Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఓల్డ్ ఈజ్ గోల్డ్.. 50 ఏళ్ల జాంటీ రోడ్స్ 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదేశాడు!!

Road Safety World Series 2020: 50-year-old Jonty Rhodes Scored 50 From 38 balls While Chasing 144 Runs against West Indies Legends

ముంబై: సౌతాఫ్రికా లెజండరీ క్రికెటర్, అలనాటి సూపర్ ఫీల్డర్ జాంటీ రోడ్స్ 50 ఏళ్ల వయసులో కూడా తన సత్తా ఏమాత్రం తగ్గలేదని నిరూపించాడు. రోడ్డు భద్రతపై అవగాహన పెంచేందుకు నిధుల సేకరణ కోసం మహారాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వరల్డ్ రోడ్ సేఫ్టీ సిరీస్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్ టీమ్‌కు సారథ్యం వహిస్తున్న జాంటీ రోడ్స్ సూపర్ ఫిఫ్టీతో అద్భుత విజయాన్నందించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా లెజెండ్స్ ఈ టోర్నీలో శుభారంభం చేసింది.

సౌతాఫ్రికా లెజెండ్స్ విజయం..

సౌతాఫ్రికా లెజెండ్స్ విజయం..

ఈ లెజండరీ టోర్నీలో భాగంగా బుధవారం బ్రియాన్ లారా నేతృత్వంలో వెస్టిండీస్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ లెజెండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. డారెన్ గంగా(31), రికర్డో పోవెల్(30) టాప్ స్కోరర్లుగా నిలవగా.. కెప్టెన్ బ్రియాన్ లారా(4) తీవ్రంగా నిరాశపరిచాడు.

సఫారీ లెజెండ్స్ బౌలర్లలో పాల్ హర్రిస్ (3/21) మూడు వికెట్లు తీయగా.. అల్బీ మోర్కెల్(2/31) రెండు వికెట్లు పడగొట్టాడు. జొహన్ వాన్ డెర్ వాత్, గార్నెట్ క్రుగర్, ర్యాన్ మెక్‌లారెన్ తలో వికెట్ తీశారు. అనంతరం 144 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా లెజెండ్స్ 18.3 ఓవర్లలో 4 వికెట్లకు 146 పరుగులు చేసి 9 బంతులు మిగిలుండగానే సునాయస విజయాన్నందుకుంది.

పాండ్యా మెరిసేనా? ధావన్ దంచేనా? లేక వర్షార్పణం అయ్యేనా?

జాంటీ రోడ్స్ మెరుపులు..

జాంటీ రోడ్స్ మెరుపులు..

స్వల్ప లక్ష్యంతోనే బరిలోకి దిగిన సఫారీ లెజెండ్స్‌కు ఆదిలోనే గట్టిషాక్ తగిలింది. ఆ జట్టు టాపార్డర్ హెర్సెచెల్ గిబ్స్(1), మోర్నర్ వ్యాన్(10), జాక్వెస్ రుడాల్ఫ్(5), మార్టిన్ వ్యాన్(5) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. దీంతో దక్షిణాఫ్రికా లెజెండ్స్ 42 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితిల్లో క్రీజులోకి వచ్చి జాంటీ రోడ్స్(40 బంతుల్లో 6 ఫోర్లు, సిక్సర్‌తో 53 నాటౌట్), అల్బీ మోర్కెల్( 30 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీలతో చెలరేగి అద్భుత విజయాన్నందించారు.

దాదాపు ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి 104 పరుగులు భాగస్వామ్యంతో జట్టును గట్టెక్కించారు. ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా లెజెండ్స్‌కు ఇది తొలి విజయం కాగా.. వెస్టిండీస్ లెజెండ్స్‌కు వరుసగా రెండో ఓటమి. ఇక శుక్రవారం శ్రీలంక లెజెండ్స్‌తో తలపడనున్న సఫరీ లెజెండ్స్.. శనివారం భారత లెజెండ్స్‌ను ఢీకొట్టనుంది. ఈ సిరీస్‌లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ విజయం సాధించి పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానంలో ఉన్న విషయం తెలసిందే.

జాంటీ రోడ్స్ ఫిఫ్టీ.. ఫ్యాన్స్ ఫిదా

జాంటీ రోడ్స్ ఫిఫ్టీ.. ఫ్యాన్స్ ఫిదా

50 ఏళ్ల వయసులో.. అది టాపార్డర్ అంతా విఫలమైన వేళ.. తీవ్ర ఒత్తిడిలో కేవలం 38 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేయడం ఆశామాషి వ్యవహారం కాదని, అది వరల్డ్ క్లాస్ క్రికెటర్లకే సాధ్యమని అభిమానులు జాంటీ రోడ్స్‌పై ప్రశంసలు జల్లు కురిపిస్తున్నారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఒకరంటే.. టీ20 క్రికెట్ లేట్‌గా పుట్టిందని మరొకరు కామెంట్ చేస్తున్నారు. జాంటీ తన సూపర్ బ్యాటింగ్‌తో జట్టుకు అద్భుత విజయాన్నందించాడని కొనియాడుతున్నారు.

గంగా నదిలో పవిత్ర స్నానం

గంగా నదిలో పవిత్ర స్నానం

జాంటీ రోడ్స్ ఇప్పటికే తన కూతురికి ‘ఇండియా' అని నామకరణం చేసి.. భారత్‌పై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. వారం రోజుల క్రితం హిందులు ఎంతో పవిత్రంగా భావించే గంగా నదిలో స్నానం చేసిన ఈ లెజండరీ క్రికెటర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోను ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ‘‘పవిత్ర గంగా నది చల్లటి నీటిలో స్నానం చేయడం వల్ల మనకు శారీరకంగా, ఆధ్యాత్మికంగా ఉపయోగపడుతుంది'' అంటూ ఆ ఫొటోకు క్యాప్షన్‌గా పేర్కొన్నాడు. అయితే దీనిపై టీం ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కామెంట్ చేశాడు. ‘‘నువ్వు నాకంటే ఎక్కవగా భారత్‌లో పర్యటించావు మిత్రమా'' అని ఆ కామెంట్‌లో పేర్కొన్నాడు.

Story first published: Thursday, March 12, 2020, 12:28 [IST]
Other articles published on Mar 12, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+