
రెట్టించిన ఆత్మ విశ్వాసం..
‘టీమిండియా అద్భుతమైన జట్టు. వారి కూర్పు బాగుంది. అయితే మేము కూడా రెట్టించిన ఆత్మవిశ్వాసంతోనే ఇక్కడి వచ్చాం. డుప్లెసిస్ జట్టులోకి వచ్చాడు. నాయకత్వ కోణంలో అతడి పాత్రెంతో కీలకం. జట్టులోని యువ ఆటగాళ్లకు సాయం చేసేందుకే అతడున్నది. ఫాఫ్ మాకు ఎంతో మేలు చేస్తాడు. ఇది అతనికి కూడా తెలుసు. ఈ సిరీస్‌లో ఫాఫ్ అనుభవం ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడి పరిస్థితులపై ఏ మాత్రం అనుభవం లేని కుర్రాళ్లతో ఇక్కడికి వచ్చామని మాకు తెలుసు. అందుకే డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, నేనూ యువకులకు మార్గనిర్దేశం చేయడతో పాటు మా అనుభవాన్ని వారికి బదిలీ చేస్తాం. చేయాలి' అని డికాక్ తెలిపాడు.
పాండ్యా మెరిసేనా? ధావన్ దంచేనా? లేక వర్షార్పణం అయ్యేనా?

డూప్లెసిస్ బ్యాటింగ్ ఆర్డర్..
ఆస్ట్రేలియా సిరీస్‌లో డుప్లెసిస్‌కు విశ్రాంతినిచ్చాం. సుదీర్ఘ కాలంగా అతడు ఆడుతున్నాడు. తన ఆలోచనలను క్రమబద్ధీకరించుకొనేందుకు విరామం ఉపయోగపడుతుంది. అతడు పునరాగమనం చేయడం ఎంతో సంతోషం. ఏ స్థానంలో బ్యాటింగ్ చేయాలో ప్రస్తుతానికి నిర్ణయించలేదు. త్వరలోనే నిర్ణయిస్తాం. బ్యూరాన్ హెండ్రిక్స్ దక్షిణాఫ్రికాలోనే అస్వస్థతకు గురయ్యాడు. టెంబా బవుమా పరిస్థితి ఇంకా తెలియదు. కోలుకున్నట్టైతే కనిపించలేదు' అని డికాక్ పలు ప్రశ్నలకు సమాధానమిచ్చాడు.

క్లీన్ స్వీప్..
ఆస్ట్రేలియాను 3-0తో వైట్‌వాష్ చేసిన సఫారీలు ఆత్మవిశ్వాసంతో భారత్‌లో అడుగుపెట్టారు. మరోవైపు న్యూజిలాండ్ చేతిలో 0-3తో వన్డే, 0-2తో టెస్టుల్లో వైట్‌వాష్ అయిన కోహ్లీసేన పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. గాయాలతో దూరమైన హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, శిఖర్ ధావన్ పునరాగమనం చేశారు.


Click it and Unblock the Notifications












