. నేను ఎప్పుడూ పోలికల్ని ఇష్టపడను. ప్రతీ ఒక్కరికీ ఒక్కో శైలి ఉంటుంది. అలానే బలాలు, బలహీనతలు కూడా ఉంటాయి' అని రోహిత్ పేర్కొన్నాడు.

నా గులాబీకి గులాబీలు: హార్దిక్ పాండ్యా

Story first published: Monday, August 3, 2020, 15:37 [IST]
Other articles published on Aug 3, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+