చహల్ ఎంగేజ్‌మెంట్.. ఫన్నీమీమ్‌తో రోహిత్ కామెంట్!

ముంబై: టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ, లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్ ఎంత క్లోజో అందరికి తెలిసిందే. మైదానంలో వీరిద్దరు చేసే సరదా పనులు.. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై మరొకరు వేసుకునే సెటైర్స్ అభిమానులకు సుపరిచితమే. ఒక తల్లికి పుట్టకపోయినా సోదరుల్లా అప్యాయంగా కలిసిమెలిసి ఉంటారు.
ఇక యజువేంద్ర చహల్ త్వరలో డిజిటల్ కంటెంట్ క్రియేటర్ అయిన ధనశ్రీ వర్మను పెళ్లి చేసుకుంటున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. తన మనసుకు నచ్చిన అమ్మాయితో నిశ్చితార్థం జరిగిందని వెల్లడించాడు. చహల్ ఆకస్మిక నిర్ణయంతో అటు అభిమానులతో పాటు ఇటు అతని సహచర ఆటగాళ్లు కూడా అవాక్కయ్యారు. ఏదిఏమైనా ఓ ఇంటివాడు కాబోతున్న యూజీకి విషెస్ తెలియజేశారు.
రోహిత్ సెటైర్..
ఈ నేపథ్యంలోనే ప్రతి ఒక్కరిపై సెటైర్లు వేసే చహల్‌కు అదే రీతిలో రోహిత్ శర్మ విషెస్ చెప్పాడు. ఓ ఫన్నీ మీమ్‌ను షేర్ చేస్తూ..‘భాయ్ నిశ్చితార్థం చేసుకున్నందుకు కంగ్రాట్స్.. అంతా మంచే జరగాలిని కోరుకుంటున్నా'అని క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే కామెంట్ సింపుల్‌గానే ఉన్నా.. అతను షేర్ చేసిన మీమ్ వార్తల్లో నిలిచేలా చేసింది. 2050లో రాయల్‌చాలెంజర్స్ యువ అభిమానితో చహల్ అంటూ యుజీ పోలీకలతో ఉన్న ఓ ఓల్డ్‌మ్యాన్, యంగ్ మ్యాన్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు.

ఆర్సీబీని అవమానిస్తున్నావ్..?
ఇక రోహిత్ ట్వీట్‌పై అభిమానులు ఎవరికి తోచిన విధంగా వారు పెడర్ధాలు తీస్తున్నారు. ‘పెళ్లి చేసుకుంటే అలా అయితావని హెచ్చిరిస్తున్నావా..? రోహిత్'అని ఒకరంటే.. ‘ఆర్సీబీ తరఫున టైటిల్ కోసం నిరీక్షించి అలా అయ్యాడని విమర్శిస్తున్నావా?'అని మరొకరు కామెంట్ చేస్తున్నారు. ‘ఆర్సీబీని అవమానపరిచినట్లుంది నీ పోస్ట్'అని ఇంకొకరు ట్వీట్ చేశారు. ప్రస్తుతం రోహిత్ ట్వీట్ వైరల్ అయింది.

సోషల్ మీడియా ప్రేమాయణం..
సోషల్ మీడియా వేదికగానే చహల్, ధనశ్రీ పరిచయం ఏర్పడినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు తమ వివాహానికి ఆమోదం తెలిపినట్లు చహల్ వెల్లడించాడు. 'మా కుటుంబాలతో పాటు మేమిద్దరమూ "అవును" అనేశాం. #నిశ్చితార్థం వేడుక' అని చహల్ ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్‌లలో పంచుకున్నాడు. తన నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన, అంతకుముందు ఇద్దరు కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశాడు. టీమిండియా ఆటగాడైన చహల్ తరచుగా పోస్ట్ చేసే టిక్‌టిక్ వీడియోలకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు.

ధనశ్రీ ఓ యూ ట్యూబర్..
యూ ట్యూబర్, కొరియా గ్రాఫర్ కూడా అయిన ధనశ్రీ తన పేరుతోనే ఒక కంపెనీ నెలకొల్పి తన వీడియోలు అందులో పెడుతుంటుంది. ఇదే క్రమంలో చహల్‌కు కూడా డ్యాన్స్ నేర్పినట్లు ఇటీవల ఒక పోస్ట్ చేసింది కూడా. ఆమె డాక్టర్ అని కూడా ప్రచారం జరుగుతుంది. చహల్ మాత్రం తనకు కాబోయే సతీమణి గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. భారత్ తరఫున 52 వన్డేలు, 42 టి20లు ఆడిన చహల్ ఆర్‌సీబీ జట్టు తరఫున త్వరలోనే ఐపీఎల్ బరిలోకి దిగనున్నాడు.
రన్నింగ్‌లో ధోనీని ఓడించే మొనగాడు వచ్చే వరకు క్రికెట్ ఆడుతాడు: సంజయ్ మంజ్రేకర్
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications