For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పుణెరిపై ఈజీ విజయం: పట్టికలో మూడో స్థానానికి ఎగబాకిన జైపుర్

PKL 2019: Jaipur Pink Panthers cruise to easy win over Puneri Paltan

హైదరాబాద్: ప్రో కబడ్డీ లీగ్ ఏడో సీజన్‌లో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌ మళ్లీ వరుస విజయాలను నమోదు చేస్తోంది. గత మ్యాచ్‌లో దబంగ్‌ ఢిల్లీ చేతిలో అనూహ్యంగా ఓడిన పింక్‌ పాంథర్స్‌ ఆ షాక్‌ నుంచి త్వరగానే తేరుకుంది. ప్రొ కబడ్డీ లీగ్‌ ఏడో సీజన్‌లో భాగంగా గురువారం జరిగిన మ్యాచ్‌లో జైపూర్‌ 33-25తో పుణేరి పల్టన్‌ను ఓడించింది.

జైపూర్‌ స్టార్‌ రైడర్‌ దీపక్‌ నివాస్‌ హుడా మరో సూపర్‌ 'టెన్‌'తో జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. డిఫెండర్లు నితిన్‌ (4), సందీప్‌ (4) అతడికి సహకరించారు. ఇక, పుణే తరఫున పంకజ్‌ మోహిత్‌ 8 పాయింట్లతో మెరిశాడు. ఆట ఆరంభం దూకుడుగా ఆడిన జైపుర్‌ ఎక్కడా తడబాటుకు గురికాకుండా అద్భుతంగా ఆడింది.

ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదిస్తూ పుణె రైడర్లను కట్టడి చేసింది. దీంతో అటు రైడింగ్‌లోనూ, ఇటు డిఫెండింగ్‌లో తిరుగులేని ప్రదర్శన చేసింది. ఫలితంగా పుణేని ఆలౌట్‌ చేసి 17-11తో తొలి అర్ధ భాగాన్ని ముగించింది. ఇక, రెండో అర్ధ భాగంలోనూ అదే దూకుడును కొనసాగించిన జైపుర్ మరో విజయాన్ని సొంతం చేసుకుంది.

మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 5 విజయాలు సాధించిన జైపుర్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. ప్రో కబడ్డీలో శుక్రవారం మ్యాచులు ఇలా ఉన్నాయి.

యు ముంబ vs పట్నా - రాత్రి 7.30 నుంచి
గుజరాత్‌ vs జైపుర్‌ - రాత్రి 8.30 నుంచి

Story first published: Friday, August 16, 2019, 8:13 [IST]
Other articles published on Aug 16, 2019
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+