ఆరేంజ్ జోన్‌లో ఉన్నా.. హాయిగా బీర్ తాగుతా: రవిశాస్త్రి

న్యూఢిల్లీ: టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆల్కాహాల్ మీద ఉన్న ప్రేమను ఇప్పటికే చాలా సందర్భాల్లోవ్యక్తపరిచాడు. అభిమానుల ట్రోలింగ్‌కు కూడా గురయ్యాడు. అయితే తాజాగా దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌లో కొన్ని సండలింపులు ఇస్తూ కరోనా ప్రభావం అంతగా లేని ప్రాంతాల్లో కేంద్రప్రభుత్వం వైన్‌షాప్స్‌కు అనుమతించిన విషయం తెలిసిందే. ఆరేంజ్ జోన్, గ్రీన్‌జోన్‌లో మద్యం అమ్మకాలు మంగళవారమే మొదలయ్యాయి. 45 రోజులు నిరీక్షించిన మందుబాబులు.. వైన్ షాప్‌లు తెరవడంతో ఎగబడుతున్నారు.

బీర్‌తో చిల్ అవుతా..
రవిశాస్త్రి ప్రస్తుతం అలీబౌగ్‌లో ఉండగా.. అది ఆరేంజ్ జోన్‌లో ఉంది. దీంతో తాను వైన్ షాప్‌కు వెళ్లి బీర్ తెచ్చుకుంటానని ఈ మాజీ క్రికెటర్ కమ్ కోచ్ తెలిపాడు. ఇండియాటుడే చానెల్‌తో మాట్లాడుతూ.. ఈ క్వారంటైన్ సమయంలో ఓ ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం ఉంటే ఎవరిని ఎంచుకుంటావని ప్రశ్నించగా.. మాజీ క్రికెటర్లు రోజర్ బిన్ని, లక్ష్మణ్ శివరామకృష్ణలను ఎంచుకుంటానని శాస్త్రి సమధానమిచ్చాడు.
‘లాక్‌డౌన్‌లో నేను ఉన్న ప్రాంతం అలీబౌగ్ తొలుత రెడ్ జోన్‌లో ఉండేది.. ఇప్పుడు ఆరెంజ్ జోన్ అయింది. షాపులు తెరవగానే బీర్ తెచ్చుకుంటాను. ఇద్దరితో కలిసి బీర్ తాగే అవకాశం నాకే ఉంటే.. రోజర్, శివతో కలిసి తాగుతాను'అని శాస్త్రి చెప్పుకొచ్చాడు.

ఆ ఆడి కారు కోసం తెగ ట్రై చేశాడు.
ఆస్ట్రేలియా వేదికగా 1985లో జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో మ్యాన్‌ఆఫ్ ది సిరీస్‌గా ఉన్న ఆడి కారు కోసం పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మియాందాద్ తీవ్రంగా ప్రయత్నించాడని రవిశాస్త్రి గుర్తు చేసుకున్నాడు. ‘పాకిస్థాన్‌ను ఆ మ్యాచ్‌లో ఓడించడం నాకు మరిచిపోలేని జ్ఞాపకం. నిజాయితీగా చెప్పాలంటే ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచేందుకు మియాందాద్ చాలా ప్రయత్నించాడు. కానీ.. అతనికి ఆడీ కారు గెలుచుకునే అవకాశం దక్కలేదు. సిరీస్‌లో అతని ప్రదర్శన ఒకానొక దశలో రోమాలు నిక్కబొడుచుకునేలా కనిపించింది'అని శాస్త్రి తెలిపాడు.

శాస్త్రి హాఫ్ సెంచరీ.. భారత్ విక్టరీ
భారత్-పాక్ మధ్య జరిగిన ఆ టోర్నీ ఫైనల్ చాలా హోరాహోరిగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 176 పరుగులు చేసింది.
మియాందాద్ ( 92 బంతుల్లో 2 ఫోర్లు 48), ఇమ్రాన్ ఖాన్ (35) టాప్‌స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన భారత్ జట్టు 47.1 ఓవర్లలో రెండు వికెట్లకు 177 పరుగుల చేసి 8 వికెట్లతో గెలుపొందింది. ఓపెనర్ రవిశాస్త్రి (148 బంతుల్లో 3 ఫోర్లు 63 నాటౌట్) అజేయ అర్ధశతకం సాధించగా.. మరో ఓపెనర్ శ్రీకాంత్ ( 22 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 67) హాఫ్ సెంచరీ చేశాడు. ఇక టోర్నీ అద్యాంతం అదరగొట్టిన రవిశాస్త్రి.. మియాందాద్‌ను వెనక్కు నెట్టి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ ఆడికారు సొంతం చేసుకున్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
ధోనీ, కోహ్లీ, రోహిత్ కెప్టెన్సీలో ఉన్న తేడా ఇదే: ఎమ్మెస్కే