చెప్పేది శ్రీరంగ నీతులు చేసేది చెత్త పనులు...పండుగ పూట విరాట్ కోహ్లీకి చివాట్లు!

న్యూఢిల్లీ: దీపావళీ పర్వదినాన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చివాట్లు తిన్నాడు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్ల చేతిలో రోస్ట్ అయ్యాడు. దీపావళీ శుభాకాంక్షలు చెబుతూ పర్యావరణానికి హానీ కలిగించే పటాసులు కాల్చవద్దని కోహ్లీ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. దాంతో చిర్రెత్తుకుపోయిన నెటిజన్లు చెప్పేది శ్రీరంగ నీతులు.. చేసేది చెత్త పనులా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నవంబరు 5న నీ పుట్టినరోజు నాడు అర్ధరాత్రి నువ్వు చేసింది ఏంటి..? అని వీడియోలను ప్రస్తావిస్తూ మరీ ప్రశ్నల వర్షం కురిపించారు.

దుబాయ్‌లో బర్త్‌డే వేడుకలు..
ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడుతూ.. విరాట్ తన 32వ జన్మదిన వేడుకలను దుబాయ్‌లో భార్య అనుష్క శర్మ, బెంగళూరు టీమ్‌మేట్స్‌తో కలిసి బోట్‌లో జరుపుకున్నాడు. కోహ్లీకి విషెస్ చెప్తూ.. ఆర్‌సీబీ యాజమాన్యం పెద్ద ఎత్తున తారాజువ్వల్ని, క్రాకర్స్‌ను కాల్చింది. ఆ వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. మరి అప్పుడు బాణాసంచా కాలుస్తుంటే అభ్యంతరం చెప్పని కోహ్లీ.. మరి ఇప్పుడు వాతావరణ కాలుష్యం గురించి గాబరా పడిపోవడం విడ్డూరంగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
నీ లగ్జరీ లైఫ్‌తో దెబ్బతినడం లేదా?
ఇంకొందరు.. ఇంట్లో ఉండే కార్లు.. వాడే ఏసీలతో వాతావరణం దెబ్బతినడం లేదా? అని ఎకీపారేస్తున్నారు. ‘లగ్జరీ లైఫ్ అనుభవించే నువ్వు వాతావరణాన్ని సంరక్షిస్తున్నావా?'అంటూ నిలదీస్తున్నారు. సెలెబ్రిటీలందరికి పండుగపూట ఇలా సలహాలు ఇవ్వడం ఓ ఫ్యాషన్ అయిపోయిందని విసుక్కుంటున్నారు. ‘క్రికెట్ మైదానాలు, బ్యాట్ల కోసం చెట్లు నరకుతున్నారు. నీటిని వృధా చేస్తున్నారు. ఐపీఎల్‌లోనూ పటాసులు కాల్చుతున్నారు. పెళ్లీలు, పేరెంటాలకు వాడుతున్నారు. ఇవన్నీ వాతావారణాన్ని దెబ్బతీయవు కానీ.. ఒక్క దీపావళి రోజు క్రాకర్స్ కాలిస్తే మాత్రం కాలుష్యం పెరుగుతుందంట'అని ఓ యూజర్ అసహనం వ్యక్తం చేశాడు.

ఆసీస్ టూర్‌లో కోహ్లీ..
ఇక ఐపీఎల్ 2020 సీజన్ ముగియడంతో కోహ్లీ నేతృత్వంలోని భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. కరోనా నేపథ్యంలో క్రికెట్ ఆస్ట్రేలియా గైడ్‌లైన్స్ ప్రకారం 14 రోజుల క్వారంటైన్ పాటిస్తుంది. అయితే జట్టుకు ప్రాక్టీస్ చేసుకునే వెసులుబాటు ఉండటంతో భారత ఆటగాళ్లు నెట్స్‌లో శ్రమిస్తున్నారు. రెండు నెలల పాటు జరిగే ఈ సుదీర్ఘ పర్యటనలో భారత్.. నవంబరు 27 నుంచి ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టుల సిరీస్‌లు ఆడనుంది. కరోనా అనంతరం ఇదే తొలి అంతర్జాతీయ టూర్ కావడంతో భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications