Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ, రోహిత్‌ వన్డే స్వరూపాన్ని మార్చేశారు: ద్రవిడ్

Rahul Dravid Says Players like Virat Kohli have shown that one can excel in all three formats

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ స్వరూపాన్ని మార్చేశారని భారత మాజీ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్ తెలిపాడు. ఒకప్పటి తన స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేస్తే ఈనాటి క్రికెట్లో కొనసాగడం కష్టమని ఈ మిస్టర్ డిపెండబుల్ అభిప్రాయపడ్డాడు. మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌ నిర్వహించిన ఈఎస్‌పీఎన్‌ క్రిక్‌ఇన్ఫో లైవ్‌చాట్‌లో ద్రవిడ్‌ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

సచిన్‌, వీరూ స్ట్రైక్ కన్నా తక్కువే..

సచిన్‌, వీరూ స్ట్రైక్ కన్నా తక్కువే..

సచిన్, వీరేంద్ర సెహ్వాగ్‌ల స్ట్రైక్ రేట్ కన్నా తనది తక్కువగా ఉంటుందన్నాడు. ‘ఎక్కువ సేపు క్రీజులో ఉండి, కొత్త బంతి మెరుపు పోగొట్టిన తర్వాత పరుగులు రాబట్టడమే నేను చేసింది. నా పనదే. దాన్ని చేసేందుకు గొప్పగా ఫీలయ్యేవాడిని. వీరేంద్ర సెహ్వాగ్‌లాగా షాట్లు ఆడటం నాకిష్టం లేదని కాదుకానీ, నా ప్రతిభ భిన్నమైంది. అంకితభావం, ఏకాగ్రతతో ఆడటమే నా నైపుణ్యాలు. నేను వాటిపైనే పనిచేశాను. వన్డేల్లో నా స్ట్రైక్‌రేట్‌ సచిన్‌, సెహ్వాగ్‌ కన్నా తక్కువే ఉంటుంది. ఎందుకంటే ఆ రోజుల్లో స్థాయి అది. నేను రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో అయితే పోల్చుకోలేను. వారు వన్డేల స్వరూపమే పూర్తిగా మార్చేశారు. ఆటను సరికొత్త స్థాయికి తీసుకెళ్లారు. నిజం చెప్పాలంటే నేను టెస్టు ఆటగాడినే కావాలనుకున్నాను' అని ద్రవిడ్ పేర్కొన్నాడు.

బలహీనలతో టెస్ట్ ఆడలేం..

బలహీనలతో టెస్ట్ ఆడలేం..

పరిమిత ఓవర్ల ఫార్మాట్‌తో పోలిస్తే టెస్ట్‌ల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని ద్రవిడ్ తెలిపాడు. ‘మ్యాచ్‌లో సంక్లిష్ట పరిస్థితుల్లో కొనసాగేందుకు డిఫెన్స్‌ టెక్నిక్‌ సాయపడుతుంది. టెస్టు క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లు అదే పని చేస్తారు. ఇక ఒత్తిడి విషయానికి వస్తే టెస్టులను ఐదు రోజులు ఆడాలి. దాన్నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఇతర ఫార్మాట్లలో తప్పించుకోవచ్చు. కానీ టెస్టుల్లో నువ్వెళ్లి కచ్చితంగా బ్యాటింగ్‌ చేయాల్సిందే. ఆ తర్వాత నీ సహచరులు, అవతలి జట్టు బ్యాటింగ్‌ చేయడం చూడాల్సిందే. ఇక ఆలోచించేందుకు చాలా సమయం ఉంటుంది. అందుకే పరిమిత ఓవర్ల క్రికెట్‌తో పోలిస్తే టెస్టుల్లో ఒత్తిడి మరో స్థాయిలో ఉంటుంది. బలహీనతలు ఉన్నప్పటికీ టీ20ల్లో కొనసాగొచ్చు. అదే టెస్టుల్లో మాత్రం నిలబడలేరు. టీ20ల్లో పరిమిత పాత్ర ఉంటుంది. దాన్ని పోషిస్తే సరిపోతుంది' అని మిస్టర్‌ వాల్‌ అభిప్రాయపడ్డాడు.

లిమిటెడ్ ఫార్మాట్‌లో సెట్ కావొచ్చని..

లిమిటెడ్ ఫార్మాట్‌లో సెట్ కావొచ్చని..

సంప్రదాయక ఫార్మాట్‌తో పోల్చితే లిమిటెడ్ ఓవర్లో త్వరగా జీవనోపాధి పొందవచ్చని యువ ఆటగాళ్లు అనుకుంటున్నారని ద్రవిడ్ తెలిపాడు. ‘ప్రస్తుతం చాలామంది యువ ఆటగాళ్లు సైతం మూడు ఫార్మాట్లు ఆడాలని భావిస్తున్నారు. విరాట్‌ కోహ్లీ టెస్టు క్రికెట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం భారత్‌కు గొప్ప విషయం. అతనెప్పుడూ దాని గురించే మాట్లాడుతుంటాడు. యువ ఆటగాళ్లకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. నేనెంతో మంది యువకులతో కలిసి పనిచేశాను. కోహ్లీ, విలియమ్సన్‌, స్మిత్‌ను ఆదర్శంగా తీసుకున్న వారు అన్ని ఫార్మాట్లు ఆడాలనే దృఢ నిశ్చయంతో ఉంటున్నారు. కానీ ప్రతిభ తక్కువగా ఉన్నవారు కోహ్లీ, పుజారా, రహానె వంటి ఆటగాళ్లున్న జట్టులో స్థానం పొందలేమని భావిస్తున్నారు. తెలుపు బంతి క్రికెట్‌ను మాత్రం బాగా సాధన చేస్తే ఐపీఎల్‌కు ఎంపికై జీవనోపాధి పొందగలమని ఆశిస్తున్నారు' అని ద్రవిడ్‌ వెల్లడించాడు

పుజారా ఏకగ్రత తిరుగులేనిది..

పుజారా ఏకగ్రత తిరుగులేనిది..

టీమిండియా నయావాల్‌ చతేశ్వర్‌ పుజారాపై ద్రవిడ్‌ ప్రశంసల జల్లు కురిపించాడు. ‘పుజారా సౌరాష్ట్ర నుంచి వచ్చాడు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ఎక్కువగా కష్టపడాల్సి ఉంటుందని చిన్నప్పట్నుంచే అతడికి నూరిపోశారు. పుజారా ప్రతి ఇన్నింగ్స్‌ను పరిగణనలోకి తీసుకోవాలి. అలాగే అతడు బ్యాటింగ్‌ చేస్తాడు. అన్ని షాట్లు అతడికి ఆడటం వచ్చు. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొంటాడు. స్ట్రైక్‌ రొటేట్‌ చేస్తాడు. తన ఆటపై పుజారా ఎంతో పట్టు సాధించాడు. అతడి ఏకాగ్రత కూడా తిరుగులేనిది. అలాంటి వ్యక్తికి కచ్చితంగా జట్టులో చోటు ఉంటుంది. ఎందుకంటే జట్టు విజయాల్లో అతడి టెక్నిక్‌ అత్యంత అవసరం' అని ఆయన అన్నారు.

అత్యాచార ఆరోపణలతో ప్రతీ ఒక్కరు నన్ను అనుమానించారు: అక్తర్

Story first published: Tuesday, June 9, 2020, 17:52 [IST]
Other articles published on Jun 9, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+