Rohit Sharma: క్రికెట్‌లో ఎవరూ లేజీగా ఉండరు.. అలా ఉంటే మూతి పచ్చడవుతుంది!

లండన్: క్రీడాకారులు ఎవరూ లేజీగా ఉండరని, అలా ఉంటే రాణించలేరని టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. తన బ్యాటింగ్ స్టైల్, మైదానంలో తన ఫీల్డింగ్ మూమెంట్స్‌ను లేజీగా అభివర్ణిస్తుంటారు. లేట్‌గా షాట్ ఆడటం.. క్రీజులో కుదురుకోవడానికి టైమ్ తీసుకుంటుండటంతో హిట్ మ్యాన్‌ను లేజీ క్రికెటరని పిలుస్తుంటారు. తాజాగా ఈ విషయాన్ని టీమిండియా వెటరన్ క్రికెటర్ దినేశ్ కార్తీక్.. రోహిత్ ముందు ప్రస్తావించాడు.
కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్ భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో అక్కడే ఉన్నాడు. వరుసగా భారత ఆటగాళ్లను ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన కార్తీక్.. రెండో టెస్ట్‌కు ముందు భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో మాట్లాడాడు.

క్రీడల్లో సోమరితనం పనికిరాదు..
ఈ సందర్భంగానే లేజీ అనే కామెంట్స్‌పై కార్తీక్ ప్రశ్నించాడు. దీనికి రోహిత్ బదులిస్తూ.. ఏ క్రీడాకారుడు లేజీగా ఉండడని తెలిపాడు. 'క్రీడల్లో సోమరితనం పనికిరాదు. ఏ ఒక్కరు కూడా అలా ఉండలేరు. అలా ఉంటే రాణించలేరు. టీవీల్లో చూసిన దృశ్యాలు, సౌండ్‌తో జనాలు ఆటగాళ్లు లేజీగా ఉంటారని అనుకుంటుండోచ్చు. కానీ అలా ఉంటే మైదానంలో రాణించలేం. సాధించాల్సిన ఘనతలను అందుకోలేరు. ఏ ప్లేయర్ అయిన ఆట కంటే ముందు ఉండాలి. లేజీగా ఉంటే ప్రత్యర్థులపై విజయం సాధించలేరు.

ముక్కు పచ్చడవుతోంది..
క్రికెట్‌లో లేజీగా ఉంటే పుల్ షాట్ ఆడలేం. ఎందుకంటే బౌలర్లు గంటకు 145 ప్లస్ కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తారు. సోమరిగా ఉంటే బంతి నేరుగా వచ్చి తలకు తగులుతుంది. మూతి పచ్చడవుతుంది. ఇది ప్రజలకు తెలుసని నేను అనుకోను. వారు అలా అనడం వల్ల నాకు వచ్చిన సమస్యేం లేదు. నేను భారత్‌కు ఆడుతున్నప్పటి నుంచి నన్ను లేజీ క్రికెటర్ అంటూనే ఉన్నారు. 'అతని సోమరితనం వచ్చింది'అనే మాటలు వింటూనే ఉన్నా. కానీ నాకు ఈ లేజీ ఎలెగెన్స్ అంటే ఎంటో అర్థం కాలేదు.
Rohit Sharma Love Story: రితికాను లవ్ చేస్తున్నానని చెప్పేందుకు భయపడ్డా!

ఎవరి శైలి వారిది..
అంతేకాకుండా క్రీజులో కుదురుకోవడానికి ఎక్కువ సమయం తీసుకుంటాననే మాటలు కూడా విన్నాను. నా విషయంలో అలాంటిదైతే లేదు. నేనెప్పుడూ బ్యాటింగ్ చేస్తున్నా.. ఎక్స్‌ట్రా టైమ్ ఏం ఉండదు. అన్నిటికీ సిద్దంగా ఉండాలనే అనుకుంటా. ప్రతీ బ్యాట్స్‌మన్‌కు బౌలర్ నుంచి సవాల్ ఎదురవుతూనే ఉంటుంది. మన మనస్సు ఆటపైనే ఉండాలి. కొంచె ఎమరపాటుగా ఉన్నా బౌలర్లు గందరగొళానికి గురి చేస్తారు. టెక్నికల్ నేను బాల్ ఆలస్యంగా ఆడుతున్నారని చెప్పవచ్చు. బ్యాటింగ్ చేయడంలో విభిన్న స్టైల్స్ ఉంటాయి. కొంతమంది బాల్‌ను ముందుగానే ఆడితే.. మరికొంతమంది లేట్‌గా ఆడుతారు. కానీ టైమ్ తక్కువ.. ఎక్కువా? అనేదేం ఉండదు.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications