Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

పాకిస్థాన్‌లో మరో కోహ్లీ : మాజీ క్రికెటర్

Ramiz Raja Names Pakistan Batsman Who Has ‘Similar Talent’ As Virat Kohli, Babar Azam

కరాచీ: ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లీ, కేన్ విలియమ్సన్, రోహిత్ శర్మ, బాబర్ ఆజమ్, డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. ఇక పాకిస్థాన్ ప్లేయర్ బాబర్ ఆజమ్ కూడా కోహ్లీ తరహాలోనే నిలకడగా రాణిస్తుండటంతో అతన్ని పాకిస్థాన్ కోహ్లీగా పిలుస్తుంటారు.

బాబరే కాదు..

బాబరే కాదు..

అయితే ఈ ఇద్దరి స్టార్ క్రికెటర్లను పోలీ ఉన్న మరో ఆటగాడు పాకిస్థాన్‌లో ఉన్నాడని ఆ జట్టు మాజీ క్రికెటర్, కామెంటేటర్ రమీజ్ రాజా తెలిపాడు. కోహ్లీ, బాబర్‌కు ఉన్న సామర్థ్యమే అతనికి ఉందని చెప్పుకొచ్చాడు. అతనెవరో కాదని పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్‌లో పెష్వార్ జల్మీ జట్టుకు ప్రాతనిధ్యం వహించిన హైదర్ అలీ అని తెలిపాడు.

యువీ రక్తపు వాంతుల సెంచరీ గుర్తుందా?

వారిని అనుసరిస్తే..

వారిని అనుసరిస్తే..

అజామ్, కోహ్లీని అనుసరిస్తే అతను కూడా వారిలా గొప్ప బ్యాట్స్‌మన్ అవుతాడని ఈ కామెంటేటర్ జోస్యం చెప్పాడు. ఓ యూట్యూబ్ వీడియోలో మాట్లాడుతూ.. ఈ పాక్ యువప్లేయర్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు.‘హైదర్ అద్భుత నైపుణ్యం ఉన్న ఆటగాడు. తొలి సీజన్‌లోనే తన పేరు మారుమోగేలా ఆడాడు. కాకపోతే అతను తన పెర్ఫామెన్స్‌లో స్థిరత్వం తీసుకురావాలి. బ్యాటింగ్ ఆర్డర్‌ కూడా మూడో స్థానమే. షాట్లు కొట్టే విషయంలో మంచి నైపుణ్యం కలిగి ఉన్నాడు. కాబట్టి విధ్వంసకరంగా ఆడే విషయంలో మెరుగుపరుచుకోవాల్సింది ఏం లేదు.

కోహ్లీ, బాబర్‌ల విధానాన్ని హైదర్ అనుసరించాలి. మంచి ప్రతిభ కలిగిన ఈ ఇద్దరూ ఎప్పుడూ సంప్రదాయ షాట్లపైనే ఆధారపడతారు. హైదర్‌కు కూడా బాబర్,కోహ్లీ మాదిరే నైపుణ్యం ఉంది. కాకపోతే అతను తన ఆటపై ఓ అవగాహనకు వచ్చి భారీ ఇన్నింగ్స్‌లు ఆడాల్సిన అవసరం ఉంది.'అని రమీజ్ రాజా తెలిపాడు.

అందరికీ నెగటీవ్..

అందరికీ నెగటీవ్..

ఇక పీఎస్‌ఎల్‌‌లో 9 మ్యాచ్‌లు ఆడిన హైదర్ అలీ 239 పరుగులు చేశాడు. కరోనా వైరస్ నేపథ్యంలో ఈ లీగ్ తుది దశలో అర్ధాంతరంగా రద్దయిన విషయం తెలిసిందే. ఈ లీగ్ ఆడిన ఇంగ్లండ్ క్రికెటర్ అలెక్స్ హేల్స్ కరోనా లక్షణాలతో బాధపడటంతో.. ఈ టోర్నీలో భాగమైన 128 మందికి పాకిస్థాన్ బోర్డు కరోనా టెస్ట్‌లు నిర్వహించింది. అందరికి నెగటీవ్ వచ్చిందని కూడా ప్రకటించింది.

Story first published: Friday, March 20, 2020, 15:07 [IST]
Other articles published on Mar 20, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+