ఓయ్.. అఫ్రిది ఆ హెల్మెట్ ఏందీ? బంతి తగిలితే పోతావ్.. ఎవరైనా చెప్పండయ్యా!

కరాచీ: కరోనా వైరస్ కారణంగా ఆగిపోయిన పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్‌ఎల్) ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు శనివారం మళ్లీ మొదలయ్యాయి. పీఎస్‌ఎల్ లీగ్ మ్యాచ్‌లు దిగ్విజయంగా పూర్తవ్వగా .. మహమ్మారి కారణంగా ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు నిలిచిపోయాయి. ఆ తర్వాత ఐపీఎల్ 2020 ప్రారంభం కావడంతో లీగ్ నిర్వహించే అవకాశం లేకుండా పోయింది. ఇటీవల భారత క్యాష్ రిచ్ లీగ్ ముగియడంతో పీఎస్ఎల్ మళ్లీ పట్టాలెక్కింది.
ముల్తాన్ సుల్తాన్, కరాచీ కింగ్స్ మధ్య కరాచీ వేదికగా క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరిగింది. సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో కరాచీ కింగ్స్ విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. అయితే ఈ మ్యాచ్‌లో షాహిద్ అఫ్రిది ఉపయోగించిన హెల్మెట్‌పై నెట్టింట తీవ్ర చర్చ జరుగుతుంది. గ్రిల్స్ లేని ఈ హెల్మెట్ వాడటంపై అభిమానులు వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.
ఎవరైనా చెప్పండయ్యా..
బంతి సరిగ్గా కనబడాలనే ఉద్దేశంతో అఫ్రిది హెల్మెట్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాడు. గ్రిల్స్ తక్కువగా ఉన్న ఈ హెల్మెట్‌ను చూసి అభిమానులు అఫ్రిది భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరైనా చెప్పండయ్యా.. ఆ హెల్మెట్ వాడవద్దని కామెంట్ చేశారు. అతని ప్రాణాలకు ప్రమాదమని సూచించారు. ‘నువ్వు హెల్మెట్ మార్చినా.. నీ ఆట మాత్రం మారలేదు'అని ఒకరంటే.. ‘ఫిలిప్ హ్యూస్ మరణం గుర్తులేదా..? బంతి తాకితే పైకే పోతావ్'అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఈ జాగ్రత్త పనికిరాదని, మూల్యం చెల్లించుకుంటావని హెచ్చరించారు. ప్రస్తుతం అఫ్రిదికి హెల్మెట్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.

హెల్మెట్ తప్పనిసరి..
2014లో ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిప్ హ్యూస్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్‌లో ఓ రాకాసి బౌన్సర్‌కు గాయపడి ప్రాణాలు విడిచిన విషయం తెలిసిందే. ఈ ఘటన యావత్ క్రికెట్ ప్రపంచాన్ని శోకసంధ్రంలో ముంచింది. ఈ విషాద ఘటన జరిగినప్పటి నుంచి ఐసీసీ ఆటగాళ్ల భద్రతకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలపై దృష్టిసారించింది. ఇటీవల భారత్ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూడా హెల్మెట్ వాడటం తప్పనిసరి చేయాలని ఐసీసీకి సూచించాడు. ఐపీఎల్ మ్యాచ్ నేపథ్యంలో పరుగు తీస్తూ విజయ్ శంకర్ గాయపడటంతో మాస్టర్ ఈ ప్రతిపాదన చేశాడు.

సిక్సర్ ఔట్..
ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అఫ్రిది కేవలం టీ20 లీగ్‌లు ఆడుతున్న విషయం తెలిసిందే. దాంతో చాలా రోజుల తర్వాత మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టిన అఫ్రిది(12).. వచ్చి రావడంతోనే భారీ షాట్ ఆడి ఆశలు రేకెత్తించాడు. కానీ ఆ తర్వాత ఔటై తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో అఫ్రిది బ్యాటింగ్‌పై కూడా అభిమానులు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఇక కరోనా టైమ్‌లో పేద ప్రజలందరికి రేషన్, సరకులు అందజేసిన అఫ్రిది.. కరోనా బారిన పడి కూడా కోలుకున్నాడు.

సూపర్ డూపర్ థ్రిల్లర్..
పీఎస్‌ఎల్ 2020 ప్లే ఆఫ్స్ మ్యాచ్ సూపర్ డూపర్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముల్తాన్ సుల్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 రన్స్ చేసింది. రవి బోపారా(40), సోహైల్ తన్వీర్(21) టాప్ స్కోరర్లుగా నిలిచారు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన కరాచీ కింగ్స్ కూడా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 రన్సే చేయడంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారి తీసింది. సూపర్ ఓవర్‌లో కరాచీ కింగ్స్ 2 వికెట్లకు 13 రన్స్ చేయగా.. ముల్తాన్ సుల్తాన్ 9 పరుగులే చేసి ఓటమిపాలైంది.
చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది చెత్త పనులు...పండుగ పూట విరాట్ కోహ్లీకి చివాట్లు!
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications