Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

స్నేహాన్ని చూడలేదు కాబట్టే ధోనీ ఈ స్థాయిలో ఉన్నాడు: ఆర్పీ సింగ్

RP Singh recalls the incident when MS Dhoni fought with selectors for playing him over Irfan Pathan

న్యూఢిల్లీ: భారత క్రికెట్ చరిత్రలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అత్యంత విజయవంతమైన కెప్టెన్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను అందించిన చిరస్మరణీయ విజయాలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా భావోద్వేగాలు బయటపెట్టని మహీ.. మిస్టర్ కూల్‌గా గుర్తింపు పొందాడు. అయితే తాను కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్న మొదట్లో సెలెక్షన్‌కు సంబంధించిన ఓ విషయం సెన్సేషన్ అయింది.

ఆర్పీకి బదులు పఠాన్..

ఆర్పీకి బదులు పఠాన్..

2008 ఇంగ్లండ్ సిరీస్ జట్టు ఎంపికలో కెప్టెన్ ధోనీ.. సెలెక్టర్లతో వాగ్వాదానికి దిగినట్లు వార్తలు హల్‌చల్ చేశాయి. ఆ సిరీస్‌లో ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ స్థానంలో ఆర్పీ సింగ్‌ను తీసుకోవాల‌ని సెలెక్ట‌ర్లు భావించారు. అయితే దీనిపై ‌భార‌త కెప్టెన్ ధోనీ వారితో విభేదించాడని, ఆర్పీని జ‌ట్టులోకి తీసుకుంటే కెప్టెన్సీని వ‌దిలేస్తాన‌ని బెదిరించాడని ప్రచారం జరిగింది.

అదేం ప్రభావం చూపలేదు..

అదేం ప్రభావం చూపలేదు..

తాజాగా స్పోర్ట్స్ తక్ చానె‌ల్‌తో మాట్లాడుతూ ఈ ఘటనను గుర్తు చేసుకున్న ఆర్పీ సింగ్.. ఆ లీక్ త‌న‌పై ఎలాంటి ప్ర‌భావం చూప‌లేద‌న్నాడు. ప‌రిస్థితుల‌కు అనుగుణంగా స‌రైన నిర్ణ‌యాలు తీసుకోవ‌డంలో ధోనీ దిట్టని తెలిపాడు. అత‌ని నిర్ణ‌యాలు ప‌క్ష‌పాత‌ర‌హితంగా ఉంటాయ‌ని అవే ధోనీని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయని ఈ మాజీ పేసర్ కొనియాడాడు.

ధోనీతో చర్చించా..

ధోనీతో చర్చించా..

‘ఆ ఘటన నాపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇంగ్లండ్ సిరీస్‌కు మందు ఇండోర్‌లో జరిగిన మ్యాచ్‌లో నేను ఒక్క వికెట్ కూడా తీయలేదు. అయితే తనకు మరో చాన్స్ వస్తుందని అందరు భావించారు. కానీ రాలేదు. అదృష్టవంతులైన కొందరికి మాత్రం ఐదు, పది చాన్స్‌లు వస్తాయి. నేను ఏ విషయంలో మెరుగవ్వాలనేదానిపై కూడా ధోనీతో చర్చించా. దానికోసం ఏం చేయాలని కూడా అడిగా. ధోనీ స్నేహం భిన్నమని నాకు తెలుసు. కానీ జట్టును నడిపించడం అన్నిటికన్నా ముఖ్యమైనది.

వారినే ప్రోత్సహించాడు..

వారినే ప్రోత్సహించాడు..

అప్ప‌టి ప‌రిస్థితుల‌ను బట్టి త‌న కంటే మెరుగైన ఆటగాడిని(పఠాన్) అతను తీసుకున్నాడని భావిస్తున్నా. అతని ప్రణాళికలను పక్కాగా అమలు చేసే ఆటగాళ్లనే ధోనీ ప్రోత్సహించాలనుకున్నాడు. అతని పక్షపాతరహిత నిర్ణయాలే అతన్ని ఈ రోజు ఈ స్థాయిలో నిలబెట్టాయి. నా సామర్థ్యం మేరకు ఆడలేకపోయా. బౌలింగ్‌లో వేగం తగ్గడం, స్వింగ్ లేకపోవడం వంటి అంశాలు నన్ను ప్రభావితం చేశాయి. వీటిని మెరుగు చేసుకుంటే మరింత కాలం ఆడేవాడిని. ఏదైన‌ప్ప‌టికీ నేను సాధించిన దానిపై సంతృప్తిగా ఉన్నా'అని ఈ మాజీ పేసర్ చెప్పుకొచ్చాడు

2005లో అరంగేట్రం చేసిన ఆర్పీ.. 2011లో చివ‌రి మ్యాచ్ ఆడాడు. ఆరేళ్ల త‌న కెరీర్‌లో 14 టెస్టులు, 58 వ‌న్డేలు, 10 టీ20ల్లో బ‌రిలోకి దిగాడు. ప్ర‌స్తుతం బీసీసీఐ క్రికెట్ స‌ల‌హా కమిటీలో స‌భ్యునిగా ఆర్సీ సింగ్ వ్య‌వ‌హ‌రిస్తున్నాడు.

కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్.. ట్రోలర్స్‌‌కు మహ్మద్ షమీ వైఫ్ కౌంటర్!

Story first published: Monday, May 11, 2020, 19:17 [IST]
Other articles published on May 11, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+