తొలి డబుల్ సెంచరీతో..
2013లో బెంగళూరు వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో రోహిత్ డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. 209 పరుగులతో భారత్ తరఫున ఈ ఘనతను అందుకున్న మూడో బ్యాట్స్‌మన్‌గా ఈ ముంబై క్రికెటర్ నిలిచాడు. ఇక ఆ సిరీస్‌లో అతనికిది రెండో సెంచరీ. తాను ఓపెనర్‌గా ఆడటం మొదలు పెట్టిన ఏడాదికే రోహిత్ ఈ అద్భుత రికార్డును సొంతం చేసుకున్నాడు. స్థిరంగా రాణిస్తూ.. విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో హిట్‌మ్యాన్‌గా బిరుదు అందుకున్నాడు. అయితే ఆ సూపర్ ఇన్నింగ్స్ అనంతరం పెవిలియన్‌కు వెళ్తున్న తనను టీవీ మేనేజర్ ఫ్లాష్ ఇంటర్వ్యూకు పిలిచాడని, కానీ తాను నిరాకరించినట్లు రోహిత్ చెప్పుకొచ్చాడు. అప్పుడే ఈ పేరు పెట్టారని తెలిపాడు.

ఫ్లాష్ ఇంటర్వ్యూ కోసం పిలిచి..
‘బెంగళూరు (209) డబుల్ సెంచరీ చేసిన అనంతరం పెవిలియన్‌కు వెళ్తుంటే ఫ్లాష్ ఇంటర్వ్యూ ఇవ్వాలని కోరారు. నేను అలసిపోయానని మీడియా మేనేజర్‌కు చెప్పాను. ఇప్పుడు నేను వెళ్లాలి తర్వాత ఇస్తాలే అన్నాను. దానికి అతను ఇది రికార్డు.. నువ్వు కచ్చితంగా రావాల్సిందేనన్నాడు. అక్కడే పీడీ ఉన్నాడు. నీకు తెలుసు కదా అతనెవరో. అదే చహల్ బ్రదర్. అతను నాతో ‘నువ్వు హిట్‌మ్యాన్‌లా ఆడావు. నువ్వు హిట్ మ్యాన్‌వే'అన్నాడు. దాంతో ఆ పేరు అలా వచ్చింది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేస్తాననుకున్నారు..
ఆ మ్యాచ్‌లో సెహ్వాగ్ రికార్డు బ్రేక్ చేస్తానని అందరూ అంచనాలు పెట్టుకున్నారని రోహిత్ గుర్తు చేసుకున్నాడు. 'నేను సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాలని ముఖ్యంగా యువరాజ్ సింగ్, శిఖధావన్ కోరుకున్నారు. నేను ఔటై పెవిలియన్‌కు వచ్చిన తర్వాత మరిన్ని పరుగులు సాధిస్తే బాగుండేది, దీంతో సెహ్వాగ్ రికార్డు తెరమరుగయ్యేదని యూవీ నాతో అన్నాడు. ఆ సమయంలో నా జోరు చూసి.. ఆ రికార్డు బ్రేక్ చేస్తానని టీమిండియా ఆటగాళ్లు చాలా అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఆలా జరగలేదు. ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చిందనుకోండి' అని రోహిత్ తెలిపాడు.

14వేల పరుగులు..
రోహిత్ శర్మ ఇప్పటివరకు 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. వన్డేల్లో 27 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలతో 7,119 పరుగులు చేశాడు. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లలో కలిపి 14,029 పరుగులు చేశాడు. ఐపీఎల్ సందడితో ఎంతో ఉత్సహంగా కన్నుల పండుగగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఎక్కడివారక్కడే ఇరుక్కుపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధికంగా నిలిపివేయబడిన సంగతి తెలిసిందే.
టికెట్ తీసుకోకుండా కండక్టర్‌కు అలా చెప్పి అడ్డంగా బుక్కయ్యా: కోహ్లీ


Click it and Unblock the Notifications












