Rohit Sharma Love Story: రితికాను లవ్ చేస్తున్నానని చెప్పేందుకు భయపడ్డా!

లండన్: తన మేనేజర్ అయిన రితికా సజ్దేను ప్రేమిస్తున్నానని ఫ్రెండ్స్‌కు చెప్పేందుకు భయపడ్డానని టీమిండియా డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ అన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న హిట్ మ్యాన్ తనకు లిట్మస్ టెస్ట్‌గా మారిన రెండో టెస్ట్‌లో సత్తా చాటాడు. హాఫ్ సెంచరీతో దుమ్మురేపాడు. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్‌తో కలిసి 126 పరుగులు భాగస్వామ్యాన్ని అందించి 69 ఏళ్ల రికార్డును అధిగమించాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా వెటరన్ దినేశ్ కార్తీక్‌కు రోహిత్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు.
కామెంటేటర్‌గా అవతారం ఎత్తిన దినేశ్ కార్తీక్ తనదైన వ్యాఖ్యనంతో అభిమానులను అలరిస్తునే ఉన్నాడు. భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ నేపథ్యంలో ఇంగ్లండ్‌లోనే ఉన్న దినేశ్ కార్తీక్.. వరుసగా భారత ఆటగాళ్లను ఒక్కొక్కరిగా ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఫస్ట్ టెస్టు సందర్భంగా విరాట్ కోహ్లీని ఇంటర్వ్యూ చేసిన కార్తీక్.. అతడి జీవితంలోని అనేక ఆసక్తికర విషయాలను అభిమానులకు అందించాడు. తాజాగా భారత డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మతో మాట్లాడాడు. ఈ ఇంటర్వ్యూలో రోహిత్ తన జీవితానికి సంబంధించిన ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

రితికా గురించి చెప్పేందుకు భయపడ్డా..
రితికా సజ్దేతో ప్రేమాయణం గురించి దినేశ్ కార్తీక్ ప్రశ్నించగా.. ఆమె తన వద్ద మేనేజర్‌గా పనిచేసేదని, ఆ క్రమంలో ఇద్దరం చాలా క్లోజ్‌గా ఉండేవాళ్లమే తప్పా తమకు ఆ ఆలోచనే లేదని రోహిత్ బదులిచ్చాడు. 'అప్పుడు ఇప్పుడు నా మేనేజర్ రితికా సజ్దేనే. ఆ క్రమంలో మేమిద్దరం చాలా క్లోజ్ అయ్యాం. మంచి స్నేహితులయ్యాం. ముందుగా మా ఇద్దరి మధ్య ఎలాంటి సంబంధంలేదు. అసలు మాకు ఆలోచన కూడా లేదు. కేవలం వర్క్‌కు సంబంధించిన రిలేషన్ తప్పా మరేది లేదు. కావాలంటే రితికా ఇక్కడే ఉంది అడగండి. అయితే మా మధ్య ఉన్న చనువు చూసి చాలా అనేవారు. కానీ మేం వాటిని పట్టించుకునేవాళ్లం కాదు.

మా ఫ్రెండ్స్ చెప్పిందే నిజమైంది..
నా క్లోజ్ ఫ్రెండ్స్ కూడా మీరిద్దరూ క్యూట్ కపుల్‌గా ఉన్నారని, మీ ఇద్దరి మధ్య స్నేహానికి మించిన బంధం ఉందనేవారు. నేను మాత్రం వాటిని తప్పుబట్టేవాడిని. అలాంటిదేం లేదని, జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమేనని గట్టిగా చెప్పేవాడిని. కానీ కొన్నాళ్లకు వారు చెప్పిందే నిజమైంది. అప్పుడు వాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలి అని ఆలోచించేవాడిని. ఎందుకంటే వాళ్లు చాలా రోజుల ముందే ఈ విషయం చెప్పారు. అయితే అఫిషియల్‌గా మేమిద్దరం డేటింగ్ చేసిన కొన్నాళ్లకు ఎలాగోలా వాళ్లకు చెప్పేసాను. వారికి చెప్పడానికి భయం కాదు కానీ అదో విభిన్నమైన ఫీలింగ్.

అంతా టచ్‌లోనే ఉన్నారు..
20 ఏళ్ల క్రితం నాకున్న చిన్ననాటి స్నేహితులు ఇప్పటికి నాతో టచ్‌లో ఉన్నారు. వారితో కలవడం, తిరగడం చాలా ఇష్టం. నా ఆటను వాళ్లు ఇష్టపడుతారు. అతనే నిజాయితీగా నా తప్పులను కూడా చెబుతారు. ఏం షాట్ ఆడవని, నువ్వు తప్పుచేసావ్, మంచి చేసావ్ అని నా క్లోజ్ ఫ్రెండ్స్ చెబుతారు. నేను కూడా వారితో అలానే ఉంటా. వారి వ్యక్తిగత విషయాలు నాతో పంచుకున్నప్పుడు కావాల్సిన సలహాలు కూడా ఇస్తాను. ఇప్పటికీ వాళ్లంతా నాతో టచ్‌లోనే ఉన్నారు. మా మధ్య అదే తరహా స్నేహం ఉంది.'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

అప్‌డేట్ అయ్యా..
'రితిక సజ్దేతో వివాహానికి ముందు రోహిత్ శర్మ 'సూర్యవంశం' సినిమా చూసి ఏడ్చేసేవాడు. కానీ పెళ్లి తర్వాత.. రోహిత్ పూర్తిగా మారిపోయాడు. గేమ్ ఆఫ్ థ్రోన్స్, బ్రేకింగ్ బ్యాడ్ వంటి ఇంగ్లీష్ వెబ్ సిరీస్‌లు చూసేస్తున్నాడు, ఈ మార్పుకు కారణం ఏందని డీకే ప్రశ్నించగా రోహిత్ శర్మ నవ్వుతూ బదులిచ్చాచ్చాడు. "ఎవరు చెప్పారు నీకు ఇది? నిజమే.. చాలా మారింది. పెళ్లి తర్వాత టౌన్‌కు షిఫ్ట్ అయ్యా కదా.. అప్‌డేట్ అయ్యాను." అంటూ రోహిత్ ముసి ముసి నవ్వులు నవ్వుకున్నాడు. ఇక తాను పరిస్థితులకు తగ్టట్లు నడుచుకుంటానని తెలిపాడు. 'ఇంగ్లండ్‌లో ఉన్నప్పుడు ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తా. ముంబైలో అక్కడి తీరులా ఉంటాను. రితికా ఇంట్లో వారికి అనుగుణంగా నడుచుకుంటాను. ఒకేలా నేను ఉండను. ఒకే షాట్‌తో క్రికెట్‌లో రాణించలేం కదా? పరిస్థితులకు తగ్గట్లు నాలుగు ఐదు షాట్లు ఆడాల్సిందే కదా. ఇది కూడా అంతే'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇంగ్లండ్‌లో కష్టం..
ఇంగ్లండ్ ఆడిన అనుభవం లేకపోవడంపై డీకే ప్రశ్నించగా.. ప్రపంచంలోనే ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడటం సవాల్‌తో కూడుకున్నదని రోహిత్ చెప్పుకొచ్చాడు.'ఇంగ్లండ్‌లో క్రికెట్ ఆడటం చాలా చాలెంజింగ్. ఇప్పటి వరకు నేను ఇక్కడ కేవలం రెండు మ్యాచ్‌లు ఆడినప్పటికీ ఇతర వేదికల్లో రాణించిన అనుభవం ఉంది. అయితే ఓ క్రికెటర్‌గా ఎప్పుడు తక్కువగా అలోచించకూడదు. అలాగే ఓవర్ థింక్ చేయవద్దు. మన ఆలోచనలపై సమన్వయం ఉండాలి.'అని హిట్ మ్యాన్ తెలిపాడు.
ఇక లార్డ్స్ వేదికగా జరుగతున్న సెకండ్ టెస్ట్‌లో ఓపెనర్లు లోకేశ్ రాహుల్ (248 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్ 127 బ్యాటింగ్), ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో సెంచరీ సాధించగా...దూకుడైన ఆటతో రోహిత్ శర్మ (145 బంతుల్లో 11 ఫోర్లు, 1 సిక్స్‌తో 83) భారీ స్కోరుకు పునాది వేశాడు. వీళ్లిద్దరు ఇంగ్లండ్ బౌలర్లపై అవలీలగా పరుగులు చేయడంతో భారత్ మొదటి రోజు ఆటముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 3 వికెట్లకు 276 పరుగులు చేసింది. రాహుల్‌తో పాటు రహానే (1 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. అండర్సన్‌కు 2 వికెట్లు దక్కాయి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications