Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా స్టార్ క్రికెటర్ పెళ్లి డేట్ ఫిక్స్!

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్, టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్‌ల పెళ్లి తేదీ ఖరారైంది. ఈ జంట డిసెంబర్ 4న లక్నోలోని రమాడా హోటల్‌లో వివాహం చేసుకోనున్నారు. తేదీ, వేదిక ఖరారు కావడంతో ఇరు కుటుంబాలు ఏర్పాట్లు ప్రారంభించాయి. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులు, ప్రత్యేక అతిథులు హాజరవుతారని భావిస్తున్నారు. రింకూ సింగ్ భారత క్రికెట్ జట్టులో సుప్రసిద్ధ ఆటగాడు కాగా.. ప్రియా సరోజ్ ఉత్తరప్రదేశ్‌లోని మచ్ఛలిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా ఉన్నారు.

యూరప్ కంటే భారతే బెటర్: తిరువనంతపురంలో మలేషియా అథ్లెట్ల కఠోర శిక్షణ!

యూరప్ కంటే భారతే బెటర్: తిరువనంతపురంలో మలేషియా అథ్లెట్ల కఠోర శిక్షణ!

15 నెలల క్రితం ఎంగేజ్మెంట్
రింకూ సింగ్, ప్రియా సరోజ్ సుమారు 15 నెలల క్రితం , 2025 జూన్ 8న నిశ్చితార్థం చేసుకున్నారు . వారి నిశ్చితార్థ వేడుక 2025 జూన్ 8న లక్నోలోని ది సెంట్రమ్ హోటల్‌లో జరిగింది. ఈ ప్రైవేట్ వేడుకకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. వారి ఎంగేజ్మెంట్ జరిగినప్పటి నుంచి వారి పెళ్లి గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. తాజాగా డిసెంబర్ 4వ తేదీ పెళ్లి తేదీ ఖరారు కావడంతో వారి బంధంలోని తదుపరి దశ ఖరారైంది.

Rinku Singh Marriage Date Fixed Indian Cricketer to Marry MP Priya Saroj on December 4

రింకూ సింగ్ భారత క్రికెట్‌లో తన విధ్వంసకర బ్యాటింగ్‌కు ప్రసిద్ధి చెందాడు. రింకూ సింగ్ ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. మరోవైపు ప్రియా సరోజ్ 2024 లోక్‌సభ ఎన్నికలలో మచ్ఛలిషహర్ స్థానాన్ని గెలుచుకుని పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఇరు కుటుంబాల వారు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. లక్నోలో జరగనున్న ఈ వివాహానికి క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన కొందరు ప్రముఖ అతిథులు హాజరవుతారని భావిస్తున్నారు.

ప్రియా సరోజ్ ఎవరు?
ప్రియా సరోజ్ ఉత్తర ప్రదేశ్‌లోని మచ్ఛలిషహర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పార్లమెంట్ సభ్యురాలు. 27 ఏళ్ల వయసులో ప్రియా సరోజ్ 2024 లోక్‌సభ ఎన్నికలలో గెలిచి ఆ సమయంలో దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన ఎంపీలలో ఒకరిగా నిలిచారు. ఆమె 25 ఏళ్ల వయసులో ఎంపీగా తన పదవీకాలాన్ని ప్రారంభించారు. ప్రియా సరోజ్ కుటుంబం చాలా కాలంగా రాజకీయాలతో ముడిపడి ఉంది. ఆమె తండ్రి తూఫానీ సరోజ్ ఉత్తర ప్రదేశ్‌లోని కేరకట్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్వయంగా చాలా కాలంగా రాజకీయాల్లో చురుకుగా ఉంటూ మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశారు.

IND vs AFG: తుది జట్టులో బిగ్ ఛేంజ్.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

Also Read

IND vs AFG: తుది జట్టులో బిగ్ ఛేంజ్.. స్టార్ ప్లేయర్ ఎంట్రీ!

రింకూ సింగ్, ప్రియా సరోజ్ 2005 జూన్‌లో నిశ్చితార్థం
రింకూ సింగ్, ప్రియా సరోజ్‌ల సంబంధం గురించిన వార్తలు బయటకు వచ్చిన తర్వాత వారు 2025 జూన్‌లో లక్నోలో ఓ ప్రైవేట్ వేడుకలో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఎంగేజ్మెంట్ తర్వాత వారు ఆ ప్రత్యేక క్షణానికి సంబంధించిన ఫోటోలనుస వారి భావాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాము దాదాపు మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామని వారిద్దరూ చెప్పారు. అప్పటి నుంచి రింకూ సింగ్, ప్రియల పెళ్లి గురించి నిరంతరం చర్చ జరుగుతూనే ఉంది. ఇక రింకూ సింగ్ విషయానికొస్తే అతను జింబాబ్వే పర్యటనకు టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు జట్టులో అతనికి చోటు దక్కలేదు.

Story first published: Tuesday, September 15, 2026, 21:06 [IST]
Other articles published on Sep 15, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+