టిమ్ పైన్.. నీ స్లెడ్జింగ్‌ను మా కూతురు ఏడుపులా భావించాడేమో: అశ్విన్ సతీమణి

సిడ్నీ: భారత ఆటగాళ్లపై పదే పదే నోరుపారేసుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్‌కు రవిచంద్రన్ అశ్విన్ సతీమణి ప్రీతి అశ్విన్ గట్టిగా కౌంటరిచ్చారు. ఆస్ట్రేలియా కెప్టెన్ స్లెడ్జింగ్‌ను అశ్విన్ తమ కూతురు ఏడుపుగా భావించి ఓపికగా ఉండి ఉంటాడని ట్వీట్ చేశారు. ఇక వెన్ను గాయంతో ఇబ్బంది పడుతున్నా మైదానంలో అశ్విన్ చూపిన పోరాటపటిమ అద్భుతమని కొనియాడారు. ఇక బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్ట్‌ను భారత్ డ్రా చేసుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ చివరి రోజు హనుమ విహారీతో కలిసి అశ్విన్ అద్భుతంగా పోరాడాడు.

పైన్ స్లెడ్జింగ్..
అయితే ఈ ఇద్దరి నిలకడైన బ్యాటింగ్‌కు సహనం కోల్పోయిన ఆసీస్ ఆటగాళ్లు.. స్లెడ్జింగ్‌కు దిగారు. ముఖ్యంగా ఆసీస్ కెప్టెన్ టిమ్ పైన్ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించాడు. చెస్ట్ ప్యాడ్ కోసం వెళ్లిన అశ్విన్‌పై కేకలు వేశాడు. కావాలనే భారత ఆటగాళ్లు టైమ్ వృథా చేస్తున్నారని, చెస్ట్ ప్యాడ్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు. ఇక పైన్ తీరుపై భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.
మా కూతురు ఏడుపు అనుకున్నాడు..
ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆసీస్‌లోనే ఉన్న అశ్విన్ సతీమణి ప్రీతి కూడా గట్టిగా కౌంటరిచ్చింది. అశ్విన్ సహనంగా ఉండటం అద్భుతమని, తమ కూతురు ఆధ్యా మూడు గంటలకు లేచి ఆగకుండా ఏడ్చినట్లు.. పైన్ స్లెడ్జింగ్ ఉందని భావించి ఉంటాడని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రీతి ట్వీట్లపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కౌంటర్ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు.
కనీసం నిలబడలేకపోయాడు..
ఇక చివరి రోజు ఆటకు ముందు అశ్విన్ తీవ్ర వెన్ను నొప్పితో ఇబ్బంది పడ్డాడని, కానీ జట్టు కోసం అతను ఆ నొప్పిని భరిస్తూ ఆడిన తీరు నిజంగా అద్భుతమని ప్రీతి ట్వీట్ చేసింది. 'గత రాత్రి అశ్విన్ తీవ్ర వెన్ను నొప్పితో బాధపడ్డాడు. కనీసం నిటారుగా నిలబడలేకపోయాడు. ఉదయం లేచిన తర్వాత కూడా ఆ నొప్పితో విలవిలలాడాడు. కనీసం తన షూ లేస్ కట్టుకోలేకపోయాడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న అశ్విన్ మైదానంలో రాణించడం నిజంగా అద్భుతం'అని ప్రీతి ట్వీట్‌లో పేర్కొంది.

పంత్ సూపర్ షో..
ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్‌లో టీమిండియాను రిషభ్ పంత్( 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97) వన్డే తరహా బ్యాటింగ్.. చతేశ్వర్ పుజారా(205 బంతుల్లో 12 ఫోర్లతో 77), హనుమ విహారీ(161 బంతుల్లో 23 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్)ల క్లాస్ ఇన్నింగ్స్ గట్టెక్కించింది. ఆసీస్ నిర్దేశించిన 407 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా 98/2 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన భారత్.. ఆట ముగిసే సమయానికి 131 ఓవర్లలో 5 వికెట్లకు 334 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది.
నోరు పారేసుకుంటే గెలవరు.. బాగా ఆడితేనే గెలుస్తారు? టిమ్ పైన్‌పై ఫ్యాన్స్ ఫైర్!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications