Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఆ తప్పిదమే నా కెరీర్‌ను ముంచింది: ఊతప్ప

Robin Uthappa believes Changing batting technique at 25 could have been a mistake

న్యూఢిల్లీ: టెస్ట్ క్రికెట్ ఆడాలనే లక్ష్యంతో 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోని తాను చేసిన తప్పే తనన కెరీర్‌ను ముంచిందని భారత సీనియర్ క్రికెటర్ రాబిన్ ఊతప్ప అన్నాడు. ఈ మిస్టెక్ వల్ల తన బ్యాటింగ్‌లో దూకుడు తగ్గిందని, దాంతో తన కెరీర్‌లో సక్సెస్ సాధించలేకపోయానన్నాడు. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న ఊతప్ప.. తాజాగా ఆ జట్టు సోషల్ మీడియా వేదిక నిర్వహించిన ఆన్‌లైన్ సెషన్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా తన కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

నా లక్ష్యం టెస్ట్ క్రికెట్..

నా లక్ష్యం టెస్ట్ క్రికెట్..

‘భారత్ తరఫున టెస్ట్ క్రికెట్ ఆడటమే నా అతిపెద్ద లక్ష్యం. దానికి తగ్గట్టు 20-21 ఏళ్ల వయసులోనే ప్రయత్నాలు మొదలు పెడితే బాగుండేది. కానీ 25 ఏళ్ల వయసులో బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవడంతో అది నాకు ఛేటు చేసింది. నా బ్యాటింగ్‌లో మునపటి దూకుడు తగ్గింది. అయితే నా కెరీర్‌లో ఏ విషయం గురించి పశ్చాత్తాప పడవద్దనుకున్నాను. అత్యత్తుమ ప్రదర్శన కనబర్చాలనుకున్నా. దాంతోనే ప్రవీణ్ అమ్రే పర్యవేక్షణలో నా బ్యాటింగ్ టెక్నిక్ మార్చుకోవాలని నిర్ణయించుకున్నా. తద్వారా సాంకేతికపరంగా మరింత మెరుగైన బ్యాట్స్‌మన్ అవ్వాలనుకున్నా. ముఖ్యంగా గంటలకొద్దీ క్రీజులో ఉండి.. స్థిరంగా రాణించాలనుకున్నా. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది.'అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.

2006లో అరంగేట్రం చేసినా..

2006లో అరంగేట్రం చేసినా..

2006లో భార‌త జ‌ట్టులోకి అరంగేట్రం చేసిన ఊత‌ప్ప‌.. జట్టులో త‌న స్థానాన్ని సుస్థిరం చేసుకోలేక‌పోయాడు. 2007 టీ20 ప్ర‌పంచ‌క‌ప్ గెలిచిన జ‌ట్టులో స‌భ్యుడైన త‌ను త‌ర్వాత కనుమరుగయ్యాడు. 13 ఏళ్ల కెరీర్‌లో ఊత‌ప్ప 46 వ‌న్డేలు, 13 టీ20లు ఆడాడు. చివ‌రిసారిగా 2015లో జింబాబ్వే ప‌ర్య‌ట‌న‌లో ఆడాడు.

 టీ20ల్లో ఫస్ట్ ఫిఫ్టీ ఊతప్పదే..

టీ20ల్లో ఫస్ట్ ఫిఫ్టీ ఊతప్పదే..

అంతర్జాతీయ టీ20ల్లో తొలి హాఫ్ సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్ ఊతప్పనే. 2007 నుంచి 2015 వరకూ భారత్ తరఫున 13 అంతర్జాతీయ టీ20లు ఆడిన అతను ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. అది కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై కావడం విశేషం. పైగా అతను ఆడిన తొలి టీ20లోనే హాఫ్ సెంచరీ సాధించడం మరో విశేషం. 2007 టీ-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో తొలి ఆరు ఓవర్లలో భారత్ నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ నేపథ్యంలో ఊతప్ప(32 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్సర్లతో 50) అర్థ శతకం సాధించి.. జట్టును ఆదుకోవడంతో పాటు అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. షాహిద్ అఫ్రిది బౌలింగ్‌లో సింగిల్ తీసి ఫిప్టీ పూర్తిచేసుకున్న ఊతప్ప.. ఆ మరుసటి బంతికే క్యాచ్‌ ఔట్‌గా వెనుదిరిగాడు.

అలా కార్తీక్‌ను కాదని ముంబై కెప్టెన్సీ నన్ను వరించింది: రోహిత్

Story first published: Wednesday, May 20, 2020, 11:50 [IST]
Other articles published on May 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+