For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కుక్కలు మొరుగుతూనే ఉంటాయ్.. ట్రోలర్స్‌‌కు మహ్మద్ షమీ వైఫ్ కౌంటర్!

Mohammed Shamis estranged wife Hasin Jahan slams trollers for criticising her dance videos

కోల్‌కతా: సోషల్ మీడియా వేదికగా తనపై జరుగుతున్న ట్రోలింగ్‌ను టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ సతీమణి హసీన్ జహాన్‌ తిప్పికొట్టింది. అభిమానుల తిట్లకు ఏ మాత్రం బెదరని హసీన్ మరిన్నీ డ్యాన్స్ వీడియోలను షేర్ చేసింది. మోడల్, నటి అయిన ఆమె.. ఓ హిందీ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ఈ వీడియోలో పాటకు తగ్గట్టు డ్యాన్స్ చేస్తూ తన అందాలను ఎక్స్‌పోజ్ చేసింది. దీంతో చిర్రెత్తుకుపోయిన అభిమానులు హసీన్‌పై మాటల దాడికి దిగారు.

ఇస్లాంకు విరుద్దంగా..

మతాన్ని ప్రస్తావిస్తూ ఆమెపై దుమ్మెత్తిపోసారు. పవిత్రమైన రంజాన్ మాసంలో ఇస్లాం నిబంధనలకు విరుద్దంగా ఇలా డ్యాన్స్ చేయడం ఏంటని ప్రశ్నించారు. అంతేకాకుండా హసీన్ వస్త్రదారణపై కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ట్రోలింగ్‌కు పాల్పడ్డారు. స్టార్ పేసర్ అయిన షమీని మానసికంగా వేధించావని, అతనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అతనితో విడిపోయి చిన్నపాపకు తండ్రి దూరం చేశావని మండిపడ్డారు. వెంటనే షమీకి విడాకులు ఇవ్వాలని సూచిస్తున్నారు. ఇక మతం, వస్త్రదారణ పేరిట ఆమెపై ట్రోలింగ్‌కు దిగడం ఇదే తొలిసారి కాదు. షమీతో వైవాహిక జీవితం సాఫీగా సాగుతున్న సమయంలో కూడా హసీన్‌పై ఇదే తరహా ట్రోలింగ్ జరిగింది.

కుక్కలు మెరుగుతూనే ఉంటాయ్..

ఈ తిట్లకు ఏమాత్రం బెదరని హసీన్ మరిన్ని వీడియోలను షేర్ చేసింది. ఫ్యాన్స్ ప్రస్తావించిన ప్రతీ అంశం ప్రతిబింబించేలా ఈ వీడియోలు ఉన్నాయి. వస్త్రధారణపై అభ్యంతరం వ్యక్తం చేసినా.. పొట్టి పొట్టి దుస్తులతో డ్యాన్స్ చేసిన వీడియోలనే హసీన్ షేర్ చేసింది. ఓ వీడియోలో బాలీవుడ్ సినీ తారాలతో చిందేయగా.. మరో వీడియోలో పొట్టి దుస్తులతో ఎక్స్ పోజ్ చేసింది. పైగా ఆవీడియోలకు దిమ్మతిరిగే క్యాప్షన్ ఇచ్చింది. ట్రోలర్స్‌ను అరిచే కుక్కలతో పోలుస్తూ.. కుక్కలు మెరుగుతూనే ఉంటాయని, మనపని మనం చేసుకోవాలని పేర్కొంది. వృత్తి పరంగా మోడల్‌,చీర్ గర్ల్ అయిన హసీన్‌ జహాన్‌‌ను షమీ ప్రేమించి 2014లో పెళ్లిచేసుకున్నాడు. అనంతరం నెలకొన్న గొడవలతో ప్రస్తుతం వీరిద్దరు విడిగా ఉంటున్నారు.

షమీపై సంచలన ఆరోపణలు..

రెండేళ్ల క్రితం హాసిన్ జహాన్ షమీపై సంచలన ఆరోపణలతో పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. షమీ స్త్రీలోలుడని, అతని కుటుంబం తనను అనేక ఇబ్బందులు గురిచేసిందని, లైంగికంగా కూడా వేదించారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా షమీ మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడని, తప్పుడు వయసు పత్రాలు సమర్పించి క్రికెట్‌లోకి వచ్చాడని ఆరోపించింది. ఆమె ఫిర్యాదుతో కోల్‌కతా పోలీసులు షమీ, అతని సోదరుడిపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేశారు. హసీన్ ఆరోపణలతో విచారణ చేపట్టిన బీసీసీఐ.. అతను ఎలాంటి తప్పు చేయలేదని క్లీన్ చీట్ ఇచ్చింది.

Mohammed Shami’s Wife Hasin Jahan Slams Trollers For Commenting Her Dance Videos

చచ్చిపోవాలనుకున్నా..

ఇటీవల రోహిత్‌తో ఇదే విషయాన్ని గుర్తు చేసుకొని షమీ ఆవేదనకు గురైన విషయం తెలిసిందే. వ్యక్తిగత జీవితంలో సమస్యలు, ప్రతీ విషయం మీడియాలో సెన్సేషన్ కావడం, అదే సమయంలో తాను రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో తీవ్రంగా మధనపడ్డానని ఈ స్టార్ పేసర్ వెల్లడించాడు. రోడ్డు ప్రమాదం కూడా ఐపీఎల్‌కు ముందే 10-12 రోజుల ముందే జరగడంతో తన కెరీర్‌ గందరగోళంలో పడిందన్నాడు. ఈ వరుస సమస్యలతో అల్లాడిన తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నట్లు గుర్తు చేసుకున్నాడు. కానీ కుటుంబ సభ్యుల అండతో ఈ గండం నుంచి గట్టెక్కానని వ్యాఖ్యానించాడు.

సెహ్వాగ్ మరో దేశం తరఫున ఆడుంటే ఖచ్చితంగా ఆ ఘనతనందుకునేవాడు: పాక్ మాజీ క్రికెటర్

Story first published: Monday, May 11, 2020, 16:55 [IST]
Other articles published on May 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+