న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఇమ్రాన్, షకీబ్ సరసన: కెప్టెన్‌గా రషీద్ ఖాన్ అరుదైన రికార్డు

Rashid Khan joins Imran Khan and Shakib Al Hasan after rare double feat vs Bangladesh

హైదరాబాద్: ఆప్ఘనిస్థాన్ టెస్టు కెప్టెన్ రషీద్ ఖాన్ దిగ్గజాల సరసన చేరాడు. ప్రస్తుతం చట్టొగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న ఏకైక టెస్టులో రషీద్‌ ఖాన్‌ ఐదు వికెట్లు తీయడం ద్వారా అరుదైన ఘనత సాధించాడు. తన అరంగేట్ర కెప్టెన్సీ టెస్టులో ఐదు వికెట్లు తీయడంతో పాటు 50కిపైగా పరుగులు చేసిన నాలుగో ఆటగాడిగా నిలిచాడు.

నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)నోరు పారేసుకున్న ఇంగ్లాండ్ అభిమాని: డేవిడ్ వార్నర్‌ ఏం చేశాడో తెలుసా! (వీడియో)

నాలుగో క్రికెటర్‌గా రషీద్ ఖాన్

నాలుగో క్రికెటర్‌గా రషీద్ ఖాన్

ఇప్పటివరకూ టెస్టుల్లో తమ అరంగేట్ర కెప్టెన్సీ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ షెల్డాన్‌ జాక్సన్‌(1905), పాక్ మాజీ కెప్టెన్‌ ఇమ్రాన్‌ ఖాన్(1982), బంగ్లాదేశ్‌ ఆల్‌ రౌండర్‌ షకీబ్ ఉల్‌ హసన్‌(2009) మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా ఈ జాబితాలో రషీద్ ఖాన్ కూడా చేరాడు. టెస్టు క్రికెట్‌లో రషీద్‌ ఖాన్ ఐదేసి వికెట్లు తీయడం ఇది రెండోసారి.

యుఎస్ ఓపెన్‌లో సెరెనా vs బియాంక: ఎవరు గెలిచినా చరిత్రే!, మ్యాచ్ ఎప్పుడంటే!

ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో

ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో

ఈ ఏడాది ఆరంభంలో ఐర్లాండ్‌తో జరిగిన టెస్టులో రషీద్‌ ఐదు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ మ్యాచ్‌లో రషీద్ ఖాన్ ఐదు వికెట్లతో చెలరేగడంతో బంగ్లాదేశ్ తన తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసి ఆలౌటైంది. 194/8 ఓవర్‌నైట్‌ స్కోరుతో మూడో రోజు ఆటను ఆరంభించిన బంగ్లాదేశ్‌ మరో 11 పరుగులు జోడించి మిగతా రెండు వికెట్లు కోల్పోయింది.

రషీద్ ఖాన్ హాఫ్ సెంచరీ

రషీద్ ఖాన్ హాఫ్ సెంచరీ

ఆప్ఘన్ తొలి ఇన్నింగ్స్‌లో రషీద్‌(51) హాఫ్‌ సెంచరీ సాధించాడు. మూడో రోజైన శనివారం ఆప్ఘనిస్థాన్ రెండో ఇన్నింగ్స్‌లో టీ విరామ సమయానికి 60 ఓవర్లకు గాను 4 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో ఇబ్రహీం జర్దాన్(82), అప్షర్ జరాయ్(4) పరుగులతో ఉన్నారు. ప్రస్తుతానికి ఆప్ఘనిస్థాన్ 293 పరుగుల ఆధిక్యంలో ఉంది.

చంద్రయాన్-2: ఇస్రోకు సెహ్వాగ్ మద్దతు, దేశం గర్విస్తోందన్న ఫోగట్

342 పరుగులు చేసి ఆప్ఘన్ ఆలౌట్

342 పరుగులు చేసి ఆప్ఘన్ ఆలౌట్

అంతకముందు ఆప్ఘనిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 342 పరుగులు చేసి ఆలౌటైంది. ఆప్ఘన్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన రహ్మత్‌ షా... రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఆప్ఘనిస్థాన్‌కు ఇది మూడో టెస్టు మాత్రమే. టెస్టు హోదా పొందిన తర్వాత గతేడాది బెంగళూరు వేదికగా టీమిండియాతో ఆడిన తొలి టెస్టులో ఓడగా... ఐర్లాండ్‌తో జరిగిన రెండో టెస్టులో విజయం సాధించింది

Story first published: Saturday, September 7, 2019, 15:25 [IST]
Other articles published on Sep 7, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X