Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కశ్మీర్‌లో నా కుటుంబ సభ్యులు సేఫ్: భారత ఆర్మీకి ధన్యవాదాలు

RCB assistant coach Mithun Manhas thanks Indian Army for keeping family safe in Kashmir

హైదరాబాద్: రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు అసిస్టెంట్‌ కోచ్‌, టీమిండియా మాజీ క్రికెటర్ మిథున్‌ మిన్హాస్‌ భారత ఆర్మీకి ధన్యవాదాలు తెలిపాడు. జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో భదెర్వాహ్‌లో నివసిస్తున్న తన బామ్మ, తాతయ్యలను వారం రోజులుగా ఆర్మీ అధికారులు చాలా బాగా చూసుకున్నందుకు గాను ఆర్మీకి మిథున్‌ మిన్హాస్‌ ధన్యవాదాలు తెలియజేశాడు.

ఈ మేరకు ట్విట్టర్‌లో ట్వీట్‌ చేశాడు. గత సోమవారం ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుకు ముందు జమ్మూ కశ్మీర్‌లో సమాచార వ్యవస్థల్ని కేంద్రం పూర్తిగా నిలిపివేసింది. దీంతో అక్కడి వారికి బయటవారితో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి.

మైదానంలో డ్యాన్స్ చేసిన ఘటనపై విరాట్ కోహ్లీ వివరణ (వీడియో)

ఈ నేపథ్యంలో మిథున్‌ మిన్హాస్‌ తన ట్విట్టర్‌లో "నా బామ్మ, తాతయ్యలు జమ్మూ కశ్మీర్‌లోని భదెర్వాహ్‌ టౌన్‌లో నివసిస్తున్నారు. వారు కొంచెం వయసు పైబడినవారు. వారి గురించి ఇప్పుడే నాకు సమాచారం అందింది. వారిని ఆర్మీ అధికారులు వారం పాటు చాలా బాగా చూసుకున్నారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందించడంతో పాటు వీలు చిక్కినప్పుడల్లా అధికారులు కలిసి వెళ్లారు. జై జవాన్!!" అంటూ ట్వీట్ చేశాడు.

జమ్మూ కశ్మీర్‌కు చెందిన మిథున్‌ మన్హాస్‌ ఢిల్లీ రంజీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. కొన్ని ఏళ్ల పాటు ఢిల్లీ రంజీ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. 2016లో తన చివరి ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ని ఆడిన మిథున్‌ మిన్హాస్‌ మొత్తం 157 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌ల్లో 45.82 సగటుతో 9,714 పరుగులు చేశాడు.

What a player: వన్డేల్లో విరాట్ కోహ్లీ నుంచి మరో మాస్టర్ క్లాస్

అందులో 27 సెంచరీలతో పాటు 49 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌, పుణె వారియర్స్‌ జట్ల తరఫున ఆడాడు. కాగా, ఈ ఏడాది ఆరంభంలో మిథున్‌ మిన్హాస్‌ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ)కి అసిస్టెంట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు.

Story first published: Monday, August 12, 2019, 15:24 [IST]
Other articles published on Aug 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+