Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్తర్ ప్రతిపాదన వింటే నవ్వొస్తుంది: ఐపీఎల్ చైర్మన్

Rajeev Shukla Says Shoaib Akhtar statement is comical Over India-Pakistan series proposal

ముంబై: కరోనా విరాళాల కోసం భారత్-పాకిస్థాన్ మధ్య మూడు వన్డేల సిరీస్‌ నిర్వహించాలని షోయబ్ అక్తర్ చేసిన ప్రతిపాదన హస్యాస్పదంగా ఉందని ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా తెలిపాడు. అక్తర్ సరదా మనిషని అతని మాటలు పెద్దగా పట్టించుకోనవసరం లేదని ఏఎన్‌ఐ వార్త సంస్థతో మాట్లాడుతూ వ్యాఖ్యానించాడు.

ఐపీఎల్ నిర్వహించడమే..

ఐపీఎల్ నిర్వహించడమే..

‘షోయబ్ అక్తర్ ఓ సరదా వ్యక్తి అని అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు అతను ఈ తరహా సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటాడు. ఫండ్ రైజింగ్ కోసం భారత్-పాక్ మధ్య క్రికెట్ మ్యాచ్ నిర్వహించాలంటున్నాడు. అసలు మేం ఐపీఎల్ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంటే.. ఆ మ్యాచ్‌లకు ఎవరు వస్తారు. ఆటగాళ్లను ఎవరు అనుమతిస్తారు. నాకు తెలిసి అతను సరదా కోసం అలా మాట్లాడి ఉంటాడు.'అని శుక్లా చెప్పుకొచ్చాడు.

పాకిస్థాన్‌లో మరి దారుణం..

పాకిస్థాన్‌లో మరి దారుణం..

‘భారత్-పాక్ ద్వైపాక్షిక సిరీస్‌లే ఆడటం లేదు. అలాంటిది ఈ ఫండ్ రైజింగ్ సిరీస్‌ను ఎవరు నిర్వహిస్తారు. భారత్‌లో పరిస్థితి బాలేదు.. పాకిస్థాన్‌లో ఇంకా అద్వాన్నంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ టోర్నీ ఎలా సాధ్యమవుతుంది. కాబట్టి ఈ వ్యాఖ్యలు సరదాగా చేసినవని నేను భావిస్తున్నా.'అని శుక్లా తెలిపాడు.

మాకంత అవసరం లేదు..

మాకంత అవసరం లేదు..

ఇక అక్తర్ ప్రతిపాదనను భారత వరల్డ్‌కప్ విన్నింగ్ కెప్టెన్, మాజీ ఆల్‌రౌండర్‌ కపిల్‌ దేవ్‌ కూడా తప్పుబట్టాడు. ఏబీపీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెటర్లతో రిస్క్‌ చేయాల్సిన అవసరం లేదంటూ చురకలంటించాడు.

‘భారత్‌-పాక్‌ల మధ్య సిరీస్‌ జరగాలని కోరడం అక్తర్ అభిప్రాయం. కానీ ఈ సిరీస్‌ల ద్వారా వచ్చే డబ్బులు భారత్‌కు అవసరం లేదు. మా దగ్గర సరిపడా డబ్బు ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో సంక్షోభం నుంచి గట్టెక్కడమే ముఖ్యం. ఇప్పటికే కరోనా కట్టడికి బీసీసీఐ రూ. 51 కోట్ల విరాళం ఇచ్చింది. ఇంకా అవసరమైతే కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో భారత్‌ క్రికెటర్లు నిధులు కోసం మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదు. క్రికెటర్లతో రిస్క్‌ చేయాల్సిన అవసరం అంత కన్నా లేదు'అని తెలిపాడు.

రోహిత్‌కు యూవీ క్విజ్.. తన హైట్ ఎంతో కూడా చెప్పలేకపోయిన హిట్‌మ్యాన్.!!

ఫండ్స్ కోసం భారత్-పాక్ మ్యాచ్..

ఫండ్స్ కోసం భారత్-పాక్ మ్యాచ్..

కరోనా ఫండ్స్ రైజింగ్ కోసం దుబాయ్ వంటి తటస్థ వేదికగా భారత్-పాకిస్థాన్ ద్వైపాక్షిక వన్డే సిరీస్ నిర్వహించాలని అక్తర్ ప్రతిపాదించాడు. బుధవారం ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. ఈ సిరీస్ వల్ల ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడటంతో పాటు ఆర్థిక సాయం లభిస్తుందని అభిప్రాయడ్డాడు.

‘ఈ సంక్షోభ పరిస్థితుల్లో భారత్-పాక్ మధ్య మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నా. ఈ మ్యాచ్‌ల ఫలితాలపై ఇరుదేశాల ప్రజలు కలత చెందరు. కరోనా కారణంగా జరుగుతున్న మ్యాచ్‌లనుకొని.. ఇరు దేశాల అభిమానులు ఆటను ఆస్వాదిస్తారు. కోహ్లీ సెంచరీ చేసినా పాక్ ప్రజలు.. బాబర్ శతకం బాదినా భారతీయులు సంతోషిస్తారు. మైదానంలో ఏం జరిగినా ఇరు జట్లు విజేతలుగా నిలుస్తాయి.' అని చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, April 9, 2020, 19:59 [IST]
Other articles published on Apr 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+