రాజీవ్ ఖేల్ రత్న రేసులో రోహిత్ శర్మ

న్యూఢిల్లీ: భారత దేశ క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న రేసులో టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ నిలిచాడు. ఈ అత్యున్నత పురస్కారానికి సెలెక్షన్ కమిటీ హిట్‌మ్యాన్‌తో కలిపి మొత్తం నలుగురు ఆటగాళ్లను సిఫార్సు చేసింది. ఆసియా గేమ్స్ గోల్డ్ మెడల్ విన్నర్ వినేష్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బాత్రా, పారాలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ మరియప్పన్ తంగవేలు పేర్లను ఈ అత్యున్నత పురస్కారానికి రికమెండ్ చేసారు. అయితే 2016 తర్వాత నలుగురు అథ్లెట్ల పేర్లను ఖేల్ రత్న అవార్డుకు సిఫార్సు చేయడం ఇదే తొలిసారి. సెలక్షన్ కమిటీలో మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, హాకీ దిగ్గజం సర్దార్ సింగ్ ఉన్నారు.

నాలుగో క్రికెటర్‌గా..?
ఇప్పటివరకు భారత క్రికెట్‌లో సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీలను మాత్రమే ఈ ఖేల్ రత్న అవార్డు వరించింది. ఇప్పుడు రోహిత్ కూడా అందుకుంటే నాలుగో ఆటగాడిగా వీరి సరసన చేరనున్నాడు. 1998లో తొలి సచిన్ ఈ అవార్డును అందుకోగా.. 2007లో టీ20 ప్రపంచకప్‌ను అందించిన ధోనీ ఈ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నాడు. రెండేళ్ల క్రితం (2018) విరాట్ కోహ్లీ.. వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానుతో కలిసి ఈ అవార్డును అందుకున్నాడు.

గతేడాది అదరగొట్టిన రోహిత్..
గతేడాది రోహిత్ శర్మ అద్భుత ప్రదర్శన కనబర్చిన విషయం తెలిసిందే. వన్డేల్లో మొత్తం ఏడు సెంచరీలతో 1490 రన్స్ చేశాడు. ప్రపంచకప్‌లో కోహ్లీసేన సెమీస్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక రెజ్లర్ వినేశ్ ఫోగాట్.. 2018 కామన్‌వెల్త్, ఏషియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. 2016లో షట్లర్ పీవీ సింధు, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్, షూటర్ జీతూ రాయ్, రెజ్లర్ సాక్షీ మాలిక్‌లకు సంయుక్తంగా ఖేల్ రత్న అవార్డును ప్రదానం చేశారు.

ఆన్‌లైన్ వేదికగా నేషనల్ స్పోర్ట్స్ డే
ప్రతీ ఏటా ఆగష్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుతారు. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జన్మదినం సందర్భంగా ఆ రోజును జాతీయ క్రీడా దినోత్సవంగా భారత ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు పలు క్రీడలకు చెందిన ఆటగాళ్లకు పురస్కారాలు అందజేస్తారు. అయితే ఈ సంవత్సరం కరోనా కారణంగా అవార్డుల ప్రదానోత్సవం ఆన్‌లైన్ వేదికగా జరగనుంది. ఆటగాళ్లందరూ ఆన్‌లైన్ ద్వారా ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొంటారు.‘ఈ సంవత్సరం స్పోర్ట్స్ అవార్డ్స్ ఫంక్షన్ ఆన్‌లైన్ లో జరిగే అవకాశం ఉంది. భారత ప్రభుత్వ సూచనల మేరకు అవార్డులు పొందినవారి పేర్లను ఆగష్టు 29 ఉదయం ప్రకటిస్తారు' అని క్రీడా మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.

అవార్డులు కూడా ఆన్‌లైన్‌లోనే..
అవార్డుల కోసం ఆటగాళ్లు సమర్పించే ఆన్‌లైన్ దరఖాస్తులను జూన్ లోనే సమర్పించాల్సి ఉంది. కానీ, కరోనా వల్ల ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును మంత్రిత్వ శాఖ పొడిగించింది. దాంతో అవార్డుల కోసం ఆటగాళ్లు భారీ సంఖ్యలో దరఖాస్తులు పంపారు. జాతీయ క్రీడా పురస్కారాల్లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు, అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు మరియు ధ్యాన్ చంద్ అవార్డులు ఉన్నాయి. ఈ అవార్డులను ప్రతి సంవత్సరం ఆగస్టు 29న రాష్ట్రపతి భవన్‌లో భారత రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రదానం చేస్తారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ఆంటీ.. నేను ధోనీని మాట్లాడుతున్నా..