For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

టీమిండియా తరఫున బరిలోకి దిగాలంటే ముందు ఫిట్‌నెస్ టెస్ట్ పాసవ్వాలి: రోహిత్

Rohit Sharma Says I have to pass the fitness test before playing for India again

ముంబై: గత రెండేళ్లుగా టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. కోహ్లీ తర్వాత రెగ్యులర్‌గా మూడు ఫార్మాట్లు ఆడింది కూడా హిట్‌మ్యానే. ముఖ్యంగా గతేడాది అతను తీవ్ర పని ఒత్తిడితో అనేక సవాళ్లను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ఆ వెంటనే వరల్డ్ ‌కప్, ఆ తర్వాత వెస్టిండీస్ టూర్, తర్వాత స్వదేశంలో శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, వెస్టిండీస్ ఇలా న్యూజిలాండ్ పర్యట వరకు వరుస సిరీస్‌లతో బిజి బిజీగా గడిపాడు. అదేవిధంగా ఆయా సిరీస్‌ల్లో బ్యాట్‌తోను మెరిసాడు.

గాయంతో దూరమై..

గాయంతో దూరమై..

ఇక న్యూజిలాండ్ పర్యటనలో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి మ్యాచ్‌లో కాలి పిక్క గాయానికి గురై ఆ టూర్ నుంచి అర్దాంతరంగా తప్పుకున్నాడు. అప్పటి నుంచి మైదానంకు దూరమైన రోహిత్.. లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమయ్యాడు. అయితే ఐపీఎల్ 2020 సీజన్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి రావాలనుకున్న రోహిత్‌ ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. ఈ మహమ్మారి కారణంగా ఈ సీజన్‌ నిరవధికంగా వాయిదా పడటంతో పాటు జరుగుతుందో లేదోననే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ ముంబై ఇండియన్స్ సారథి తిరిగి ఆటను ప్రారంభించడానికి మరికొంత సమయం పట్టొచ్చు. తాజాగా లాలిగా ఫుట్‌బాల్ ఫేస్‌బుక్ పేజీ లైవ్ సెషన్‌లో పాల్గొన్న రోహిత్.. తన రీ ఎంట్రీపై ఆసక్తికర వ్యాక్యలు చేశాడు.

ముందు ఫిట్‌నెస్ పాసవ్వాలి..

ముందు ఫిట్‌నెస్ పాసవ్వాలి..

తాను మళ్లీ ఆటను ప్రారంభించాలంటే ముందు ఫిట్‌నెస్ టెస్ట్‌ను అధిగమించాలన్నాడు. ప్రస్తుత పరిస్థితుల్లో అది జరగడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్నాడు.

‘లాక్‌డౌన్‌కు ముందు నా ఆటను ప్రారంభించడానికి అన్ని రకాలుగా సిద్దమయ్యా. ఆ వారంలో నా ఫిట్‌నెస్ టెస్ట్ జరగాల్సింది. కానీ లాక్‌డౌన్‌తో కథ మొదటికి వచ్చింది. పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ముందు నేను ఎన్‌సీఏకు వెళ్లి ఫిట్‌నెస్ టెస్ట్‌లో పాల్గొనాలి. అందులో నెగ్గితే భారత జట్టులో చేరి నా బాధ్యత నేను నిర్వర్తించవచ్చు.'అని రోహిత్ తెలిపాడు. ఇక గాయంతో రోహిత్ దూరమైన అనంతరం భారత్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. న్యూజిలాండ్‌తో 3 వన్డేల సిరీస్‌, రెండు టెస్ట్‌ల సిరీస్‌లో దారుణంగా ఓడి క్లీన్‌స్వీప్‌కు గురైంది.

మా టీమ్‌ను మిస్సవుతున్నా..

మా టీమ్‌ను మిస్సవుతున్నా..

లాక్‌డౌన్ కారణంగా తన సహచర ఆటగాళ్లను ఎంతో మిస్సవుతున్నానని రోహిత్ తెలిపాడు. ‘నా టీమ్‌మెట్స్‌ను చాలా మిస్సవుతున్నా. ముఖ్యంగా వారితో పరిహాసాలు, ఫైటింగ్స్, సరదా కబుర్లు చాలా కోల్పోతున్నా. 365 రోజుల్లో కనీసం 300 రోజుల మేమంతా కలిసే ఉంటాం. కలిసే ఆడుతాం. కలిసే ప్రయాణం చేస్తాం. కాబట్టి మేమంతా ఓ కుటుంబంలా ఉంటాం. లాక్‌డౌన్ అనంతరమే నేను మొదట చేసేది.. మా ఆటగాళ్లందరిని కలుసుకొని వారి బంతులను చితక్కొట్టాలి. త్వరలోనే చేస్తా'అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

నా కన్నా ముందే..

నా కన్నా ముందే..

ఇక దేశంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ.. ఈ మహమ్మారికి కొన్ని ప్రాంతాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయని, మరికొన్ని ప్రాంతాల్లో అసలు ఈ వైరస్ ప్రభావమే లేదన్నాడు. కరోనా పరిస్థితి భారత్‌తో భిన్నంగా ఉందన్నాడు. వైరస్ ప్రభావం లేని ప్రాంతాల్లో లాక్‌డౌన్ ముందుగానే ముగుస్తుందని, కానీ తానుండే ముంబైలో మాత్రం కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉందన్నాడు. దీంతో తనకన్నా ముందే ఇతర ఆటగాళ్లు ఒకరినొకరు పట్టుకుని ఆడుకునే వీడియోలను తనకు పంపిస్తారని అనుకుంటున్నట్లు హిట్‌మ్యాన్ తెలిపాడు.

టీ20 కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ‌కు ఇవ్వాలి: మాజీ క్రికెటర్

Story first published: Sunday, May 24, 2020, 18:37 [IST]
Other articles published on May 24, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+