Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

What a player: వన్డేల్లో విరాట్ కోహ్లీ నుంచి మరో మాస్టర్ క్లాస్

Another masterclass in one-day cricket: Sourav Ganguly hails Virat Kohli

హైదరాబాద్: వన్డేల్లో విరాట్ కోహ్లీ నుంచి మరో మాస్టర్ క్లాస్ అంటూ మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఫోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో వన్డేలో విరాట్ కోహ్లీ 125 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 120 పరుగులతో సెంచరీ సాధించాడు. వన్డేల్లో కోహ్లీకి ఇది 42వ సెంచరీ కావడం విశేషం.

దీంతో ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. వన్డేల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ జాబితాలో కోహ్లీ రెండో స్థానానికి దూసుకెళ్లాడు. రెండో వన్డేలో కోహ్లీ సెంచరీ చేయడంతో.. ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న మాజీ కెప్టెన్ గంగూలీ (11,363)ని వెనక్కి నెట్టాడు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ 11,406 పరుగులతో రెండో స్థానానికి ఎగబాకాడు. గంగూలీ 311 మ్యాచ్‌ల్లో సాధించిన పరుగులను కోహ్లీ 238వ వన్డేలోనే అధిగమించడం విశేషం. వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన బ్యాట్స్‌మెన్‌లలో భారత దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ 18,426 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

కోహ్లీపై గంగూలీ ప్రశంసల వర్షం

ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్‌లో కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. గంగూలీ తన ట్విట్టర్‌లో "వన్డే క్రికెట్‌లో విరాట్ కోహ్లీ నుంచి మరో మాస్టర్ క్లాస్. అద్భుతమైన ఆటగాడు" అంటూ ట్వీట్ చేశాడు.

No. 4లో రిషబ్ పంత్: కోహ్లీ వ్యాఖ్యలపై నిప్పులు చెరిగిన సన్నీ

విండిస్ జట్టుపై 8వ సెంచరీ

విండిస్ జట్టుపై 8వ సెంచరీ

కాగా, రెండో వన్డేలో కోహ్లీ సాధించిన సెంచరీ విండిస్ జట్టుపై 8వ సెంచరీ. అంతకముందు ఆస్ట్రేలియా, శ్రీలంకపై కూడా కోహ్లీ ఎనిమిదేసి సెంచరీలు చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో మూడు జట్లపై 8 సెంచరీలు సాధించిన ఆటగాడిగా కోహ్లీ అరుదైన ఘనత సాధించాడు. ఒకే ప్రత్యర్థిపై సచిన్ (9, ఆస్ట్రేలియాపై) తర్వాత ఎక్కువ సెంచరీలు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు.

ఒంటి చేత్తో భువీ సూపర్ క్యాచ్.. మ్యాచ్‌ మలుపు (వీడియో)

ఆరు సెంచరీలు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసినవే

ఆరు సెంచరీలు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసినవే

వెస్టిండిస్ జట్టుపై కోహ్లీ సాధించిన 8 సెంచరీల్లో ఆరు సెంచరీలు కెప్టెన్‌గా ఉన్నప్పుడు చేసినవే కావడం విశేషం. ఒక ప్రత్యర్ధి జట్టుపై అత్యధిక సెంచరీలు సాధించిన కెప్టెన్ల జాబితాలో విరాట్ కోహ్లీ అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో పాటు విండిస్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు (2031) చేసిన బ్యాట్స్‌మన్‌గా 26 ఏళ్ల క్రితం పాకిస్థాన్ క్రికెటర్ జావేద్ మియాందాద్ (1930)నెలకొల్పిన రికార్డును కూడా కోహ్లీ బద్దలు కొట్టాడు.

జావేద్ మియాందాద్ రికార్డు బద్దలు

జావేద్ మియాందాద్ రికార్డు బద్దలు

ఈ మ్యాచ్‌లో 19 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఈ ఘనత సాధించాడు. మియాందాద్ విండీస్‌పై 64 మ్యాచ్‌లాడి అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ కేవలం 34 మ్యాచ్‌ల్లోనే దానిని అధిగమించాడు. ఇక, ఈ జాబితాలో ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ మార్క్‌వా 47 మ్యాచ్‌ల్లో 1708 పరుగులతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.

1
46247
Story first published: Monday, August 12, 2019, 13:30 [IST]
Other articles published on Aug 12, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+