20 ఏళ్ల తర్వాత కూడా కోహ్లీ-రోహిత్ విబేధాలపై స్టోరీలు ఆగవు

హైదరాబాద్: 20 ఏళ్ల తర్వాత కూడా విరాట్ కోహ్లీ-రోహిత్ శర్మల మధ్య విబేధాలపై స్టోరీలు ఆగవని టీమిండియా మాజీ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ తేల్చి చెప్పాడు. ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వన్డే వరల్డ్‌కప్‌లో లీగ్ దశలో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీఫైనల్‌లో పేలవమైన ఆటతీరు కనబరిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది.
దీంతో రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ మధ్యన విభేదాలు తలెత్తాయని వార్తలు వచ్చాయి. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో ధోనీని ఏడో స్థానంలో పంపడంతో సహా మరికొన్ని నిర్ణయాలపై కెప్టెన్‌పై రోహిత్ తీవ్రంగా మనస్థాపం చెందడం... ఇద్దరి మధ్య వివాదానికి కారణమైందని వార్తలు హల్ చల్ చేశాయి.
రోహిత్‌తో విభేదాలపై కోహ్లీ
ఈ విబేధాలపై బీసీసీఐ పాలకుల కమిటీ దర్యాప్తు దర్యాప్తు చేసి కెప్టెన్సీని విభజించేందుకు కూడా సిద్ధమైందనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వెస్టిండిస్ పర్యటనలో భాగంగా అమెరికాలోని ఫ్లోరిడాకు బయల్దేరడానికి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో విరాట్ కోహ్లీ స్పష్టత నిచ్చాడు. రోహిత్ శర్మతో విభేదాలు ఉన్నట్లు వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కోహ్లీ పేర్కొన్నాడు. "డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం కీలకమైంది. మా సక్సెస్‌కు అదే కారణం. ఒకవేళ మీరన్నట్టుగా రోహిత్‌తో విభేదాలు ఉన్నట్లు నిజమే అయితే, అప్పుడు మేం ఇంత గొప్పగా ఆడేవాళ్లం కాదు" అని కోహ్లీ వెల్లడించాడు.

ఒక వ్యక్తి నాకు నచ్చకపోతే
"ఒక వ్యక్తి నాకు నచ్చకపోతే.. దానిని మీరు నా ముఖంలోనో, నా ప్రవర్తనలోనూ చూస్తారు. రోహిత్‌ను నేను ప్రతిసారి మెచ్చుకున్నానని, అతనో గొప్ప ప్లేయర్ అని, మా ఇద్దరి మధ్య ఎటువంటి సమ్యలు లేవని, ఎందుకు ఇలా జరుగుతుందో అర్థంకావడం లేదని, మా ఇద్దరి మధ్య గొడవ సృష్టించడం వల్ల ఎవరు లాభపడుతారో తెలియదు" అని కోహ్లీ అన్నాడు.
India vs West Indies: లారా రికార్డు బద్దలు, చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్

విభేదాలు ముగిశాయని అందరూ
విరాట్ కోహ్లీ వివరణతో ఈ విభేదాలు ముగిశాయని అందరూ భావించారు. అయితే, తాజాగా కోహ్లీ-రోహిత్ శర్మ విభేదాలపై స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన కాలమ్‌లో సునీల్ గవాస్కర్ "విరాట్ కోహ్లీ, రోహిత్ పైకప్పు ఎక్కి మరీ మా మధ్య గొడవలు లేవని చెప్పినా.. కాని ఈ కథ అంతం కాదు. రోహిత్ విఫలమైన ప్రతిసారీ తెలిసి తలలు వంచుకుని కళ్ళుమూసుకునే వారు ఉంటారు, అతను ఉద్దేశపూర్వకంగా బయటపడ్డాడని అంటారు" అని తెలిపాడు.

ఇలాంటి స్టోరీలు ఎవరైతే మొదలు పెడతారో
"ఇలాంటి స్టోరీలు ఎవరైతే మొదలు పెడతారో అవి భారత క్రికెట్‌కు ఎంతమాత్రం మంచివి కావు. చెప్పాలంటే చాలా తరచుగా ఇది జట్టులోని విసుగు చెందిన ఆటగాడు మాత్రమే ఇలాంటి కథలకు రెక్కలు ఇస్తాడు. అతని అసూయ జట్టుకు సైతం హాని కలిగిస్తాయి. కొంతమంది నిర్వాహకులు రాజకీయ ఆట ఆడేందుకు ఇది సరిపోతుంది" అని గవాస్కర్ తన కాలమ్‌లో రాసుకొచ్చాడు.

కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రొపెషనల్ ప్లేయర్లు
"మీడియా స్వర్గం నుండి వచ్చామని భావిస్తోంది. అయితే, క్రికెట్ ప్రారంభమైనప్పుడు దానిని అణచివేయవచ్చు, ఆటలో మిగిలిన రోజులు కథను మరింతగా ఆకర్షించాయి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు ప్రొపెషనల్ ప్లేయర్లు. ఇలాంటి వార్తలను తలవంచుకుని దేశం కోసం మ్యాచ్‌లను గెలిచేందుకు బయల్దేరతారు. అయితే, 20ఏళ్ల తర్వాత కూడా ఈ వార్తలు ఆగవు" అని సునీల్ గవాస్కర్ తెలిపాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications