For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మిస్టర్ 360.. నీ రీఎంట్రీకి ఇది చాలు: రవిశాస్త్రి

Ravi Shastri wants AB de Villiers to step out of international retirement
IPL 2020 : Felt Terrible To Get Duck Out Against CSK - AB de Villiers | Royal Challengers Bangalore

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2020 సీజన్‌లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగుతున్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్‌పై టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసల జల్లు కురిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమం చేసేందుకు ఇది సరిపోతుందని కొనియాడాడు.ఇక కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో సోమవారం జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్(33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్స్‌లతో 73 నాటౌట్‌‌) విరవిహారం చేసిన విషయం తెలిసిందే. అతని అద్భుత బ్యాటింగ్‌తో ఆర్‌సీబీ 82 పరుగులతో కోల్‌కతాను చిత్తుచేసింది.

ఏబీడీ వచ్చేయ్..

ఈ మ్యాచ్‌‌లో ఆర్‌సీబీ గెలుపును ప్రస్తావిస్తూనే రవిశాస్త్రి ట్విటర్ వేదికగా ఏబీడీని ప్రశంసించాడు. ‘అసలు ఈ ఇన్నింగ్స్‌ నమ్మశక్యంగా లేదు. ఉదయం లేచిన తర్వాత కూడా నీ ఇన్నింగ్స్‌ గుర్తుకొస్తోంది ఏబీడీ. ఈ మ్యాచే నీ అంతర్జాతీయ రీఎంట్రీ అవసరం ఉందని తెలుపుతోంది. నువ్వు.. రిటైర్మెంట్‌ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకో. నీ రీఎంట్రీకి ఇది చాలు' అని రవిశాస్త్రి ట్వీట్ చేశాడు.

 అనూహ్య నిర్ణయం..

అనూహ్య నిర్ణయం..

ఇక 2018లో అందరిని షాక్‌కు గురిచేస్తూ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అయితే 2019 వన్డే ప్రపంచకప్ ముందు పునరాగమనం చేసేందుకు ప్రయత్నించినా సౌతాఫ్రికా టీమ్‌మేనేజ్‌మెంట్ అంగీకరించలేదు. దాంతో ఆ జట్టు ఘోరపరాజయాన్ని చవిచూసి లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. దాంతో తప్పును తెలుసుకున్న సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు.. ఏబీడీతో టీ20 ప్రపంచకప్ ఆడించాలని ప్రయత్నించింది. అయితే పూర్తి ఫిట్‌గా ఉంటేనే తాను రీఎంట్రీ ఇస్తానని ఏబీడీ స్పష్టం చేశాడు. ఆ క్రమంలోనే రవిశాస్త్రి.. ఎంట్రీ చేయవచ్చని ట్వీట్ చేశాడు.

పరుగుల విధ్వంసం..

పరుగుల విధ్వంసం..

కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌‌సీబీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 రన్స్‌‌ చేసింది. ఏబీ డివిలియర్స్‌‌ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్‌‌) విధ్వంసానికి తోడుగా ఓపెనర్లు ఆరోన్‌‌ ఫించ్‌‌ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 47), దేవదత్‌‌ పడిక్కల్‌‌ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 32), కెప్టెన్‌‌ విరాట్‌‌ కోహ్లీ (28 బంతుల్లో 1 ఫోర్‌‌తో 33 నాటౌట్‌‌) కూడా రాణించారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌‌లో కోల్‌‌కతా 20 ఓవర్లలో 112/9 స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకుంది. శుభ్‌‌మన్‌‌ గిల్‌‌ (25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌‌తో 34) టాప్‌‌ స్కోరర్‌‌. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రిస్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సైనీ, సిరాజ్, చాహల్, ఉడానా తలో వికెట్ పడగొట్టారు.

బంతిని విసిరిన సిరాజ్‌.. చిన్నపిల్లాడిలా వణికిపోయిన చాహల్.. తనకు సంబంధం లేదన్న సైనీ (వీడియో)

Story first published: Tuesday, October 13, 2020, 18:38 [IST]
Other articles published on Oct 13, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+