Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

భారత్-పాక్ ఆల్‌టైమ్ వన్డే టీమ్.. రోహిత్, అఫ్రిదిలకు నో ఛాన్స్!

Rameez Raja picks all-time best India-Pakistan ODI XI

కరాచీ: పాకిస్థాన్ మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ రమీజ్ రాజా భారత్-పాక్ ఆల్‌టైమ్ వన్డే ఎలెవన్ జట్టును ప్రకటించాడు. సోనీ టెన్ పిట్ స్టాప్ షో‌లో భాగంగా శనివారం భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో ఫేస్‌బుక్ లైవ్ సెషన్‌లో చిట్ చాట్ చేసాడు. ఈ సందర్భంగా భారత్-పాక్ ఆల్ టైమ్ టీమ్ ఎంపికకు తన కుమారుడి సాయం తీసుకున్నట్లు ఈ పాక్ మాజీ క్రికెటర్ తెలిపాడు.

భారత్ బ్యాట్స్‌మన్.. పాక్ బౌలర్లు

భారత్ బ్యాట్స్‌మన్.. పాక్ బౌలర్లు

‘భారత్-పాక్ ఆల్‌టైమ్ ఎలెవన్ కోసం నా కొడుకుతో సుదీర్ఘంగా చర్చించా. అద్భుత ఆటగాళ్లలో నుంచి 11 మందిని ఎంపిక చేయడం చాలా కష్టంగా అనిపించింది. నా కుమారుడు మాత్రం చాలా సింపుల్‌గా పాకిస్థాన్ నుంచి బౌలర్లను, ఇండియా నుంచి బ్యాట్స్‌మన్ జట్టులోకి తీసుకుంటే అద్భుత జట్టు తయారవుతుందని తెలిపాడు.'అని రమీజ్ రాజా గవాస్కర్‌తో అన్నాడు. ఆ కారణంగా నా ఆల్‌టైమ్ జట్టులో భారత ఆటగాళ్లు ఎక్కువగా ఉన్నారన్నాడు.

ఏడుగురు భారత ఆటగాళ్లే..

ఏడుగురు భారత ఆటగాళ్లే..

ఇక రమీజ్ రాజా ఎంపిక చేసిన 11 మంది ఆటగాళ్లలో ఏడుగురిని భారత్ నుంచి ఎంపిక చేయడం గమనార్హం. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్‌లను ఓపెనర్లుగా తీసుకున్న రమీజ్.. ఫస్ట్ డౌన్‌లో విరాట్ కోహ్లీ, సెకండౌన్‌లో ఆశ్చర్యకరంగా సచిన్ టెండూల్కర్‌ను ఎంపిక చేశాడు. సచిన్ తన కెరీర్‌లో ఈ నాలుగో స్థానంలో నిలకడగా రాణించలేదు. ఇక మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌గా ఐదు, ఆరు స్థానాల్లో టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్, వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మన్ ఎంఎస్ ధోనీలను తీసుకున్నాడు.

కెప్టెన్‌గా ఇమ్రాన్ ఖాన్

కెప్టెన్‌గా ఇమ్రాన్ ఖాన్

ఈ జట్టుకు పాకిస్థాన్ మాజీ కెప్టెన్, ప్రస్తుత ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను సారథిగా ఎంచుకున్నాడు. అలాగే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనీస్‌లను పేసర్లుగా.. అనిల్ కుంబ్లే, సక్లయిన్ ముస్తాక్‌లకు స్పిన్నర్లుగా తుది జట్టులో అవకాశం కల్పించాడు.

రమీజ్ రాజా ఆల్‌టైమ్ ఎలెవన్: వీరేంద్ర సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, విరాట్ కోహ్లీ, సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్, ఎంఎస్ ధోనీ, ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, వకార్ యూనీస్, అనిల్ కుంబ్లే, సక్లయిన్ ముస్తాక్

రోహిత్, అఫ్రిదికి నో చాన్స్..

రోహిత్, అఫ్రిదికి నో చాన్స్..

అయితే వన్డే క్రికెట్ చరిత్రలోనే మూడు డబుల్ సెంచరీలతో చెలరేగిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ‌కు ఈ జట్టులో చోటుదక్కకపోవడం విస్మయానికి గురిచేస్తుంది. అలాగే పాకిస్థాన్ తరఫున పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఆల్‌రౌండర్‌గా ఆకట్టుకున్న షాహిద్ అఫ్రిదికి కూడా అవకాశం దక్కలేదు. అలాగే భారత బౌలర్లలో అనిల్ కుంబ్లే ఒక్కరినే తీసుకోవడం కూడా ఈ ఆల్‌టైమ్ టీమ్‌ ఎంపికపై చర్చకు దారి తీసింది.

కోహ్లీ పద్దతి మార్చుకో.. అతనేం వాటర్ బాయ్ కాదు: కైఫ్

Story first published: Sunday, May 17, 2020, 15:51 [IST]
Other articles published on May 17, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+