For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RR vs CSK: అందుకే 7వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చా: ఎంఎస్ ధోనీ

RR vs CSK: MS Dhoni explains the reason behind batting at No. 7
IPL 2020,CSK vs RR : MS Dhoni Explains The Reason For Coming To Bat At No. 7 || Oneindia Telugu

షార్జా: కరోనా కారణంగా విధించిన 14 రోజుల క్వారంటైన్ తన ప్రాక్టీస్‌పై ప్రభావం చూపిందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అన్నాడు. ఆ కారణంగానే లోయారార్డర్‌లో బ్యాటింగ్ చేస్తున్నానని స్పష్టం చేశాడు. ఇక రాజస్థాన్ రాయల్స్‌తో మంగళవారం షార్జా వేదికగా జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే 16 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. ఓవైపు సంజూ శాంసన్(32 బంతుల్లో 1 ఫోర్, 9 సిక్సర్లతో 74).. మరోవైపు స్టీవ్ స్మిత్(47 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 69).. ఈ ఇద్దరు చాలదన్నట్లు ఆఖర్లో జోఫ్రా ఆర్చర్(8 బంతుల్లో 4 సిక్సర్లతో 27 నాటౌట్) చెలరేగడంతో రాజస్థాన్ చెన్నై ముందు 217 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

ధోనీ ముందు వచ్చి ఉంటే..

ధోనీ ముందు వచ్చి ఉంటే..

ఈ లక్ష్యచేధనలో చెన్నై బ్యాట్స్‌మన్ తడబడ్డారు. ఓపెనర్లు షేన్ వాట్సన్, మురళీ విజయ్ శుభారంభాన్ని అందించినా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ వరుసగా వికెట్లు పారేసుకున్నారు. దీంతో రన్‌రేట్ పెరిగి ఆఖర్లో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. ధోనీ ఏడో స్థానంలో వచ్చినప్పటికీ ఆఖరి వరకు షాట్లేమీ బాదలేదు. మరోవైపు డూప్లెసిస్ చెలరేగుతున్నా ధోనీ టైమ్ తీసుకున్నాడు. ఇక గెలవడం కష్టమని తెలిశాక.. ఆఖరి ఓవర్లో మాత్రం మూడు హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు. అయితే ధోనీ ముందు వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమైంది. ఇదే విషయాన్ని కామెంటేటర్ మురళీ కార్తీక్ పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేన్‌లో ధోనీని ప్రశ్నించగా వివరణ ఇచ్చుకున్నాడు.

క్వారంటైన్ దెబ్బతీసింది..

క్వారంటైన్ దెబ్బతీసింది..

‘14 రోజుల క్వారంటైన్ నిబంధన నా ప్రాక్టీస్‌పై ప్రభావం చూపింది. సాధనకు అవసరమైన సమయం దొరకలేదు. అందులోనూ గత ఏడాది కాలంగా బ్యాటింగ్ చేయలేదు. అందుకే లోయారర్డర్‌లో బ్యాటింగ్ వచ్చా. కొత్తగా ప్రయత్నాల్లో భాగంగా సామ్ కరన్‌కు అవకాశం ఇచ్చా. ఇలాంటి ప్రయత్నాలు విఫలమైతే మన బలాలపై మనం ఫోకస్ పెట్టవచ్చు. ఫాఫ్ అద్భుతంగా ఆడాడు. మా బ్యాట్స్‌మెన్ ఇంకొంచె ఏదైనా చేయాల్సింది. స్క్వేర్‌లెగ్‌ను నిర్లక్ష్యం చేసి లాంగాన్ లాంగాఫ్‌లో షాట్స్ ఆడి మూల్యం చెల్లించుకున్నారు.

రాజస్థాన్ స్పిన్నర్లను మెచ్చుకోవాలి..

రాజస్థాన్ స్పిన్నర్లను మెచ్చుకోవాలి..

'217 పరుగుల లక్ష్యాన్ని ఛేదించాలంటే మాకు మంచి శుభారంభం అవసరం. కానీ అది దక్కలేదు. స్టీవ్‌ స్మిత్‌, సంజు శాంసన్‌ అద్భుతంగా ఆడారు. రాజస్థాన్‌ బౌలర్లనూ మెచ్చుకోవాల్సిందే. తొలి ఇన్నింగ్స్‌ చూశాక బంతుల్ని ఏ లెంగ్త్‌ల్లో వేయాలో తెలుస్తుంది. వారి స్పిన్నర్లూ అదే వ్యూహంతో రాణించారు. బ్యాట్స్‌మెన్‌కు దూరంగా బంతులు విసిరారు. మా వాళ్లు మాత్రం తప్పులు చేశారు. ఎక్కువగా ఫుల్‌ లెంగ్త్‌ బంతులు విసిరారు. రాజస్థాన్‌ను 200 స్కోరుకే నియంత్రిస్తే మ్యాచ్‌ మరోలా ఉండేది' అని ధోనీ అన్నాడు. చెన్నై సూపర్ కింగ్స్ క్యాంప్‌లో ఇద్దరు ఆటగాళ్లతో సహా 13 మందికి కరోనా సోకడంతో ఆ జట్టు క్వారంటైన్ టైమ్ పొడిగించిన విషయం తెలిసిందే.

అదరగొట్టిన శాంసన్..

అదరగొట్టిన శాంసన్..

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌' సంజూ శాంసన్ దూకుడుకు తోడు కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌, జోఫ్రా ఆర్చర్‌ చెలరేగడంతో ఈ స్కోరు సాధ్యమైంది. శాంసన్, స్మిత్‌ రెండో వికెట్‌కు 57 బంతుల్లోనే 121 పరుగులు జోడించారు. చెన్నై బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లు తీయగా.. చహర్, ఎంగిడి, చావ్లా తలో వికెట్ తీశారు. అనంతరం చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్లకు 200 పరుగులు చేసి 16 పరుగులతో ఓడింది. డుప్లెసిస్‌ అర్ధ సెంచరీ సాధించగా... షేన్‌ వాట్సన్‌ ఫర్వాలేదనిపించాడు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, శ్రేయస్ గోపాల్, టామ్ కరణ్ తలో వికెట్ తీయగా.. రాహుల్ తెవాటియా 3 వికెట్లు పడగొట్టాడు. ధాటైన ఇన్నింగ్స్ ఆడిన శాంసన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందింది.

RR vs CSK: ఆ మూడు తప్పిదాలే చెన్నై సూపర్ కింగ్స్ కొంప ముంచాయి!

Story first published: Wednesday, September 23, 2020, 12:12 [IST]
Other articles published on Sep 23, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+