
పాత వీడియో ఫుటేజ్..
పాత వీడియో ఫుటేజ్‌ను విరాట్ కోహ్లీ బర్త్ డే సెలెబ్రేషన్స్‌తో ఎడిట్ చేశామని ఆర్‌సీబీ ట్వీట్ చేసింది. అది యూఏఈ ఫ్లాగ్ డే సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన ఫుటేజ్ అని పేర్కొంది. ‘మీ ఆత్మీయులు, స్నేహితులతో సంతోషంగా దీపావళి పండుగను జరుపుకున్నారని ఆశిస్తున్నాం. ఆర్‌సీబీ సంబరాలకు సంబంధించి ఇటీవల షేర్ చేసిన వీడియోలో ఉన్నట్లు క్రాకర్స్ కాల్చలేదు. అది యూఏఈ ఫ్లాగ్ డే సెలెబ్రేషన్స్ ఫుటేజ్. పర్యవరణ రక్షణకు ఆర్‌సీబీ ఎప్పుడు తమవంతు కృషి చేస్తూనే ఉంటుంది.'అని క్లారిటీ ఇచ్చింది.

క్రాకర్స్ కాల్చవద్దన్న కోహ్లీ..
దీపావళీ పర్వదినాన తన అభిమానులకు శుభాకాంక్షలు చెప్పిన కోహ్లీ.. పర్యావరణానికి హానీ కలిగించే టపాసులు కాల్చవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశాడు. ‘పర్యవరణానికి హానీ కలిగించే క్రాకర్స్ కాల్చవద్దు. ఈ దీపావళి సింపుల్‌గా దీపాలు, స్వీట్లతో ఆత్మీయులతో సరదాగా జరుపుకుందాం'అని ఓ వీడియో ద్వారా పిలుపునిచ్చాడు. అయితే విరాట్ కోహ్లీ సూచనలపై నెటిజన్లు భగ్గుమన్నారు. నవంబరు 5న నీ పుట్టినరోజు నాడు అర్ధరాత్రి నువ్వు చేసింది ఏంటి..?'అని ప్రశ్నించారు. ‘కోహ్లీ.. నువ్వు కుక్కవి.. అందుకే దీపావళి రోజున టపాసులు పేల్చవద్దంటున్నావ్' అని ఘాటుగా కూడా వ్యాఖ్యానించారు.

దుబాయ్‌లో బర్త్‌డే వేడుకలు..
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడుతూ.. విరాట్ తన 32వ జన్మదిన వేడుకలను దుబాయ్‌లో భార్య అనుష్క శర్మ, బెంగళూరు టీమ్‌మేట్స్‌తో కలిసి బోట్‌లో జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సెలెబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియోను ఆర్‌సీబీ అభిమానులతో పంచుకుంది. ఈ వీడియో కోహ్లీకి బర్త్‌డే విషెస్ చెప్పిన.. ఆర్‌సీబీ యాజమాన్యం పెద్ద ఎత్తున తారాజువ్వల్ని, క్రాకర్స్‌ను కాల్చినట్లు ఉంది. అయితే ఆ వీడియోలు పాత ఫుటేజని ఆర్‌సీబీ క్లారిటీ ఇచ్చింది. కానీ క్రాకర్స్ కాల్చారని భావించిన అభిమానులు.. అప్పుడు బాణాసంచా కాలుస్తుంటే అభ్యంతరం చెప్పని కోహ్లీ.. మరి ఇప్పుడు వాతావరణ కాలుష్యం గురించి గాబరా పడిపోవడం విడ్డూరంగా ఉందని అసహనం వ్యక్తం చేశారు.

ఆసీస్‌తో కోహ్లీసేన సై..
ఇక ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో కోహ్లీ నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. కరోనా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ పాటిస్తుంది. అయితే జట్టుకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. రెండు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్.. నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లు ఆడనుంది. కరోనా అనంతరం ఇదే తొలి అంతర్జాతీయ టూర్ కావడంతో భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత పర్యటనలో భారత్ 2-1తో టెస్ట్ సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించింది. ఇప్పుడు అదే రిపీట్ చేయాలని భావిస్తోంది.
PSL 2020లో ముంబై ఇండియన్స్ గ్లోవ్స్.. క్రికెట్ కిట్లకు కూడా దిక్కులేదా? అంటూ పాక్‌పై నెటిజన్ల ఫైర్


Click it and Unblock the Notifications












