
రైనా మైదానంలో..
టీమిండియా వెటరన్ బ్యాట్స్‌మెన్ సురేశ్ రైనాతో కలిసి అతని సొంత మైదానంలో యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇక తమకు సంబంధించిన ప్రాక్టీస్ అప్‌డేట్స్‌ను సురేశ్ రైనా ఎప్పటికప్పుడూ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మీడియా ప్రతినిధి రూపా రమణితో రైనా, పంత్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

బద్దకం పెరిగింది..
మూడు నెలల సుదీర్ఘ విరామంతో బద్దకం పెరిగిపోయిందని, అయితే తిరిగి ప్రాక్టీస్ చేయడం చాలా ఆనందంగా ఉందని పంత్ తెలిపాడు. 'ఇన్ని రోజులు ఇంట్లో ఉండడం వల్ల ప్రాక్టీస్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ రైనాతో కలిసి ప్రాక్టీస్ చేయడం వల్ల వాటిని అధిగమించగలుగుతున్నా. ఆటకు సంబంధించి ఎన్నో టిప్స్ రైనా నేర్పిస్తున్నాడు. మేము ఎన్నో విషయాలపై చర్చించుకుంటున్నాం.
దాంతో నాకు తెలియని విషయాలెన్నో నేర్చుకొగలుగుతున్నా. అంతేకాకుండా త్వరలోనే బీసీసీఐ టీమ్‌ను ఎంపిక చేయనుంది. ఆ జట్టుకు ఎంపికవ్వాలంటే కఠోర సాధన అవసరం. ఈరోజు కాకపోతే రేపైనా శ్రమించాల్సిందే. అందుకే శరీరం ఎంత మొరాయిస్తున్నా ప్రాక్టీస్‌ను కొనసాగిస్తున్నా'అని పంత్ చెప్పుకొచ్చాడు.

ఎప్పుడైనా.. ఎక్కడైనా రెడీ..
ఐపీఎల్ ఎక్కడ జరిగినా ఆడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సురేశ్ రైనా తెలిపాడు. ‘యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను సంప్రదిస్తే అతడు కూడా ప్రాక్టీస్‌కు సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. దీంతో మేమిద్దరం కలిసి ఘాజియాబాద్‌లోని నా సొంత మైదానంలో శిక్షణ మొదలు పెట్టాం. పది రోజులుగా నెట్స్‌లో శ్రమిస్తున్నాం. మమ్మల్ని ఏ క్షణంలో ఆడమన్నా అడేందుకు సిద్ధంగా ఉన్నాం` అని రైనా చెప్పుకొచ్చాడు.

టెంపరితనం తగ్గించుకోవాలి..
పంత్ ప్రశాంతంగా ఉంటే ఓ గొప్ప బ్యాట్స్‌మన్ కాగలడని భారత మాజీ ఆటగాడు కిరిట్ ఆజాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. ప్రధానంగా ప్రతి బంతినీ బౌండరీ దాటించాలనే ఆలోచనను పంత్ మానుకుంటే జట్టుకు మంచి కీపర్ బ్యాట్స్‌మెన్ దొరికినట్లేనని ఆయన అభిప్రాయపడ్డాడు. ‘రిషబ్ పంత్‌లో టాలెంట్‌కు కొదవలేదు. కానీ కాస్త టెంపరితనం తగ్గించుకుంటే బాగుంటుంది. తన ఆలోచనలను సరైన మార్గంలో ఉండేలా చూసుకోవాలి. ప్రతీ బంతిని బౌండరీ బాధలనుకోవడం అతనికి చేటు చేస్తోంది. వన్డే, టెస్టు ఫార్మాట్లను కూడా టీ20 తరహాలో ఆడాలంటే ఎలా సాధ్యం. ఇదే పంత్ మార్చుకోవాల్సి ఉంది. క్రీజులో కుదురుకున్నాక షాట్లు ఆడితే బాగుంటుంది' అని తెలిపాడు.
బౌలింగ్ చేసి బౌండరీ ఆపడమా.. స్టోక్స్ నీ కమిట్‌మెంట్‌కు సలాం!


Click it and Unblock the Notifications












