బంతిని విసిరిన సిరాజ్.. చిన్నపిల్లాడిలా వణికిపోయిన చాహల్.. తనకు సంబంధం లేదన్న సైనీ (వీడియో)

షార్జా: ఐపీఎల్ పదమూడో సీజన్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పంజా విసురుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా అటు బ్యాటుతో.. ఇటు బంతితో మాయ చేస్తోంది. ఒకరు కాకపోతే మరొకరు అన్నట్టు స్టార్లు చెలరేగిపోతున్నారు. మరోసారి ఆల్‌రౌండ్ పెర్ఫామెన్స్‌తో మెప్పించిన కోహ్లీసేన సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 82 పరుగుల తేడాతో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తుగా ఓడించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో నిలిచింది.
అయితే ఈ మ్యాచ్‌లో ఆర్‌సీబీ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ బంతిని చూసి వణికిపోయాడు. మైదానంలో బంతితోనే మాయ చేసే చాహల్.. అది దగ్గరకు వస్తే మాత్రం చిన్నపిల్లాడిలా వణికిపోతున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో సహచర ఆటగాడు వాషింగ్టన్ సుంధర్ కొట్టిన భారీ సిక్సర్‌కు భయంతో పరుగులు తీసిన చాహల్.. కోల్‌కతా మ్యాచ్‌లో సిరాజ్ విసిరేసిన బంతికైతే చెంగుమన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.
ఏం జరిగిందంటే..
కోల్‌కతా ఇన్నింగ్స్ సందర్భంగా సిరాజ్ వికెట్ తీయడంతో సహచర ఆటగాళ్లంతా అతన్ని అభినందించారు. ఈ క్రమంలో వారి దగ్గరకు వచ్చిన చాహల్ చెంగుమన్నాడు. అయితే సిరాజ్ బంతిని విసిరేయడంతో అది చాహల్‌కు తాకేటట్లు వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో భయపడ్డ చాహల్ వణికిపోయాడు. అయితే పక్కనే ఉన్న నవ్‌దీప్ సైనీ మాత్రం ‘బంతి వేసింది.. నేను కాదు వాడంటూ'వివరణ ఇచ్చుకున్నాడు. ఈ ఘటన ప్రస్తుతం నెటిజన్లను నవ్వులు పూయిస్తుంది. అభిమానులైతే ఫన్నీ కామెంట్స్‌తో చాహల్‌ను ఆడుకుంటున్నారు.

సిక్సర్‌కు చాహల్ పరుగో పరుగు..
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా చాహల్ ఇదే విధంగా భయపడ్డాడు. చెన్నై కట్టుదిట్టమైన బౌలింగ్‌కు ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్ పరుగులు తీయడానికి ఇబ్బంది పడుతున్న సమయంలో వాషింగ్టన్ సుంధర్ భారీ సిక్సర్ కొట్టాడు. కరన్ శర్మ వేసిన ఓవర్‌లో ఔట్ ఆఫ్ స్టంప్ దిశగా వచ్చిన బంతిని లాంగాన్ వైపు భారీ సిక్సర్‌గా తరలించాడు. అయితే ఆ దిశలో డ్రెస్సింగ్ రూమ్ వద్ద కూర్చున్న చాహల్ దగ్గరకు బంతి సమీపించడంతో భయాందోళనకు గురయ్యాడు. ఊహించని పరిణామంతో డ్రెస్సింగ్ రూమ్‌లోకి పరుగుతీశాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట హల్‌చల్ చేసింది.

చెలరేగుతున్న చాహల్..
ఇక ఈ సీజన్‌లో చాహల్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏడు మ్యాచ్‌ల్లో 7.07 ఎకానమీతో 10 వికెట్లు పడగొట్టాడు. ఇందులో రెండు సార్లు మూడేసి వికెట్లు తీసాడు. స్పిన్నర్ల తరఫున పర్పుల్ క్యాప్ రేసులో నిలిచాడు. తన తెలివైన బౌలింగ్ ప్రత్యర్థులను బోల్తా కొట్టిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ధోనీ.. కోల్‌కతాతో దినేశ్ కార్తీక్ చాలా తెలివిగా ఔట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు ఓవర్లు వేసిన చాహల్ కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి కీలక వికెట్ పడగొట్టాడు. ఇందులో 13 డాట్ బాల్స్ ఉండటం విశేషం.

డి‘విలయం'..
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్‌సీబీ 20 ఓవర్లలో 2 వికెట్లకు 194 రన్స్ చేసింది. ఏబీ డివిలియర్స్ (33 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 73 నాటౌట్) విధ్వంసానికి తోడుగా ఓపెనర్లు ఆరోన్ ఫించ్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 47), దేవదత్ పడిక్కల్ (23 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్‌తో 32), కెప్టెన్ విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 1 ఫోర్‌తో 33 నాటౌట్) కూడా రాణించారు. కోల్‌కతా బౌలర్లలో ప్రసిధ్ కృష్ణ, ఆండ్రూ రస్సెల్ చెరొక వికెట్ తీశారు. అనంతరం ఛేజింగ్‌లో కోల్‌కతా 20 ఓవర్లలో 112/9 స్కోరుకే పరిమితమై ఘోర ఓటమి మూటగట్టుకుంది. శుభ్‌మన్ గిల్ (25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 34) టాప్ స్కోరర్. బెంగళూరు బౌలర్లలో క్రిస్ మోర్రిస్, వాషింగ్టన్ సుందర్ రెండేసి వికెట్లు తీయగా.. సైనీ, సిరాజ్, చాహల్, ఉడానా తలో వికెట్ పడగొట్టారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications