RR vs KXIP ప్రివ్యూ: మళ్లీ జజ్జనకరి జనారే సిక్సర్ల పండుగే.. మరి గెలుపు జోరు ఎవరిదో?

షార్జా: ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్దమైంది. చిన్న మైదానమైన షార్జా వేదికగా జరిగే ఈ సిక్స్ హిట్టింగ్ కాంటెస్ట్ అభిమానులను కనువిందు చేయనుంది. ఫస్ట్ ఫైట్‌లోనే పటిష్ట చెన్నై సూపర్ కింగ్స్‌కు చెక్ పెట్టిన రాజస్థాన్ రాయల్స్ ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో అమితుమీ తేల్చుకోనుంది. తక్కువగా అంచనా వేస్తే ఎంతటి బలమైన జట్టునైనా ఓడిస్తామని రాజస్థాన్ రాయల్స్ నిరూపించింది. పరుగుల వరద సృష్టించడమే కాదు.. బంతితోనూ సమష్టిగా అదరగొట్టి ప్రత్యర్థులను కట్టడి చేయగలమని కింగ్స్ పంజాబ్ జట్టు చాటి చెప్పింది.
అండర్‌డాగ్స్‌గా టోర్నీలోకి బరిలోకి దిగి శుభారంభం చేసిన ఈ రెండు జట్లు మరో విజయంపై కన్నేసాయి. తమ జైత్రయాత్ర కొనసాగించాలని భావిస్తున్నాయి. ఇరు జట్లలో భారీ హిట్టర్లు ఉండడంతో పాటు మైదానం చిన్నది కావడంతో ఈ మ్యాచ్‌లో కురిసే సిక్సర్ల వర్షంతో అభిమానులు తడిసి మద్దవ్వనున్నారు. బలబలాల పరంగా పేపర్‌పై ఇరు జట్లు సమతూకంగా ఉన్నప్పటికీ అనుభవం దృష్ట్యా కింగ్స్ పంజాబ్ హాట్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది.
ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 19 సార్లు తలపడగా 10-9తో రాజస్థాన్ లీడ్‌లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని రాజస్థాన్ భావిస్తుండగా.. గెలుపుతో లెక్క సరిచేయాలని కింగ్స్ పంజాబ్ పట్టుదలగా ఉంది. మరీ గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి!

బట్లర్ రాకతో పెరిగిన రాజస్థాన్ బలం..
ఇప్పటికే సంజూ శాంసన్, కెప్టెన్ స్టీవ్ స్మిత్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. ఇంగ్లండ్ స్టార్ జోస్ బట్లర్ రాకతో రాయల్స్ బలం మూడింతలైంది. ఫ్యామిలీతో సపరేట్‌గా యూఏఈ వచ్చి క్వారంటైన్ రూల్స్ కారణంగా ఫస్ట్ మ్యాచ్‌కు దూరమైన జోస్ బట్లర్.. ఈ మ్యాచ్‌లో యంగ్‌స్టర్ యశస్వి జైస్వాల్‌తో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఓపెనింగ్ చేసిన కెప్టెన్ స్టీవ్ స్మిత్.. బ్యాటింగ్ ఆర్డర్‌లో డేవిడ్ మిల్లర్ స్థానంలోకి వెళ్లనున్నాడు.
బట్లర్ తుది జట్టులోకి వస్తే మిల్లర్ తుది జట్టులో స్థానం కోల్పోనున్నాడు. చెన్నైపై భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డ సంజూ శాంసన్ డ్రీమ్ ఫామ్ కొనసాగించాలని చూస్తున్నాడు. బౌలింగ్‌లో టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, రాహుల్ తేవాటియా మరోసారి రాణిస్తే రాయల్స్‌కు తిరుగుండదు.

రాహుల్ రఫ్ఫాడిస్తే..
ఇక ఢిల్లీ చేతిలో సూపర్ ఓవర్లో ఓడినా కెప్టెన్ రాహుల్ మెరుపు సెంచరీతో ఆర్‌సీబీని చిత్తుగా ఓడించిన పంజాబ్ గాడిలో పడింది. టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్‌గా ప్రశంసలు అందుకుంటున్న లోకేశ్ రాహుల్ ఆర్‌సీబీపై ఓ రేంజ్‌లో చెలరేగి టోర్నీలో హయ్యెస్ట్ స్కోర్ చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు సృష్టించాడు. కెప్టెన్సీలోనూ మంచి మార్కులు కొట్టేస్తున్న అతను ఈ మ్యాచ్‌లోనూ అదే ఊపు కొనసాగించాలని చూస్తున్నాడు. ఆర్‌సీబీపై 5 రన్సే చేసిన గ్లేన్ మ్యాక్స్‌వెల్ ఫామ్‌లోకి వస్తే బ్యాటింగ్ బలం రెట్టింపు కానుంది. అతను తీవ్ర ఒత్తిడిలో ఉన్నాడు.
అతడితో పాటు నికోలస్ పూరన్ కూడా అంచనాలను అందుకోలేదు. వీరిద్దరూ రాజస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో ఫామ్‌లోకి రావాలని జట్టు ఆశిస్తోంది. అయితే పూరన్‌కు బదులు క్రిస్ గేల్‌కు అవకాశం దక్కవచ్చు. బౌలింగ్‌లో మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్ పేస్‌తో హడలెత్తిస్తుండగా, యంగ్ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్ సత్తా చాటుతున్నారు. షార్జా వికెట్ స్పిన్‌కు అనుకూలం కావడంతో జిమ్మీ నీషమ్ స్థానంలో ముజీబ్ ఉర్ రెహ్మాన్‌ను తీసుకునే అవకాశం ఉంది.

తుది జట్లు (అంచనా)
రాజస్థాన్: యశస్వీ జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), రాబిన్ ఉతప్ప, రియాన్ పరాగ్, శ్రేయస్ గోపాల్ టామ్ కరన్, జోఫ్రా ఆర్చర్, టామ్ కరన్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కత్
పంజాబ్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్రిస్ గేల్, మయాంక్ అగర్వాల్, మాక్స్‌వెల్, కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, నీషమ్/ ముజీబ్ ఉర్ రెహ్మాన్, మురుగన్ అశ్విన్, రవి బిష్ణోయ్, మహ్మద్ షమీ, షెల్డన్ కాట్రెల్.

పిచ్ రిపోర్ట్:
యూఏఈలోనే చాలా నెమ్మదైన పిచ్. అలాగే స్పిన్‌కు అనుకూలమైనది. కొత్త బంతితో పేసర్లు ప్రభావం చూపుతారు. చిన్నమైదానం కాబట్టి సిక్సర్లతో ఇరు జట్ల స్కోర్ సులువుగా 200 ధాటవచ్చు. రాజస్థాన్, చెన్నై మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే జరిగింది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు. రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఆ సెంటిమెంట్ రిపీట్ అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌దే టైటిల్!