For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

జనాల మధ్యలోకి దూకి స్మిత్, వార్నర్‌లను తిడుతున్నవారి నోర్లు మూయించాలనిపించేది!!

 Ricky Ponting says, he wanted to jump in the crowd to shut the booing against Steve Smith and David Warner


సిడ్నీ
: బాల్ ట్యాంపరింగ్ వివాదం ఆస్ట్రేలియా క్రికెట్‌ను కుదిపేసింది. ప్రపంచం ముందు దోషులుగా నిలబెట్టింది. అప్పటి వరకు చాంపియన్లమని విర్రవీగుతున్న ఆ జట్టు ఆటగాళ్లను తలెత్తుకోకుండా చేసింది. 2018 సౌతాఫ్రికా పర్యటనలో చోటుచేసుకున్న ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్నే కుదిపేసింది.

ఈ అవమానకర పరిస్థితిని తీసుకొచ్చిన ఆ జట్టు స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా కఠిన చర్యలే తీసుకొంది. యువ ఆటగాడు కామెరున్ బెన్ క్రాప్ట్‌ను టాంపరింగ్ చేసేలా పురికొల్పినందుకు ఈ ఇద్దరిపై ఏడాది పాటు నిషేధం విధించింది. సీనియర్లు సూచనలతో నేరానికి పాల్పడిన బెన్ క్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధిస్తూ చర్యలు తీసుకుంది.

నిషేధం ఎదుర్కున్నా..

నిషేధం ఎదుర్కున్నా..

అనంతరం ఈ ముగ్గురు ప్లేయర్లు తమ నిషేధ కాలాన్ని పూర్తి చేసుకొని అంతర్జాతీయ క్రికెట్‌లో ఘనంగా రీ ఎంట్రీ ఇచ్చారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌తో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ పునరాగమనం చేశారు. తాము క్షమించరాని తప్పు చేశామని, శిక్షను అనుభవిస్తామని యావత్ క్రికెట్ ప్రపంచం ముందు ఈ ఇద్దరు క్రికెటర్లు ఒప్పుకున్నా.. అభిమానులు మాత్రం వారిని చీటర్స్‌గా‌నే పరిగణించారు.

భారత క్రికెట్‌ చరిత్రలోనే మరిచి పోలేని రోజు..!!

ముఖ్యంగా ప్రపంచకప్ సమయంలో పెద్ద ఎత్తున్న చీటర్స్ చీటర్స్, సాండ్ పేపర్స్ అంటూ అరుస్తూ.. వారికి చికాకు కల్పించారు. ఓ మ్యాచ్‌లో స్మిత్‌ను ఎగతాళి చేయడాన్ని టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వారించాడు. వారిని ప్రోత్సహించాలి కానీ తిట్టవద్దని గట్టిగానే అభిమానులకు తన సైగలతో సూచించాడు. ఇక వార్నర్ తన ఆటతోనే అభిమానులకు సమాధానం చెప్పాడు. 648 పరుగులతో రోహిత్ శర్మ తర్వాతి స్థానంలో నిలిచి తన సత్తా ఏంటో తెలియజేశాడు.

సాండ్ పేపర్స్ చూపిస్తూ...

సాండ్ పేపర్స్ చూపిస్తూ...

వరల్డ్‌‌కప్ అనంతరం జరిగిన యాషెస్ సిరీస్‌లోనూ వీరికి ఇదే అనుభవం ఎదురైంది. బ్యాటింగ్‌కు వెళ్లే సమయంలో, ఔటైనప్పుడు, ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు ‘సాండ్‌ పేపర్‌'అంటూ అభిమానులు ఎగతాళి చేశారు. ఈ టోర్నీలో వార్నర్ విఫలమైనా.. స్మిత్ తానెంతటి విలువైన ఆటగాడినో అనే విషయాన్ని క్రికెట్ ప్రపంచానికి తెలియజేశాడు. ఫలితంగా యాషెస్‌ సిరీస్‌ను ఆస్ట్రేలియా కాపాడుకుంది.

తీవ్ర ఆగ్రహం కలిగేది..

తీవ్ర ఆగ్రహం కలిగేది..

అయితే అభిమానుల ఎగతాళి వ్యవహారంపై తాజాగా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్, కోచ్ జస్టిన్ లాంగర్ స్పందించారు. అమెజాన్ ప్రైమ్ రూపొందించిన ‘ది టెస్ట్.. ఆస్ట్రేలియా జట్టు కొత్త శకం'అనే వెబ్ సిరీస్‌లో మాట్లాడుతూ... అభిమానుల తీరును తప్పుబట్టారు. స్మిత్, వార్నర్‌లను అలా ఎగతాళి చేస్తూంటే తీవ్ర ఆగ్రహం కలిగేదని, జనాల మధ్యలోకి దూకి వారి నోర్లు మూయించాలనిపించేదని రికీ పాంటింగ్ తెలిపాడు.‘విభిన్న సమయాల్లో మా ఇద్దరికి జనాల మధ్యలోకి దూకి ఎగతాళి చేస్తున్న వారి నోర్లు మూయించాలనిపించింది.'అని ఆసీస్ మాజీ కెప్టెన్ తెలిపాడు.

అత్యంత హేయమైన చర్య..

అత్యంత హేయమైన చర్య..

ఇక తనకు కూడా తీవ్ర ఆగ్రహం కలిగేదని లాంగర్ తెలిపాడు.‘వార్నర్, స్మిత్‌లను అవహేళన చేయడం చాలా చికాకుగా అనిపించేంది. అది అమర్యాదకం, హేయమైన చర్య కూడా. ప్రారంభంలోనైతే చాలా కోపం వచ్చేది. స్మిత్, వార్నర్‌లను తిట్టిన ప్రతీ ఒక్కరు వారి జీవితంలో ఏదో ఒక తప్పు చేసే ఉంటారు. అది సహజం కూడా. 'అని లాంగర్ చెప్పుకొచ్చాడు. ఇక ప్రేక్షకులు బూతు తిట్టడాన్ని తాను ఆస్వాదించానని స్మిత్ తెలిపాడు. వారలా తిడుతూ.. విఫలమవ్వాలని కోరుకున్నప్పుడు.. తనలో మరింత కసి పెరిగేదన్నాడు.

Story first published: Wednesday, March 18, 2020, 22:36 [IST]
Other articles published on Mar 18, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+