Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

మన్కడింగ్ మరోసారి.. అండర్సన్‌కు అశ్విన్ కొంటె రిప్లయ్.!

R Ashwin takes dig at James Anderson after England pacer suggests removal of Mankading rule

హైదరాబాద్ : క్రికెట్‌లో వివాదస్పదకరమైన మన్కడింగ్ మరోసారి చర్చనీయాంశమైంది. అండర్-19 వరల్డ్‌కప్‌లో భాగంగా అఫ్గానిస్థాన్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో మన్కడింగ్ తరహా ఔట్ చోటుచేసుకుంది. దీంతో ఈ నిబంధనను తీసేయాలని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీకి విజ్ఞప్తి చేస్తూ ట్వీట్ చేయగా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ కొంటె రిప్లయ్ ఇచ్చాడు.

అసలేం జరిగిందంటే..

శుక్రవారం జరిగిన అండర్-19 క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 28వ ఓవర్‌లో ఈ మన్కడింగ్ ఘటన చోటు చేసుకుంది. ఫవాద్ మునీర్ అవుట్ కావడంతో హురైరా బ్యాటింగ్‌కి వచ్చాడు. అయితే 28వ ఓవర్‌లో ఫవాద్‌ని ఎల్‌బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్ చేర్చిన నూర్.. అదే ఓవర్ ఐదో బంతికి హురైరాని మన్కడింగ్ చేసి అవుట్ చేశాడు.

దీంతో బ్యాట్స్‌మెన్ సహా ఫీల్డ్ అంపైర్లు కూడా షాక్ అయ్యారు. అయితే తుది నిర్ణయం కోసం ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్‌ని సంప్రదించారు. అయితే బంతి వేయకముందే హురైరా.. క్రీజ్ వెలుపల ఉన్నట్లు తేలడంతో అతను ఔట్ అయినట్లు థర్డ్ అంపైర్ ప్రకటించారు. దీంతో తీవ్ర నిరాశ చెందిన హురైరా.. అసంతృప్తితో మైదానం వీడాడు.

కాసింత చర్చించాలి బ్రో..

అయితే ఈ వివాదస్పద మన్కడింగ్ వివాదాన్ని తొలగించాలని ఇంగ్లండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఐసీసీకి ట్వీట్ చేశాడు. దీనికి అశ్విన్ సరదాగా కౌంటర్ ఇచ్చాడు. ‘ఈ నిబంధనను తొలగించాలంటే కాసింత చర్చించాలి. ఇప్పటికైతే నడిచిపోతుంది' అని కొంటెగా రిప్లే ఇచ్చాడు.

మన్కడింగ్ అంటేనే అశ్విన్..

మన్కడింగ్ అంటేనే అశ్విన్..

గతేడాది ఐపీఎల్‌ సీజన్‌లో రాజస్తాన్‌ రాయల్స్ బ్యాట్స్‌మన్‌ జోస్ బట్లర్‌ను అప్పుడు పంజాబ్ కెప్టెన్‌గా ఉన్న అశ్విన్ ‘మన్కడింగ్‌' ద్వారా ఔట్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఇది పెద్ద దుమారాన్నే రేపింది. క్రీడాస్పూర్తికి విరుద్దంగా అశ్విన్ వ్యవహరించాడని కొందరు విమర్శించగా.. అతను నిబంధనల ప్రకారమే వ్యవహరించాడని మరి కొందరు మద్దతు పలికారు. అప్పట్లో దీనిపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో మన్కడింగ్ అనగానే అశ్విన్.. అశ్విన్ అనగానే మన్కడింగ్ అనే విషయం అభిమానులకు గుర్తుండిపోయింది.

union budget 2020: క్రీడల బడ్జెట్ ఎంతో తెలుసా?

అసలు మన్కడింగ్‌ అంటే..

అసలు మన్కడింగ్‌ అంటే..

క్రికెట్‌ నిబంధనలు రూపొందించే ఎంసీసీ ప్రకారం... బౌలర్‌ బంతిని వేయడానికి సిద్ధమై, అతని చేతినుంచి ఇంకా బంతి వెళ్లక ముందే నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ దాటి బయటకు వస్తే బెయిల్స్‌ను పడగొట్టి బౌలర్‌ సదరు బ్యాట్స్‌మన్‌ ఔట్‌ కోసం అప్పీల్‌ చేయవచ్చు. ఇది సాంకేతికంగా రనౌట్‌ జాబితాలో వస్తుంది.

2017 అక్టోబర్‌ 1నుంచి అమల్లోకి వచ్చిన నిబంధనల ప్రకారం బౌలర్‌ బంతిని విసిరే లోగా ఏ సమయంలోనైనా నాన్‌స్ట్రైకర్‌ క్రీజ్‌ బయట ఉంటే ఔట్‌గానే పరిగణిస్తారు. నిబంధల ప్రకారం అశ్విన్‌ చేసింది సరైందే.

క్రీడా స్ఫూర్తి ప్రకారం బ్యాట్స్‌మన్‌ను ఔటే చేసే ముందు ఒక సారి హెచ్చరిస్తే బాగుంటుందని అంటారు కానీ నిబంధనల్లో ఎక్కడా ముందుగా హెచ్చరించాలని లేదు. 1947లో సిడ్నీ టెస్టులో ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌ బ్రౌన్‌ను భారత ఆల్‌రౌండర్‌ వినూ మన్కడ్‌ ఇలా ఔట్‌ చేయడంతో ‘మన్కడింగ్‌' అని పేరు వచ్చింది

Story first published: Sunday, February 2, 2020, 11:48 [IST]
Other articles published on Feb 2, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+