
స్మిత్ సారథ్యంలో..
జట్టు సమతూకంగా ఉన్నా.. ముందుండి నడిపించేవారున్నా... గొప్ప ఆరంభం తప్ప.. ఐపీఎల్‌లో రాజస్తాన్ ఇప్పటివరకు సాధించిందేమీ లేదు. ఏళ్లు గడుస్తున్నా ఆట పరంగా, ఫలితాల పరంగా ఆ జట్టు ఎప్పుడూ వెనుకంజే ఉంటుంది. అయితే ఈసారి ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ సారథ్యంలో రాజస్తాన్.. టైటిల్ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది. గత సీజన్లలో బ్యాట్స్‌మన్‌గా సక్సెస్ అయిన తమ రెగ్యులర్ కెప్టెన్ అజింక్య రహానెను పక్కనబెట్టి ఈసారి స్మిత్‌కు పగ్గాలు అప్పగించారు. ఈనెల 22న చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే తొలి మ్యాచ్‌తో రాజస్థాన్ రాయల్స్ తమ ఐపీఎల్ 2020 సీజన్ జర్నీ మొదలుపెట్టనుంది.

బలం.. బలగం..
టీ20 ఫార్మాట్‌కు సరిపోయే కాంబినేషన్స్ అన్నీ రాజస్థాన్ జట్టులో ఉన్నాయి. వీళ్లు ప్రణాళిక ప్రకారం ఆడితే జట్టుకు తిరుగుండదు. జోస్ బట్లర్, స్మిత్, డేవిడ్ మిల్లర్‌లాంటి విదేశీ క్రికెటర్లపైనే బ్యాటింగ్ బలం ఆధారపడి ఉంది. ప్రస్తుతం బట్లర్ ఫామ్‌లో ఉండటం కలిసొచ్చే అంశం. స్మిత్, మిల్లర్ కుదురుకుంటే జట్టు బ్యాటింగ్‌కు డోకా లేదు.ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్.. జట్టుకు కొండంత అండ.
భారత ఆటగాళ్ల పరంగా చూస్తే యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్, కార్తీక్ త్యాగీ అవకాశాలను వినియోగించుకుంటే స్టార్లుగా ఎదుగుతారు. టీమిండియాకు ఆడిన సంజూ శాంసన్, రాబిన్ ఊతప్పతో మనన్ వోహ్రా.. బ్యాటింగ్ లైనప్‌లో కీలకం. వీరిలో ఒకరు బట్లర్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. బౌలింగ్‌లో ఆర్చర్, జైదేవ్ ఉనాద్కట్, వరుణ్ ఆరోన్, టై, కరన్‌తో పేస్ బలగం బలంగా ఉంది. శ్రేయస్ గోపాల్, రాహుల్ తెవాటియా స్పిన్ మ్యాజిక్ పని చేస్తే తిరుగుండదు. మిస్టరీ స్పిన్నర్ మయాంక్ మార్కండే అదనపు బలం.

బలహీనత..
అప్పటివరకు బాగానే ఆడినట్లు కనిపించినా.. టపటపా వికెట్లు కోల్పోవడం, ఒత్తిడిని జయించలేకపోవడం రాయల్స్‌కు ఉన్న అతిపెద్ద బలహీనత. ఇక కరోనా నేపథ్యంలో విదేశి ఆటగాళ్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. కెప్టెన్ స్మిత్ సహా కొందరు ప్లేయర్లు ప్రారంభంలో కొన్ని మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటంపై సందేహాలు నెలకొన్నాయి. దీంతో కెప్టెన్సీ ఎవరు చేపడతారనేదానిపై స్పష్టత లేదు. ఊతప్ప, ఉనాద్కట్‌లో ఒకరికి బాధ్యతలు ఇచ్చే అవకాశం ఉంది.
ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల స్టోక్స్.. న్యూజిలాండ్‌లో ఉన్నాడు. అతడు ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియదు. ఒకవేళ స్టోక్స్ వస్తే మిడిలార్డర్ దుర్బేధ్యంగా మారుతుంది. ఆర్చర్‌లో నిలకడ ఉన్నా.. అతనికి సాయం అందించే ఉనాద్కట్, వరుణ్‌లో ఇది కొరవడింది. ఏ రోజు వాళ్ల పెర్ఫామెన్స్ ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఈ సమస్యలను అధిగమిస్తేనే.. రాయల్స్‌కు ప్లే ఆఫ్ చాన్సెస్.

రాజస్తాన్ రాయల్స్ టీమ్
బ్యాట్స్‌మెన్: స్టీవ్ స్మిత్(కెప్టెన్), రియాన్ పరాగ్, మనన్ వోహ్రా, యశశ్వి జైస్వాల్, డేవిడ్ మిల్లర్,
ఆల్‌రౌండర్స్: బెన్ స్టోక్స్, మహిపాల్ లోమ్రోర్, శశాంక్ సింగ్, అనిరుద్ధ జోషి
వికెట్ కీపర్స్: జోస్ బట్లర్, సంజు శాంసన్, రాబిన్ ఉతప్ప, అనుజ్ రావత్
బౌలర్స్: జోఫ్రా ఆర్చర్, జైదేవ్ ఉనాద్కట్ , శ్రేయస్ గోపాల్, వరుణ్ ఆరోన్, అంకిత్ రాజ్‌పుత్, రాహుల్ తెవాటియా, ఒషేన్ థామస్, కార్తీక్ త్యాగీ, ఆకాశ్ సింగ్, ఆండ్రూ టై, టామ్ కరన్. మయాంక్ మార్కండే.


Click it and Unblock the Notifications

Mumbai Indians: బలాలు, బలహీనతలు,.. జట్టు పూర్తి వివరాలు!