Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

India vs Australia: నోరు పారేసుకుంటే గెలవరు.. బాగా ఆడితేనే గెలుస్తారు? టిమ్‌ పైన్‌పై ఫ్యాన్స్ ఫైర్!

India vs Australia: Fans slam Tim Paine for yelling at Ravichandran Ashwin

సిడ్నీ: ఆస్ట్రేలియా జరిగిన మూడో టెస్ట్‌ను భారత్ డ్రా చేసుకుంది. చివరి రోజు ఆటలో అద్భుతంగా పోరాడి బోర్డర్ గవాస్కర్ సిరీస్‌పై ఆశలను సజీవంగా ఉంచుకుంది. టీమిండియా వికెట్ కీపర్ రిషభ్ పంత్( 118 బంతుల్లో 12 ఫోర్లు, 3 సిక్సర్లతో 97), చతేశ్వర్ పుజారా(205 బంతుల్లో 12 ఫోర్లతో 77) సూపర్ బ్యాటింగ్‌కు తోడు హనుమ విహారీ(161 బంతుల్లో 23 నాటౌట్), రవిచంద్రన్ అశ్విన్ (128 బంతుల్లో 39 నాటౌట్) అసలు సిసలు టెస్ట్ ఇన్నింగ్స్‌తో రాణించడం భారత్ ఓటమిని తప్పించుకుంది. ఇక 407 పరుగుల భారీ లక్ష్యం విధించిన ఆసీస్.. చివరి రోజు తమ పని సులవు అవుతుందని భావించింది. కానీ అలా జరగకపోవడంతో ఆ జట్టు ఆటగాళ్లు తీవ్ర అసహనానికి గురయ్యారు. భారత ఆటగాళ్లపై పదే పదే నోరు పారేసుకున్నారు.

అశ్విన్‌పై నోరుపారేసుకున్న పైన్..

అశ్విన్‌పై నోరుపారేసుకున్న పైన్..

ముఖ్యంగా కెప్టెన్ టిమ్ పైన్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. అశ్విన్- విహారీ బ్యాటింగ్‌కు విసిగిపోయాడు. దాంతో ఏం చేయలేక నోరు పారేసుకున్నాడు. షార్ట్ బాల్స్ ఆడే విషయంలో అశ్విన్ తడబడగా బంతులన్నీ అతని చెస్ట్‌పైకి దూసుకొచ్చాయి. అతను విహారీ చెస్ట్ ప్యాడ్ తీసుకున్నాడు. ఈ సమయంలో పైన్ ఇంగిత జ్ఞానం లేకుండా ప్రవర్తించారు. భారత ఆటగాళ్లిద్దరూ కావాలనే బ్రేక్ తీసుకుంటున్నారని ఆరోపించాడు. 'ఇది నిజంగా హస్యాస్పదకం.. చెస్ట్ ప్యాడ్ అవసరమా?'అని పైన్ అన్న వ్యాఖ్యలు స్టంప్ మైక్‌లో రికార్డు అయ్యాయి. ఈ వ్యాఖ్యలకు అశ్విన్ కూడా తనదైన రీతీలో బదులిచ్చాడు.

పైన్ నీకిది తగదు..

పైన్ నీకిది తగదు..

ఇక పైన్ వ్యాఖ్యలపై భారత అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విటర్ వేదికగా ఆసీస్ కెప్టెన్‌పై దుమ్మెత్తిపోశారు. 'ఆస్ట్రేలియా ఆటగాళ్లు వారి బుద్దిని పోనిచ్చుకోలేదు. గెలవడం కోసం వారు ఏమైనా చేస్తారని మరోసారి అర్థమైంది.'అని ఒకరు కామెంట్ చేయగా.. 'నోరుపారేసుకుంటూ మ్యాచ్ గెలవరు పైన్.. బాగా ఆడితేనే విజయం దక్కుతుంది'అని ఇంకొకరు కామెంట్ చేశారు. టిమ్ పైన్ తన చేష్టలతో గౌరవం పోగుట్టుకున్నారని మరికొందరు కామెంట్ చేశారు.

మాథ్యూ వేడ్ ఎగతాళి!

ఇక షార్ట్ పిచ్ బంతులు ఆడలేక అశ్విన్ ఇబ్బంది పడగా.. కొన్ని బంతులు అతని చాతికి బలంగా తాకాయి. దాంతో ఈ గాయాలను ఎగతాళి చేస్తూ మాథ్యూవేడ్ స్లెడ్జింగ్‌కు దిగగా.. కెప్టెన్‌గా ఆపాల్సిందిపోయి పైన్ మరింత ప్రోత్సహించాడు. అతను కామెంట్ చేస్తూ ఉంటే నవ్వుతూ కనిపించాడు. దీనిపై కూడా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు షేన్ వాట్సన్ గాయం పట్ల శిఖర్ ధావన్ ఇలానే ఎగతాళిగా మాట్లాడితే.. అప్పటి భారత కెప్టెన్ ధోనీ గబ్బర్‌ను వారించడని గుర్తు చేసుకుంటున్నారు. కానీ పైన్ మాత్రం సిగ్గులేకుండా నవ్వుతూ ప్రోత్సహిస్తున్నాడని మండిపడ్డారు.

స్టీవ్ స్మిత్ చిల్ల‌రవేషాలు

పంత్ బ్యాటింగ్‌ను ఓర్వలేకపోయిన స్టీవ్ స్మిత్ చిల్లర వేషాలకు దిగాడు. జోరుమీదున్న రిషబ్ పంత్‌ గార్డ్‌ మార్క్‌లను స్టీవ్ స్మిత్‌ కావాలనే చెరిపేశాడు. డ్రింక్స్ బ్రేక్‌లో ఈ చిల్లర పనిచేస్తూ స్టంప్స్ కెమెరాకు అడ్డంగా దొరికిపోయాడు. త‌న గార్డ్ చెరిపేయ‌డంతో పంత్ మ‌రోసారి మార్క్ చేసుకోవాల్సి వ‌చ్చింది. స్మిత్ చేసిన పనిపై కూడా అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాల్‌ట్యాంపరింగ్ ఉదంతంతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న స్మిత్‌కు బుద్ది రాలేదని కామెంట్ చేశారు.

Story first published: Monday, January 11, 2021, 14:32 [IST]
Other articles published on Jan 11, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+