Sheldon Jackson: గంభీర్ వల్లే ఐపీఎల్‌కు.. లేకుంటే పానీపూరి అమ్ముకునేవాడిని!

దుబాయ్: టీమిండియా మాజీ ఓపెనర్, కోల్‌కతా నైటర్ రైడర్స్(కేకేఆర్) మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ కారణంగానే ఇంకా క్రికెట్ ఆడుతున్నానని, లేకుంటే రోడ్డు మీద పానీ పూరి అమ్ముకునేవాడినని కోల్‌కతా నైట్‌రైడర్స్ యువ ప్లేయర్ షెల్డన్ జాక్సన్ అన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో సౌరాష్ట్ర తరఫున ఆడుతున్న షెల్డన్.. ప్రస్తుతం ఐపీఎల్ 2021 సెకండాఫ్ లీగ్ కోసం సిద్దమవుతున్నాడు. ఇప్పటికే జట్టుతో యూఏఈకి చేరిన అతను నెట్స్‌లో చెమటోడుస్తున్నాడు.
తాజాగా కేకేఆర్ మీడియా టీమ్‌తో మాట్లాడుతూ.. తన క్రికెట్ జర్నీకి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఒకానొక సమయంలో క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నానని, అదే జరిగితే ఇప్పుడు రోడ్డుమీద పానీపూరీ అమ్ముకునే వాడినని భావోద్వేగానికి లోనయ్యాడు. తన స్నేహితుడి మాటలు తన జీవితాన్నే మార్చేశాయన్నాడు.

స్నేహితుడి మాటలతో..
'25 ఏళ్ల వయస్సులో క్రికెట్‌ను వదిలేద్దామనుకున్నా. అప్పటికి రంజీ జట్టులో ఉన్న నేను ఐదేళ్లుగా బెంచ్‌కే పరిమితమయ్యాను. ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. అప్పుడు నా స్నేహితుడు మిస్టర్ షపత్ షా ఓ మాట చెప్పాడు. ''ఇన్నేళ్లుగా క్రికెట్ ఆడుతున్నావు. ఎంతో కష్టపడ్డావు. మరొ ఏడాది వేచి చూడు. నీకు మంచి రోజులు వస్తాయి. అలా జరగకపోతే.. నా ఫ్యాక్టరీలో నీకు మంచి ఉద్యోగం ఇస్తాను. అయితే, నువ్వు మాత్రం ఇప్పుడే ఆటను వదిలేయొద్దు'' అని నచ్చజెప్పాడు.

పానీ పూరి అమ్ముకునేవాడిని..
అతని మాటలకు సరేనన్న నేను... ఆ మరుసటి ఏడాది దేశంలో ఉన్న రికార్డులన్నీ బ్రేక్ చేశాను. అత్యధిక పరుగులు సాధించిన క్రికెటర్‌గా నిలిచాను. దేశవాళీ లీగ్‌లు అన్నీ ఆడాను. ఒక్క ఏడాదిలో నాలుగు సెంచరీలు చేశాను. అందులో మూడు వరుస శతకాలు.. అప్పటి నుంచి నా కెరీర్ మలుపు తిరిగింది. ముందు చెప్పినట్లుగా నా ఫ్రెండ్ మాటలు నన్ను ఆలోచింపజేశాయి. ఆ తర్వాత విజయాలు వరించాయి. జీవితంలో ఏదో ఒకటి సాధించగలననే నమ్మకం వచ్చింది. ఒకవేళ నాకు మరో అవకాశం దక్కి ఉండకపోతే బహుషా ఇప్పుడు నేను రోడ్ల మీద పానీపూరీ అమ్ముకునేవాడిని'అని షెల్డన్ చెప్పుకొచ్చాడు.

గంభీర్ ప్రోత్సాహం..
కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతం గంభీర్‌తో తన అనుబంధం గురించి చెబుతూ.. అతని ప్రోత్సాహం మరవలేనిదన్నాడు.'ఢిల్లీతో రంజీ ట్రోఫీ ఆడుతున్న సమయంలో నేను హాఫ్ సెంచరీ సాధించాను. గౌతమ్ భాయ్ దగ్గరకు వెళ్లి నేను బాగా ఆడానా? బ్రో? నా గేమ్ మీకు నచ్చిందా? అని అడిగాను. అవును.. బాగా బ్యాటింగ్ చేశావు. నిన్ను కేకేఆర్ సొంతం చేసుకుంటుంది రెడీగా ఉండు అని చెప్పాడు. అయితే, ఆ సీజన్ ఐపీఎల్ వేలంలో తొలి రౌండ్‌లో నన్ను ఎవరూ కొనలేదు. చాలా నిరాశకు గురయ్యాను. అప్పుడే కేకేఆర్ మేనేజ్‌మెంట్ నుంచి కాల్ వచ్చింది.

మా అమ్మ ముఖంలో..
గౌతమ్ భాయ్ నా గురించి చెప్పారట. అందుకే నన్ను కొంటున్నారని చెప్పారు. ఆర్థికంగా, మానసికంగా నాకు ఊరట కలిగించిన రోజు అది. మా అమ్మ ముఖంలో సంతోషం చూశాను. నాకు అండగా నిలిచి గంభీర్ బ్రో... అప్పుడూ.. ఇప్పుడూ నాకు ఆరాథ్య దైవమే'అని 34 ఏళ్ల షెల్డన్ జాక్సన్ కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 5 వేల పరుగులు చేసిన షెల్డన్.. ఇటీవలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 50 బంతుల్లో 106 పరుగులు చేసి సత్తా చాటాడు. ఇక ఐపీఎల్‌లో భాగంగా 2017లో ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో క్యాష్ రిచ్‌లీగ్‌లో ఎంట్రీ ఇచ్చిన అతను.. టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటి వరకు కేవలం 4 మ్యాచ్‌లు మాత్రమే ఆడిన అతను 38 పరుగులే చేసాడు. మళ్లీ తుది జట్టులో అవకాశాన్ని అందుకోలేకపోయాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications