యుఎస్ ఓపెన్‌లో సెరెనా vs బియాంక: ఎవరు గెలిచినా చరిత్రే!, మ్యాచ్ ఎప్పుడంటే!

హైదరాబాద్: యుఎస్ ఓపెన్ 2019 తుది అంకానికి చేరుకుంది. మహిళల సింగిల్స్ ఫైనల్స్‌లో 37 ఏళ్ల సెరెనా విలియమ్స్ (అమెరికా) కెనడాకు చెందిన టీనేజ్ సంచలనం బియాంక అండ్రెస్కుతో తలపడనుంది. సరిగ్గా 20 ఏళ్ల క్రితం సెరెనా విలియమ్స్ తొలిసారి యూఎస్ ఓపెన్ (1999) టైటిల్ ముద్దాడింది.
అప్పటికి ఇంకా బియాంక అండ్రెస్కు(19 ఏళ్లు) పుట్టనేలేదు. అలాంటిది ఇప్పుడు తన అద్భుతమైన ఆటతీరుతో యుఎస్ ఫైనల్లో తన రోల్‌మోడల్ సెరెనాతో తలపడేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో టెన్నిస్ ఆల్‌టైమ్ గ్రేట్ మార్గరెట్ కోర్ట్ సాధించిన అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ల (24) రికార్డును సమం చేసేందుకు సెరెనా విలియమ్స్ అడుగు దూరంలో నిలిచింది.

సెమీస్‌లో తన అద్భుత ఆటతో
సెమీస్‌లో తన అద్భుత ఆటతో యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పైనల్‌కు చేరి తొలి కెనడా క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. అంతేకాదు మొత్తంగా ఓ కెనడా మహిళా ప్లేయర్ రెండోసారి ఫైనల్‌కు చేరిన రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్ ఇది. అంతకుముందు యుజిని బౌచార్డ్ (వింబుల్డన్-2014) మాత్రమే గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడింది.

రెండో టీనేజర్‌గా అండ్రెస్కు అరుదైన ఘనత
దీంతో పాటు ఈ ఏడాది గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో టీనేజర్‌గా అండ్రెస్కు అరుదైన ఘనత సాధించింది. ఈ నేపథ్యంలో యుఎస్ ఓపెన్‌లో సెరెనాపై గెలిచి అండ్రెస్కు చిరస్థాయిలో నిలిచిపోవాలని భావిస్తోంది. మరోవైపు తన అనుభవమంత వయసులేని అండ్రెస్కును సెరెనా చిత్తుచేస్తుందా? లేదా చూడాలి మరి.

ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు
ఫైనల్ చేరడంపై బియాంక మాట్లాడుతూ "ఏం మాట్లాడాలో అర్థం కావడం లేదు. గ్రాండ్‌స్లామ్ ఫైనల్లో సెరెనాతో ఆడనుండటంతో నా కల నెరవేరినట్లు అనిపిస్తోంది. నేను పడ్డ శ్రమకు ఫలితం దక్కిందనుకుంటున్నా. ఏడాది క్రితం ఎవరైనా నేను యుఎస్ ఓపెన్ ఫైనల్ ఆడుతానని అంటే వారికి పిచ్చి పట్టిందేమో అనుకునేదాన్ని. కానీ, నా కల నిజమైంది" అని పేర్కొంది.

యుఎస్ ఓపెన్ మహిళల ఫైనల్ మ్యాచ్ వివరాలు:
మ్యాచ్ సమయం: అర్ధరాత్రి 1.30 నుంచి స్టార్‌స్పోర్ట్స్‌లో
వేదిక: ఆర్ధర్ ఆష్లే స్టేడియం
ర్యాంకింగ్స్:
సెరెనా విలియమ్స్ - 8th, బియాంక ఆండ్రెస్కు - 15th
ఛానల్: స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ and Hotstar.com
$90,643,816: Career prize money for Serena Williams.
$2,417,873: Career earnings for Bianca Andreescu.
$3.85 million: Prize money for Saturday's winner.
$1.9 million: Prize money for the runner-up.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications