న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

రోహిత్ శర్మతో పోలికే తప్పుకునేలా చేసిందా? విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీ వదిలేయడానికి కారణాలు ఇవేనా?

 Reasons Why Virat Kohli Moved Out From T20 Captaincy And Opted Rohit Sharma
Virat Kohli Right Move ? Reasons | Rohit Sharma తో పోలిక | Captaincy Record || Oneindia Telugu

హైదరాబాద్: విరాట్ కోహ్లీ వన్డే, టీ20 పగ్గాలు వదిలేస్తున్నాడట.. ఇటీవల ఒక రోజంతా జోరుగా ప్రచారం సాగిన వార్త ఇది. కానీ ఆ వదంతుల్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) కొట్టి పారేసింది. కానీ రెండు రోజుల తిరిగేసరికి.. తాను టీ20 పగ్గాలు వదిలేస్తున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురి చేశాడు కోహ్లీ. వచ్చే ప్రపంచకప్‌ తర్వాత తాను సారథ్యాన్ని వదిలేస్తానని అతను స్వయంగా ప్రకటించాడు. పని భారం తగ్గించుకునేందుకే అంటూ కోహ్లీ చెప్పుకున్నా... రోహిత్‌ శర్మ కెప్టెన్సీ గురించి పెరుగుతున్న డిమాండ్లు సహా ఇతర అంశాలు కూడా అతనిపై ప్రభావం చూపించి ఉండవచ్చని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తంగా సారథి హోదాలో తన తొలి టి20 ప్రపంచకప్‌ తర్వాత ఆ బాధ్యతల నుంచే దూరమయ్యేందుకు విరాట్‌ నిర్ణయించుకున్నాడు. ధోని రాజీనామాతో జనవరి 26, 2017న తొలిసారి టి20 మ్యాచ్‌లో భారత్‌కు కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించగా... ఇప్పటి వరకు తన 90 అంతర్జాతీయ మ్యాచ్‌లలో సగం మ్యాచ్‌లు (45) అతను సారథిగా మైదానంలోకి దిగాడు.

 రెండేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన..

రెండేళ్లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన..

మేటి బ్యాట్స్‌మెన్‌గా పేరున్న చాలామంది కెప్టెన్సీ భారాన్ని మోయలేక విడిచిపెట్టిన వాళ్లే. కానీ కోహ్లీ మాత్రంకెప్టెన్సీ తనకే మాత్రం భారం కాదని చాటుతూ బ్యాట్‌తో గొప్పగా రాణించాడు. కానీ గత రెండేళ్లుగా అతని ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదన్నది నిజం. మూడు ఫార్మాట్లలోనూ నిరాశపరుస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్లో గత 53 ఇన్నింగ్స్‌ల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇదే సమయంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో విరాట్‌ కెప్టెన్సీపై విమర్శలు పెరుగుతున్నాయి. విరాట్‌ ఇప్పటిదాకా ఒక్క ఐసీసీ ట్రోఫీగా అందుకోలేకపోయాడు. ఐపీఎల్‌లో ఆర్సీబీని ఒక్కసారి కూడా విజేతగా నిలపకపోవడాన్ని అతని నాయకత్వ లోపంగా చూస్తున్నారు. మరోవైపు రోహిత్‌ నాయకత్వంలో ముంబై అయిదుసార్లు టైటిల్‌ గెలిచింది. దీంతో టీ20లకు రోహిత్‌ను సారథిగా నియమించాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే కోహ్లీ నిర్ణయం తీసుకున్నాడనిపిస్తోంది.

Kohli vs Rohith ఫ్యాన్స్.. మధ్యలోకి కేఎల్ రాహుల్! అంబానీ మ్యాజిక్ వద్దంటూ..!

గౌరవంగా తప్పుకోవాలనే..

గౌరవంగా తప్పుకోవాలనే..

భారత క్రికెట్లో గతంలో ఓటమికి బాధ్యత వహిస్తూ కెప్టెన్సీకి ఆటగాళ్లు రాజీనామా చేసే సంస్కృతి ఉండేది. కానీ 2007 తర్వాత అలాంటి పరిణామాలు ఎప్పుడూ చోటు చేసుకోలేదు. నాయకత్వ బదలాయింపు సాఫీగా సాగిపోతోంది. ధోని చేతుల్లో నుంచి కోహ్లీ అలాగే పగ్గాలు స్వీకరించాడు. కోహ్లీ టీ20 కెప్టెన్‌గా దిగిపోతానని ప్రకటించడం వెనక కూడా ఇదే సానుకూల వైఖరి కనిపిస్తోంది. ఒకవేళ కోహ్లీ ఇప్పుడీ ప్రకటన చేయకుండా, ప్రపంచకప్‌కు వెళ్లి అక్కడ జట్టు టైటిల్‌ గెలవకపోతే.. కెప్టెన్‌గా అతణ్ని తప్పించాలనే డిమాండ్‌ బలపడుతుంది. ఆ స్థితిలో కెప్టెన్సీకి గుడ్‌బై చెబితే అదొక అవమానంలా కనిపించొచ్చు. అది వివాదంగా మారొచ్చు. ఒకవేళ టీమిండియా ప్రపంచకప్‌ గెలిస్తే.. కోహ్లీ సగర్వంగా టీ20 నాయకత్వ బాధ్యతల తప్పుకొన్నట్లవుతుంది. అందుకే కోహ్లీ ఇప్పుడే ఈ నిర్ణయం ప్రకటించినట్లు తెలుస్తోంది.

రోహిత్ కంటే మెరుగ్గానే..

రోహిత్ కంటే మెరుగ్గానే..

ఎంతో మంది రోహిత్‌ అద్భుతం అని చెబుతున్నా... ఈ కాలంలో రోహిత్‌తో పోలిస్తే 5 ఇన్నింగ్స్‌లు తక్కువ ఆడి కూడా అతనికంటే (1,500) కోహ్లీ రెండు పరుగులు ఎక్కువే చేశాడు. అంటే సారథ్యంలోనూ బ్యాట్స్‌మన్‌గా సూపర్‌ సక్సెస్‌! మరి తప్పుకోవడానికి బలమైన కారణం ఏమిటి? పైగా భారత జట్టు నాయకత్వానికి సంబంధించి ఆరు నెలలుగా తమ మధ్య చర్చలు సాగుతున్నాయని జై షా చెప్పడం మాత్రం కాస్త ఆశ్చర్యం కలిగించింది. అంటే ఇదేమీ కోహ్లీ అనూహ్య నిర్ణయం కాదని అనిపిస్తోంది. గణాంకాల లోతుల్లోకి వెళ్లకుండా సగటు అభిమాని కోణంలో చూస్తే టీ20లకు రోహిత్‌ సరైన కెప్టెన్‌ అనే అభిప్రాయం బలంగా పాతుకుపోయింది.

Sheldon Jackson: గంభీర్ వల్లే ఐపీఎల్‌కు.. లేకుంటే పానీపూరి అమ్ముకునేవాడిని!

 అనవసర పోలిక..

అనవసర పోలిక..

ముఖ్యం గా ఐపీఎల్‌ ప్రదర్శన ఇద్దరి మధ్య నాయకత్వ అంతరాన్ని బాగా చూపించింది. రోహిత్‌ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్‌ ఐదుసార్లు విజేతగా నిలిస్తే... 2011 సీజన్‌ నుంచి కెపె్టన్‌గా ఉన్నా కోహ్లీఒక్కసారి కూడా రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టుకు టైటిల్‌ అందించలేకపోయాడు. దాంతో భారత జట్టు టీ20 మ్యాచ్‌లు ఆడిన ప్రతీ సందర్భంలో పోలిక మొదలైంది. కోహ్లీగైర్హాజరులో రోహిత్‌ కెప్టెన్సీలో 19 మ్యాచ్‌లు ఆడిన భారత్‌ 15 గెలిచి, 4 ఓడింది. అతని సారథ్యానికి ప్రశంసలు కూడా దక్కాయి. ఈ నేపథ్యంలో మరింత చర్చలకు అవకాశం ఇవ్వకుండా కెపె్టన్సీ విషయంలో కొంత ఉపశమనం పొందాలని కోహ్లీభావించి ఉంటాడు. అందుకే అన్ని రకాలుగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాడు.

రోహిత్‌కు లైన్ క్లియర్.. కానీ

రోహిత్‌కు లైన్ క్లియర్.. కానీ

కోహ్లీ ప్రకటనతో ఇప్పుడిక టీ20ల్లో అతని వారసుడు ఎవరనే చర్చ జోరుగా సాగుతోంది. ఐపీఎల్‌లో ముంబైని అయిదుసార్లు విజేతగా నిలపడమే పేరు తెచ్చుకోవడమే కాక.. కోహ్లీ అందుబాటులో లేనపుడు భారత జట్టును చక్కగా నడిపించిన రోహిత్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. కానీ కోహ్లీ కంటే రెండేళ్లు పెద్దవాడు, ఇంకో మూణ్నాలుగేళ్లలో రిటైరయ్యే అవకాశమున్న 34 ఏళ్ల రోహిత్‌కు కుర్రాళ్ల ఆటైన టీ20 ఫార్మాట్లో కెప్టెన్సీ అప్పగించడం సరైందేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని రాహుల్‌, శ్రేయస్‌, పంత్‌ లాంటి యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. మరి బీసీసీఐ ఏం చేస్తుందో చూడాలి.

Story first published: Friday, September 17, 2021, 10:31 [IST]
Other articles published on Sep 17, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X