For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Mumbai Indians: బలాలు, బలహీనతలు,.. జట్టు పూర్తి వివరాలు!

Mumbai Indians: Strength, Weakness, Top Players, Playoffs Chances and Prediction
IPL 2020 : Mumbai Indians Analysis, UAE Record | Strengths, Weaknesses || Oneindia Telugu

హైదరాబాద్: ఆరంభంలో ఇబ్బంది పడడం.. మధ్యలో పుంజుకోవడం.. చివర్లో చెలరేగి ఆడడం... ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్‌)‌లో ముంబై ఇండియన్స్‌‌ శైలి‌ ఇది. ఆటలోనే కాదు టైటిల్స్‌‌ నెగ్గడంలోనూ ఆ జట్టు తీరు అదే. తొలి‌ ఐదు సీజన్లలో ఒకేసారి ఫైనల్‌‌ వరకూ వచ్చిన ముంబై.. తర్వాతి ఏడు సీజన్లలో ఏకంగా నాలుగు టైటిల్స్‌‌ నెగ్గింది. ఈ నాలుగు ట్రోఫీలు‌ రోహిత్‌‌ శర్మ సారథ్యంలోనే రావడం విశేషం. దిగ్గజ‌ మహేంద్ర సింగ్‌‌ ధోనీ తర్వాత అంతటి ప్రశాంతంగా ఉండే కెప్టెన్‌‌గా పేరు తెచ్చుకున్న హిట్‌‌మ్యాన్‌‌ బ్యాటింగ్‌‌లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. క్షిష్ట పరిస్థితుల్లో అద్భుత కెప్టెన్సీతో అండగా నిలుస్తున్నాడు.

గత‌ సీజన్‌‌ ఫైనల్లో చెన్నైని ఓడించిన ముంబై రికార్డు స్థాయిలో నాలుగోసారి విజేతగా నిలిచింది. ఈ సారి కూడా అదే జోరు కొనసాగించాలని భావిస్తోంది. అయితే, బలమైన జట్టు‌, కెప్టెన్‌‌, గొప్ప సహాయక సిబ్బంది ఉన్నప్పటికీ ముంబై ఒక్కసారి కూడా వరుసగా టైటిల్ నెగ్గలేదు. నాలుగు టైటిల్స్‌‌నూ వేర్వేరు సీజన్లలోనే నెగ్గిందా జట్టు. ఈసారి వేదిక మారింది. వాతావరణం మారింది. మరి, ఆ జట్టు టైటిల్​ను​ కాపాడుకుంటుందా? అనేది చూడాలి. ఓసారి ఆ జట్టు బలలాలు, బలహీనతలపై లుక్కెద్దాం.

టాపార్డర్ బలం..

టాపార్డర్ బలం..

ముంబై ఇండియన్స్ టాపార్డర్ ఎప్పుడూ బలంగానే ఉంటుంది. ఈ సారి ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్‌‌ లిన్‌‌ రాకతో మరింత స్ట్రాంగ్‌‌గా మారింది. కోల్‌‌కతా నైట్‌‌రైడర్స్‌‌ ఓపెనర్​గా దుమ్మురేపిన లిన్‌‌ ఈ సారి సౌతాఫ్రికా వికెట్‌‌ కీపర్​ క్వింటన్‌‌ డికాక్‌‌తో కలిసి ముంబై ఇన్నింగ్స్‌‌ ఆరంభించే అవకాశం ఉంది. అప్పుడు కెప్టెన్​ రోహిత్‌ శర్మ‌ వన్‌‌డౌన్‌‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ ముగ్గురిలో ఏ ఒక్కరు నిలిచినా అవతలి టీమ్‌‌ బౌలర్లకు మూడినట్టే.

రోహిత్‌‌ కూల్‌‌ కెప్టెన్సీ జట్టు‌కు అదనపు బలం. క్లిష్ట పరిస్థితుల్లోనూ అతను ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకోగలడు. వరల్డ్‌‌ బెస్ట్‌‌ టీ20 బౌలర్లలో ఒకడైన జస్‌ప్రీత్ బుమ్రా, వరల్డ్‌‌ క్లాస్‌‌ ఆల్‌‌రౌండర్లైన హార్దిక్ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌ అండ ముంబై సొంతం. సూర్యకుమార్​, ఇషాన్‌‌ కిషన్‌‌ రూపంలో భారత యువ ఆటగాళ్ల‌ మద్దతు‌ కూడా ఉంది. అలాగే హెడ్‌‌ కోచ్‌‌ జయవర్ధనే, మెంటార్​ సచిన్‌‌​, క్రికెట్‌‌ ఆపరేషన్స్‌‌ డైరెక్టర్​ జహీర్​ ఖాన్, బౌలింగ్‌‌ కోచ్‌‌ షేన్‌‌ బాండ్‌‌ తదితరుల గైడెన్స్‌‌ గేమ్‌‌ప్లాన్‌‌ విషయంలో రోహిత్‌‌కు ఉపయోగపడనుంది.

బలహీనతలు..

బలహీనతలు..

ఈ సీజన్‌‌ భారత్‌లో జరిగి ఉంటే ముంబై బౌలింగ్‌‌ అటాక్‌‌ అత్యంత పదునుగా ఉండేది. టోర్నీ యూఏఈలో జరుగుతుంది కాబట్టి అక్కడి పిచ్‌‌లకు తగ్గట్టు నాణ్యమైన స్పిన్నర్లు ముంబైలో లేరు. రాహుల్‌‌ చహర్​, కృనాల్‌‌ పాండ్యా మాత్రమే ఫైనల్‌‌ ఎలెవెన్‌‌లో ఫిట్‌‌ అయ్యేలా ఉన్నారు. కానీ, వీరిని వికెట్‌‌ టేకింగ్‌‌ బౌలర్లకంటే రన్‌‌ సేవింగ్‌‌ స్పిన్నర్లు అనొచ్చు. పైగా బుమ్రా మినహాయిస్తే ముంబై పేస్‌‌ లైనప్‌‌ స్ట్రాంగ్‌‌గా లేదు. లసిత్ మలింగ లేకపోవడం పెద్ద లోటు. ఢిల్లీ క్యాపిటల్స్‌‌ నుంచి ట్రేడింగ్‌‌ ద్వారా తీసుకున్న కివీస్‌‌ స్పీడ్‌‌స్టర్​ ట్రెంట్‌‌ బౌల్ట్‌‌ను నమ్ముకోలేం. ఎందుకంటే ఐపీఎల్‌‌లో అతని ఎకానమీ రేట్‌‌ 8.75. లాస్ట్‌‌ సీజన్లో అతను ఐదే మ్యాచ్‌‌లు ఆడాడు.

కొత్తగా వచ్చిన నాథన్‌‌ కౌల్టర్ ​నిల్‌‌ గత రెండు సీజన్లలో ఒక్క మ్యాచ్‌‌ కూడా ఆడలేదు. మరో పేసర్ మెక్లెనగన్‌‌లో నిలకడ లేదు. మలింగ ప్లేస్‌‌లో వచ్చిన ఆసీస్‌‌ పేసర్ జేమ్స్‌‌ ప్యాటిన్సన్‌‌ ఈ ఫార్మాట్‌‌లో తనను తాను నిరూపించుకోలేదు. భారత‌ పేసర్​ ధవల్‌‌ కులకర్ణి కూడా ఏమంత ఆకట్టుకోవడం లేదు. రాజస్తాన్‌‌ రాయల్స్‌‌కు ఆడిన ధవల్‌‌ గత మూడు సీజన్లలో 13 వికెట్లే తీశాడు. దాంతో భారమంతా బుమ్రాపైనే ఉంటుంది. ఇక, యూఏఈలో ముంబై రికార్డు పేలవంగా ఉంది. 2014లో ఇక్కడ ఆడిన ఐదు మ్యాచ్‌‌ల్లోనూ ఓడిపోయింది.

ప్లేఆఫ్స్ అంచనా

ప్లేఆఫ్స్ అంచనా

ఎప్పట్లాగే ముంబైపై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్లే అది బలమైన జట్టు కూడా. నాలుగు టైటిళ్లు నెగ్గడం, ఐదు ఫైనల్స్‌‌ ఆడిన అనుభవం ఉంది కాబట్టి కీలక మ్యాచ్‌‌ల్లో సత్తా చాటగలదు. బౌలింగ్‌‌ కాస్త బలహీనం‌గా ఉన్నా ఈ సారి కూడా ప్లే ఆఫ్స్‌‌కు చేరుకోగల సామర్థ్యం ఉంది. ఆ జట్టు హార్డ్ హిట్టర్ కీరన్ పొలార్డ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. కరీబీయన్ ప్రీమియర్ లీగ్(సీపీఎల్)లో ఆల్‌రౌండ్ షోతో తన జట్టు ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను చాంపియన్‌గా నిలబెట్టాడు. అయితే నెమ్మదైన పిచ్‌లపై అతను ఎంతవరకు రాణిస్తాడనేది చూడాలి. మరే జట్టులో లేని ఆటగాళ్లు ముంబై సొంతం. వారు స్థాయికి తగ్గ రాణిస్తే ముంబైకి తిరుగుండదు

ముంబై జట్టు‌

ముంబై జట్టు‌

బ్యాట్స్‌‌మెన్‌‌: రోహిత్‌‌ శర్మ (కెప్టెన్‌‌), క్రిస్‌‌ లిన్‌‌, సూర్యకుమార్​యాదవ్‌‌, అన్మోల్‌‌ప్రీత్‌‌ సింగ్‌‌, సౌరభ్‌‌ తివారీ, మోసిన్‌‌ ఖాన్‌‌, షెర్ఫానే రూథర్​ఫర్డ్‌‌,

వికెట్‌‌ కీపర్స్‌‌: క్వింటన్‌‌ డికాక్‌‌, ఇషాన్‌‌ కిషన్‌‌, ఆదిత్య తారె

ఆల్‌‌రౌండర్స్‌‌: హార్దిక్‌‌ పాండ్యా, కీరన్‌‌ పొలార్డ్‌‌, క్రునాల్‌‌ పాండ్యా, అనుకూల్ రాయ్‌‌, ప్రిన్స్‌‌ బల్వంత్‌‌ రాయ్‌‌ సింగ్‌‌

బౌలర్స్‌‌: జస్‌‌ప్రీత్‌‌ బుమ్రా, ధవళ్‌‌ కులకర్ణి, మిచెల్‌‌ మెక్లెనగన్‌‌, ట్రెంట్‌‌ బౌల్ట్‌‌, రాహుల్‌‌ చహర్, దిగ్విజయ్‌‌ దేశ్‌‌ముఖ్‌‌, జేమ్స్‌‌ ప్యాటిన్సన్‌‌, జయంత్‌‌ యాదవ్‌‌, నేథన్‌‌ కూల్టర్​నైల్.

Story first published: Friday, September 11, 2020, 16:20 [IST]
Other articles published on Sep 11, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+