India vs Australia: సూపర్ సిక్స్‌తో రోహిత్ శర్మ అరుదైన ఘనత..!

సిడ్నీ: సుదీర్ఘ విరామం తర్వాత జట్టులోకి పునరాగమనం చేసిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. సిడ్నీ టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేయలేదు కానీ ఓ అరుదైన ఘనతను మాత్రం అందుకున్నాడు. భారత ఇన్నింగ్స్ 16వ ఓవర్లో నాథన్ లయన్ వేసిన బంతిని లాంగాన్ మీదుగా భారీ సిక్స్ కొట్టిన రోహిత్.. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాపై 100 సిక్స్‌లు కొట్టిన తొలి క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. ఇక ఆసీస్‌పై అత్యధిక సిక్స్‌లు బాదిన జాబితాలో రోహిత్ శర్మ(100) సిక్స్‌ల తర్వాత ఇయాన్ మోర్గాన్(63), బ్రెండన్ మెక్‌కల్లమ్(61), సచిన్ టెండూల్కర్(60), ఎంఎస్ ధోనీలున్నారు.
రోహిత్ 424
వన్డేల్లోనే ఆసీస్‌పై రోహిత్ 63 సిక్స్‌లు కొట్టాడు. సిడ్నీ టెస్ట్ సిక్స్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో రోహిత్ శర్మ సిక్సర్ల సంఖ్య 424కు చేరింది. ఇప్పటి వరకూ ఏ భారత క్రికెటర్‌కూ ఇది సాధ్యం కాలేదు.. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన వాళ్లలో రోహిత్ కంటే ముందు ఇద్దరు క్రికెటర్లు మాత్రమే ఉన్నారు. అందులో ఒకరు వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ (534 సిక్సర్లు) కాగా.. మరొకరు పాకిస్థాన్ బ్యాట్స్‌మన్ షాహిద్ అఫ్రిది (476 సిక్సర్లు).
ఒక ప్రత్యర్థిపై వంద సిక్స్‌లు కొట్టిన రెండో ప్లేయర్ రోహిత్. ఇంతకుముందు ఇంగ్లండ్‌పై అన్ని ఫార్మాట్లలో కలిపి గేల్ 140 సిక్సర్లు కొట్టాడు. గేల్ 75 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను అందుకుంటే.. రోహిత్ 65 ఇన్నింగ్స్‌లోనే ఈ రికార్డు నమోదు చేశాడు.
ఫ్యాన్స్ ఫిదా..
రోహిత్‌కు ఆస్ట్రేలియాపై మంచి రికార్డు ఉంది. వన్డేల్లో తన తొలి డబుల్ సెంచరీ చేసింది ఆస్ట్రేలియాపైనే. 2013లో బెంగళూరులో జరిగిన వన్డేలో 209 పరుగులు చేశాడు రోహిత్. అందులో ఏకంగా 16 సిక్సర్లు ఉండటం విశేషం. మొత్తంగా ఆస్ట్రేలియాపై 8 సెంచరీలతోపాటు 61 సగటుతో పరుగులు చేశాడు. ఇక రోహిత్ శర్మ 100 సిక్సర్ల ఘనతకు అభిమానులు ఫిదా అయ్యారు. సోషల్ మీడియా వేదికగా ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సిడ్నీ సిక్స్ వీడియోను షేర్ చేస్తూ దటీజ్ రోహిత్ అని క్యాప్షన్‌గా పేర్కొంటున్నారు. దాంతో ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.

భారత్ 96/2
ఇక ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ(26) పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. హెజెల్ వుడ్ బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్(50) హాఫ్ సెంచరీతో రాణించడంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్.. 2 వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసింది. క్రీజులో అజింక్యా రహానే (5 బ్యాటింగ్), చతేశ్వర్ పుజారా(9 నాటౌట్) ఉన్నారు. అంతకుముందు 166/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను కొనసాగించిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 338 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్(131) సెంచరీతో చెలరేగగా.. మార్నస్ లబుషేన్(91) తృటిలో శతకాన్ని చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరి సూపర్ బ్యాటింగ్‌తో ఆసీస్ భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో జడేజా నాలుగు వికెట్లు తీయగా.. నవ్‌దీప్ సైనీ, బుమ్రా రెండేసి వికెట్లు పడగొట్టారు. సిరాజ్‌కు ఒక వికెట్ దక్కింది.
India vs Australia: నోటికి పనిచెప్పిన ఆసీస్ ఆటగాళ్లు.. రోహిత్ శర్మను కవ్వించిన లబుషేన్!(వీడియో)
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications