Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఐపీఎల్‌లో ఏ రోజు టైమ్‌కు బ్రేక్ ఫాస్ట్ చేసింది లేదు.. 10 గంటలు నిద్రపోయేవాడిని: రోహిత్

Rohit Sharma tells R Ashwin why he never made it to breakfast table in IPL history

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అతను సాధించిన నాలుగు ట్రోఫీలే ఈ విషయాన్ని చెబుతాయి. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఇన్ని టైటిల్స్ ఏ జట్టు మరే కెప్టెన్ కూడా గెలవలేదు. మైదానంలో క్రమశిక్షణతో ఉంటూ టీమ్‌ను నడిపించే రోహిత్ .. వెలుపల మాత్రం చాలా బద్ధకంగా వ్యవహరిస్తుంటాడంటా. ఎంతలా అంటే.. ఇన్నేళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ఈ ముంబై క్రికెటర్ ఒక్కసారి కూడా బ్రేక్ ఫాస్ట్ టేబుల్ వద్ద‌ టిఫిన్ చేయలేనంతా. ఈ విషయాన్ని రోహిత్ శర్మనే స్వయంగా వెల్లడించాడు. టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌తో ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రోహిత్ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

9 గంటలు నిద్ర పక్కా..

9 గంటలు నిద్ర పక్కా..

తాను కనీసం 9 నుంచి 10 గంటలు నిద్రపోతానని చెప్పుకొచ్చిన హిట్ మ్యాన్.. తన కూతురు సమైరా కారణంగా ఇటీవల కాస్త నిద్రపోవడం తగ్గించానని తెలిపాడు. ‘అశ్విన్ ఇది నువ్వు నమ్మవు.. కానీ నిజం. ఇన్నేళ్ల ఐపీఎల్ చరిత్రలో నేను ఒక్కసారి కూడా బ్రేక్‌ఫాస్ట్ టేబుల్ వద్దకు వెళ్లలేకపోయాను. టోర్నీలో మ్యాచ్‌లు ముగిసేసరికి అర్ధరాత్రి అవుతుంది.. ఇది ఒక కారణమైతే.. మరొక కారణం నేను కనీసం 9-10 గంటలు తప్పనిసరిగా నిద్రపోతా. కానీ.. సమైరా పుట్టిన తర్వాత తనతో కలిసే నిద్రపోతున్నా.. ఆమెతో పాటే నిద్రలేస్తున్నా. సమైరా మెళకువగా ఉన్న సమయంలో నిద్రపోవడం సాధ్యం కావడం లేదు'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

 వడపావ్ మిస్సవుతున్నా..

వడపావ్ మిస్సవుతున్నా..

ఇక లాక్‌డౌన్ కారణంగా తనకెంతో ఇష్టమైన వడపావ్‌ను మిస్సావుతున్నానని రోహిత్ తెలిపాడు. ఐపీఎల్ జరిగిన గత 12 ఏళ్లలో ప్రతి ఏడాది చౌపట్టి బీచ్‌లోని ఒక దుకాణానికి వెళ్లి వడపావ్ తినేవాడినని హిట్‌మ్యాన్ తెలిపాడు.అయితే కరోనా లాక్ డౌన్ కారణంగా ఐపీఎల్ వాయిదా పడటం తో ఐపీఎల్ చరిత్రలో మొదటిసారిగా నేను అక్కడ వడపావ్ తినకుండా ఉండాల్సి వస్తుంది అని రోహిత్ అశ్విన్‌తో తన బాధను పంచుకున్నాడు.

 సూపర్ ఫొటో షేర్ చేసిన హిట్ మ్యాన్..

సూపర్ ఫొటో షేర్ చేసిన హిట్ మ్యాన్..

ఈ లైవ్ సెషన్‌కు ముందు రోహిత్ తన సతీమణి రితికా సజ్డేతో ఉన్న ఓ అద్భుతమైన ఫొటోను పంచుకున్నాడు. దానికి ఓ సూపర్ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. ‘నేర్చుకోవడం అనేది ఎప్పటికి ఆగదు. ఒకరికొకరం అర్థం చేసుకోవడం.. ఇలా ఆమె నాతో ఉన్నందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నా. ఇన్ని రోజు ఏం కోల్పోయామో ఈ లాక్‌డౌన్ కాలం తెలియజేసింది. 'అని రోహిత్ క్యాప్షన్‌గా పేర్కొన్నాడు.

కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అఫ్రిదికి యూవీ, ధావన్ కౌంటర్!

Story first published: Tuesday, May 19, 2020, 13:10 [IST]
Other articles published on May 19, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+